యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2023 రెండో రోజు రెండు బంగారు పతకాలతో రెండో స్థానానికి చేరిన ఢిల్లీ


పోటీల రెండో రోజున పసిడి పతకాల ఖాతా తెరిచిన పంజాబ్, గుజరాత్, చండీగఢ్, మణిపూర్

Posted On: 21 JAN 2024 8:44PM by PIB Hyderabad

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 లో రెండో రోజైన ఆదివారం ఆతిథ్య తమిళనాడు, ఢిల్లీ చెరో రెండు బంగారు పతకాలు సాధించగా, పంజాబ్, గుజరాత్, చండీగఢ్, మణిపూర్ జట్లు ఒక్కొక్క బంగారు పతకం సాధించాయి.

బాలికల సంప్రదాయ యోగాలో నవ్య ఎస్ హెచ్ తొలి స్వర్ణం సాధించగా, ఫెన్సర్ అర్లిన్ ఎ వి 15-14తో లక్ష్య బద్సర్ (హర్యానా)పై బాలుర సాబరే లో విజయం సాధించి తమిళనాడు పతకాల పట్టికను నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలకు చేర్చారు.

జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఢిల్లీ జూడో లు ఐదు స్వర్ణ పతకాల్లో రెండింటిని గెలుచుకోవడంతో పాటు రెండు రజత పతకాలు సాధించడంతో పతకాల పట్టికలో ఢిల్లీ రెండో స్థానానికి ఎగబాకింది.

బాలికల 48 కేజీల విభాగంలో తన్నూ మన్ రాష్ట్ర క్రీడాకారిణి జాన్వీ యాదవ్ ను ఓడించి స్వర్ణం సాధించగా, బాలుర 55 కేజీల విభాగంలో అనురాగ్ సాగర్ పంజాబ్ కు చెందిన నకుల్ అరోరాను ఓడించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బాలికల 44 కేజీల విభాగంలో గుజరాత్ కు చెందిన అంకిత ఎన్ చేతిలో ఓడిన దీక్ష రజత పతకం సాధించింది.

చండీగఢ్ కు చెందిన సప్నా (బాలికలు 40 కేజీలు), పంజాబ్ కు చెందిన శివాన్ష్ వశిష్ట్ (బాలుర 50 కేజీలు) బంగారు పతకాలు సాధించారు.

బాలికల సంప్రదాయ యోగా విభాగంలో తమిళనాడుకు చెందిన నవ్య ఎస్ హెచ్ 64.75 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి యోగాసన నుంచి రెండో బంగారు పతకాన్ని సాధించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన అరణ్య హుటైత్ (64.42 పాయింట్లు), రీతూ మొండల్ (63.5 పాయింట్లు) వరుసగా రజతం, కాంస్య పతకాలు సాధించారు.

టి ఎన్ పి ఇ ఎస్ యు లో జరుగుతున్న ఫెన్సింగ్ పోటీల్లో బాలుర ఫాయిల్ ఫైనల్లో మణిపూర్ కు చెందిన కె.అభినాష్ మహారాష్ట్రకు చెందిన తేజస్ పాటిల్ ను ఓడించాడు.

కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ బాలుర చాంపియన్ హర్యానా 45-28తో మహారాష్ట్రపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో రాజస్థాన్ 41-23తో తమిళనాడును ఓడించింది.

ఫలితాలు ( ఆదివారం రాత్రి 7 గంటల వరకు):

పతకాలపట్టిక: https://youth.kheloindia.gov.in/medal-tally

బాస్కెట్ బాల్

బాలికలు:

గ్రూప్ -ఎలో మహారాష్ట్ర 81-54తో కేరళపై విజయం సాధించింది. తమిళనాడు 109-45తో చండీగఢ్ పై విజయం  సాధించింది.

గ్రూప్ -బిలో పంజాబ్ 88-25తో ఉత్తరప్రదేశ్ పై గెలిచింది.

బాలురు:

గ్రూప్ ఎ: ఉత్తరప్రదేశ్ 109-52తో మిజోరంపై విజయం సాధించింది.

గ్రూప్ బి: రాజస్థాన్ 76-74తో చండీగఢ్ పై గెలిచింది. తమిళనాడు 99-72 తో కర్ణాటకపై విజయం సాధించింది.

