సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ రామ్ లల్లా పవిత్రోత్సవం కవరేజీకి ప్రత్యేక మీడియా సెంటర్‌ ఏర్పాటు


- అయోధ్య ధామ్‌లోని రామ్ కథా సంగ్రహాలయలో అత్యాధునిక మీడియా సెంటర్ సకల ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ


- ఈవెంట్ రోజున మీడియా ప్రతినిధుల కోసం లక్నో- అయోధ్య మధ్య రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు

Posted On: 21 JAN 2024 6:50PM by PIB Hyderabad

రేపు అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ జాతికి నాయకత్వం వహించనున్నారుఈ కార్యక్రమ కవరేజీ గురించి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అయోధ్య ధామ్లోని రామ్ కథా సంగ్రహాలయలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందిమీడియా సెంటర్ 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 40 మీటర్ల పొడవు మరియు 25 మీటర్ల వెడల్పుతో, 340 వర్క్స్టేషన్లతో, 1,000 మంది మీడియా వ్యక్తులకు వసతి కల్పించే సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సెంటర్‌లోని వ్యక్తుల కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్, మీడియా బ్రీఫింగ్ రూమ్, మీడియా లాంజ్, కెఫెటేరియా, హై-స్పీడ్ వై-ఫై ఇంటర్నెట్, మొబైల్ టాయిలెట్ మరియు ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలలో, ల్యాప్‌టాప్, ఫోటోకాపియర్, ప్రింటర్, నిరంతర ఫలహారాలు మరియు ఆహారాలకు తగిన ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉంచబడ్డాయి. మీడియా సెంటర్‌లో రామ్‌లల్లా ప్రాణ్-ప్రతిష్ఠను వీక్షించేందుకు వీలుగా తొమ్మిది అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో రెండు ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు.

లక్నో మరియు అయోధ్య మధ్య జర్నలిస్టులకు రవాణా సౌకర్యం:

రామ్ లల్లా పవిత్రోత్సవం రోజున అయోధ్య ధామ్‌లో కవరేజీకి వచ్చే మీడియా ప్రతినిధుల కోసం లక్నో మరియు అయోధ్య మధ్య రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉంచబడింది. ఈ సదుపాయం ప్రకారం, జనవరి 22వ తేదీ ఉదయం 4.30 గంటల నుండి ప్రతి 15 నిమిషాల వ్యవధిలో ఏడు బస్సులు లక్నో నుండి అయోధ్యకు బయలుదేరుతాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ బస్సులు మీడియా వ్యక్తులను తిరిగి లక్నోలో దింపుతాయి. బస్సు టైమ్‌టేబుల్స్, సమన్వయ అధికారుల మొబైల్ నంబర్లు తదితర వివరాలను మీడియాకు అందుబాటులో ఉంచారు.

శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

శ్రీ రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్ష ప్రసారం కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి విస్తృత ఏర్పాట్లు చేశాయిదూరదర్శన్ మొత్తం ఈవెంట్ను 4K నాణ్యతతో DD న్యూస్ మరియు DD నేషనల్ ఛానెల్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది విషయమై సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మీడియాతో మాట్లాడుతూజనవరి 22, 2024 దూరదర్శన్లోని 40 కెమెరాల ద్వారా  కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారుదూరదర్శన్ జనవరి 22, 2024 ఏఎన్ఐ మరియు పీటీఐతో అయోధ్యలో జరిగే ఈవెంట్ యొక్క క్లీన్ ఫీడ్ను పంచుకుంటుందన్నారు.

అయోధ్య ధామ్నందు అందుబాటులో ఆరోగ్య సౌకర్యాలు

అయోధ్య ధామ్లోని ప్రజలకు తగిన మరియు సత్వర వైద్య సదుపాయాలను అందించడానికిఅయోధ్యలో వైద్య సహాయం మరియు ఇతర ఆరోగ్య సౌకర్యాల గురించిన సమాచారం స్థానిక పరిపాలన మరియు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెబ్సైట్లలో అందుబాటులో ఉందిజేపీఎన్ఏ ట్రామా సెంటర్ఎయిమ్స్న్యూఢిల్లీ నుండి అనేక బృందాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్య సదుపాయాలను అందించడానికి అయోధ్య ధామ్లోని వివిధ ప్రదేశాలలో ఉన్నాయి.  ప్రాణ ప్రతిష్ఠా వేడుక మరియు సంబంధిత కార్యక్రమాల సందర్భంగా అయోధ్యలో భారత ప్రభుత్వం భీష్మ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసింది.

అయోధ్య ధామ్లో సజావుగా ట్రాఫిక్ నిర్వహణకు ఏర్పాట్లు

ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ధామ్లో సాఫీగా ట్రాఫిక్ సాగేందుకు చేసిన ఏర్పాట్లలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు మరియు మాప్ల్స్ మ్యాప్మీ ఇండియా కలిసి అయోధ్యకు ప్రయాణం సాఫీగాసురక్షితంగా మరియు అవాంతరాలు లేకుండా ఉండేలా చూడనున్నారు సిస్టమ్ కిందఉచిత మ్యాపిల్స్ యాప్తో రూట్ మూసివేతలుట్రాఫిక్ మళ్లింపులు మరియు అనేక ఇతర ట్రాఫిక్ అప్డేట్లను నిజ సమయంలో తెలుసుకోవచ్చుతద్వారా ప్రజలు సాఫీగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. 

***


(Release ID: 1998524) Visitor Counter : 122