బాక్సింగ్ (క్వార్టర్ ఫైనల్స్)

 ఫెన్సింగ్

బాలురు:

సాబెర్ : గోల్డ్ మెడల్ మ్యాచ్: అర్లిన్ ఎ వి  (తమిళనాడు) 15-14తో లక్ష్య బాద్సర్ (హర్యానా) పై గెలిచాడు. కాంస్యం: అభిషేక్ (హర్యానా), శిరీష్ అంగల్ (మహారాష్ట్ర) )

ఫోయిల్: కె.అభినాష్ (మణిపూర్) 15-9తో తేజస్ పాటిల్ (మహారాష్ట్ర పై గెలిచాడు. కాంస్యం: సచిన్ (హర్యానా) , రోహన్ షా (మహారాష్ట్ర)

జూడో:

బాలికలు:

40 కేజీలు: స్వర్ణం - సప్నా (సి హెచ్ జి) , రజతం - సౌమ్య రాణి కడపల (ఆంధ్రప్రదేశ్), కాంస్యం - కృతికా సోనీ (హిమాచల్ ప్రదేశ్) , నీలం (యు టి ఆర్)

44 కేజీలు: స్వర్ణం: అంకితా ఎన్ (గుజరాత్ ), రజతం - దీక్ష (ఢిల్లీ) ); కాంస్యం - రోషివినా ఎం (మణిపూర్), యువికా టోకాస్ (ఢిల్లీ)

48 కేజీలు: స్వర్ణం- తన్నూమన్ (ఢిల్లీ), రజతం- జాన్వీ యాదవ్ (ఢిల్లీ) , కాంస్యం- భక్తి భోసలే (మహారాష్ట్ర) ,  నాన్సీ (హర్యానా))

బాలురు:

50 కేజీ: స్వర్ణం - శివాన్ష్ వశిష్ట్ (పుణె)), రజతం - మోహిత్ మూల్యా (మహారాష్ట్ర), కాంస్యం - రిక్సన్ డెబ్బర్మా (త్రిపుర)), టాంగ్ టాడా (అరుణాచల్ ప్రదేశ్)

55 కేజీ: స్వర్ణం - అనురాగ్ సాగర్ (ఢిల్లీ), రజతం - నకుల్ అరోరా (పుణె) ,  కాంస్యం - ఓం సమీర్ హెచ్ (మహారాష్ట్ర), యోహెన్బా వై (మణిపూర్)

 హాకీ

బాలికలు:

గ్రూప్ -ఎ: ఛత్తీస్ గఢ్ 6-0తో తమిళనాడుపై విజయం సాధించింది. మధ్యప్రదేశ్ 4-2తో మిజోరాంపై విజయం సాధించింది.

గ్రూప్ బి: ఒడిశా 5-1తో జార్ఖండ్ పై విజయం సాధించింది. హర్యానా 10-0తో పంజాబ్ ను ఓడించింది.

బాలురు:

గ్రూప్-ఎ: ఒడిశా 6-1తో తమిళనాడుపై, మధ్యప్రదేశ్ 3-2తో పంజాబ్ పై విజయం సాధించాయి.

కబడ్డీ (సెమీఫైనల్స్- కడపటి సమాచారం సమయానికి)

బాలురు: రాజస్థాన్ 41-23తో తమిళనాడును ఓడించింది. హర్యానా 45-28తో మహారాష్ట్రను ఓడించింది.

స్క్వాష్ (రౌండ్ ఆఫ్ 8)

బాలికలు: పూజా ఆర్తి (తమిళనాడు) 11-4, 11-4, 11-6తో యాషి జైన్ (రాజ్) పై గెలిచింది. షమీనా రియాజ్ (తమిళనాడు) 11-2, 11-0, 11-4తో ఖుష్బూ (యూపీ)పై గెలిచింది. దీపికా వి (తమిళనాడు) 11-5, 11-6, 11-9 తో ఛవి శరణ్(రాజస్థాన్) ను ఓడించింది. నిరుపమా దూబే (మహారాష్ట్ర ) 14-12, 5-11, 12-10, 14-16, 11-9తో ఉన్నతి త్రిపాఠి (యూపీ) పై గెలిచింది.

బాలురు: తన్వీత్ సింగ్ ముంద్రా (ఎంపీ) 11-8తో అన్ష్ త్రిపాఠి (యూపీ)పై గెలిచాడు. 11-6, 11-6; సందేశ్ పీఆర్ (తమిళనాడు) 11-9, 11-9, 11-5తో ఎల్.మెయ్యపన్ (తమిళనాడు)పై గెలిచాడు. అరిహంత్ కేఎస్ (తమిళనాడు) 11-9, 4-11, 11-2, 11-8తో కరణ్ యాదవ్ (యూపీ) పై గెలిచాడు. ఆర్యన్ ప్రతాప్ సింగ్ (యూపీ) 14-12, 12-14, 11-5, 8-11, 11-9తో అలోకిత్ సింగ్ (రాజస్థాన్) పై గెలిచాడు.

యోగాసన

బాలికలు: ట్రెడిషనల్: గోల్డ్ - నవ్య ఎస్ హెచ్ (తమిళనాడు) 64.75 పాయింట్లు; రజతం -  అరణ్య హుతైత్ (వెస్ట్ బెంగాల్)  64.42; కాంస్యం - రీతూ మొండల్ (వెస్ట్ బెంగాల్ )  63.5

                                     

కెఐవైజి 2023 గురించి, తమిళనాడు

చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జనవరి 19 నుంచి 31 వరకు 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతున్నాయి.  ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దక్షిణ భారతదేశంలో జరగడం ఇదే తొలిసారి. తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు నగరాల్లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడలకు చిహ్నం వీర మంగై. వీర మంగై అని ముద్దుగా పిలువబడే రాణి వేలు నాచియార్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన భారతీయ రాణి. ఈ చిహ్నం భారతీయ మహిళల శౌర్యానికి, స్ఫూర్తికి ప్రతీక, మహిళా శక్తి బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఆటల లోగోలో కవి తిరువళ్లువర్ బొమ్మ ఉంది. 15 వేదికల్లో 13 రోజుల పాటు జరిగే ఖెలో ఇండియా యువజన క్రీడలలో 26 క్రీడా విభాగాలు, 275 పైగా పోటీలు, 1 డెమో స్పోర్ట్ లో 5600 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు.  ఫుట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి సంప్రదాయ క్రీడలు, కలరిపయట్టు, గట్కా, తంగ్ తా, కబడ్డీ, యోగాసనం వంటి సంప్రదాయ క్రీడల సమ్మేళనం 26 క్రీడాంశాలు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన సిలంబంను డెమో క్రీడగా పరిచయం చేస్తున్నారు.

 

స్పోర్ట్స్ ఫర్ ఎఐఐ  (ఎస్ఎఫ్ఎ) గురించి

స్పోర్ట్స్ ఫర్ ఎఐఐ (ఎస్ఎఫ్ఏ) అనేది భారతదేశపు అతిపెద్ద సాంకేతిక-ఆధారిత బహుళ క్రీడల అట్టడుగు స్థాయి పోటీల (మల్టీ-స్పోర్ట్స్ గ్రాస్ రూట్ కాంపిటీషన్) వేదిక. స్ఫూర్తిదాయకమైన , ఆనందకరమైన క్రీడా అనుభవాల ద్వారా యువత క్రీడల పట్ల ఆకర్షితులు అయ్యేలా చేయడమే దీని లక్ష్యం. 2015 లో ఎస్ఎఫ్ఎ ప్రారంభమైనప్పటి నుండి వ్యవస్థాపకులు రిషికేష్ జోషి ,  విశ్వాస్ చోక్సీ క్రీడల ద్వారా యువత తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి సమ్మిళిత, వైవిధ్యమైన, సురక్షితమైన ,ఉత్తమమైన వేదికను అందించడం ద్వారా దేశంలో పాఠశాల క్రీడా ఛాంపియన్ షిప్ లను మార్చడం ,సమీకరించడంపై దృష్టి సారించారు.

ఎస్ఎఫ్ఏ ఫ్లాగ్ షిప్ ఐ పి అయిన ఎస్ఎఫ్ఎ ఛాంపియన్ షిప్స్ టెక్ , డేటా అనలిటిక్స్ ద్వారా పెద్ద ఎత్తున బహుళ-క్రీడా పోటీల సామర్థ్యాన్ని ముందుకు తెస్తుంది. టెక్నాలజీ ఆధారిత విధానంతో, ఎస్ఎఫ్ఎ SFAPLAY.COM ద్వారా మొత్తం క్షేత్రస్థాయి క్రీడా పర్యావరణ వ్యవస్థను అనుమతిస్తుంది, ఇది భాగస్వాములందరినీ శక్తివంతం చేయడానికి, అనుసంధానించడానికి రూపొందించిన వేదిక.

***


(Release ID: 1998539) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi , Marathi