రక్షణ మంత్రిత్వ శాఖ
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2024: జనవరి 21 & 22, 2024న న్యూ ఢిల్లీలో జరగనున్న నేషనల్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే; నాలుగు విభాగాల్లో పోటీ పడనున్న 16 జట్లు
Posted On:
20 JAN 2024 2:46PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే నేషనల్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే 21, 22 జనవరి, 2024 లో న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. మొత్తం 16 బ్యాండ్ బృందాలు - ప్రతి జోన్ నుండి నాలుగు (తూర్పు, పశ్చిమం, దక్షిణం మరియు ఉత్తరం) - రెండు రోజుల కార్యక్రమంలో సంగీతంలో మేటి స్థానం కోసం పోటీపడతాయి, ఇది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన విధంగా భారతీయ సంగీతం, ట్యూన్‌లను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిర్వహిస్తున్నారు. పోటీలు నాలుగు విభాగాల్లో (బాయ్స్ బ్రాస్ బ్యాండ్, గర్ల్స్ బ్రాస్ బ్యాండ్, బాయ్స్ పైప్ బ్యాండ్ మరియు గర్ల్స్ పైప్ బ్యాండ్) జరుగుతాయి. 16 జట్ల జాబితా :
క్రమ సంఖ్య
|
పాఠశాల
|
క్యాటగిరీ
|
1.
|
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఆరుగొలను, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
|
పైప్ బ్యాండ్ బాయ్స్
|
2.
|
మహారాజా అగర్సేన్ పబ్లిక్ స్కూల్, అశోక్ విహార్, ఉత్తర దిల్లీ
|
3.
|
ప్రభుత్వం మిజో హై స్కూల్, ఐజ్వాల్, మిజోరం
|
4.
|
పీఎం శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ, సూరత్‌గఢ్, శ్రీగంగానగర్, రాజస్థాన్
|
5.
|
సెయింట్ థెరిసాస్ హయ్యర్ సెకండరీ స్కూల్, కన్నూర్, కేరళ
|
బ్రాస్ బ్యాండ్ గర్ల్స్
|
6.
|
సెయింట్ జేవియర్స్ హయ్యర్ సెకండరీ స్కూల్, పథాలియాఘాట్, సెపాహిజాల, త్రిపుర
|
7.
|
సిటీ మాంటిస్సోరి స్కూల్, కాన్పూర్ రోడ్ క్యాంపస్, లక్నో, ఉత్తర ప్రదేశ్
|
8.
|
కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్, భోపాల్, మధ్యప్రదేశ్
|
9.
|
క్వీన్ మేరీస్ స్కూల్, తీస్ హజారీ, న్యూఢిల్లీ
|
పైప్ బ్యాండ్ గర్ల్స్
|
10.
|
శ్రీ స్వామినారాయణ్ కన్యా విద్యా మందిర్, భుజ్, గుజరాత్
|
11.
|
ద్రౌపది బాలికల ఉన్నత పాఠశాల, నిషాపోసి, మయూర్‌భంజ్, ఒడిశా
|
12.
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఎంఈజి , సెంటర్, సెయింట్ జాన్స్ రోడ్ శివన్ చెట్టి గార్డెన్, బెంగళూరు, కర్ణాటక
|
13.
|
డిఏవి పబ్లిక్ స్కూల్, హమీర్పూర్, హిమాచల్ ప్రదేశ్
|
బ్రాస్ బ్యాండ్ బాయ్స్
|
14.
|
డాన్ బాస్కో హై స్కూల్ & జూనియర్ కాలేజ్, విక్రోలి, ముంబై, మహారాష్ట్ర
|
15.
|
అమలోర్పవన్ హయ్యర్ సెకండరీ స్కూల్, వానరపేట్, పాండిచ్చేరి, పుదుచ్చేరి
|
16.
|
ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్, వెస్ట్ పాయింట్, గాంగ్టక్, సిక్కిం
|
ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు నగదు బహుమతి (1వ - రూ. 21,000. 2వ - రూ. 16,000, 3వ - రూ. 11,000), ట్రోఫీతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రతి విభాగంలో మిగిలిన జట్టుకు ఒక్కొక్కరికి రూ. 3,000 కన్సోలేషన్ నగదు బహుమతిని అందజేస్తారు. గ్రాండ్ ఫినాలే కోసం జ్యూరీని సాయుధ దళాల ప్రతి విభాగంలోని సభ్యులతో సహా రక్షణ మంత్రిత్వ శాఖ నియమిస్తుంది.
పోటీలు మూడు స్థాయిలలో నిర్వహణ. రాష్ట్రం, జోనల్, అన్ని పాఠశాలల (సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ, కేవిఎస్, ఎన్విఎస్, సైనిక్ పాఠశాలలు మొదలైనవి) అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలచే నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో 12,857 మంది చిన్నారులతో కూడిన 486 జట్లు, జోనల్ స్థాయిలో 2,002 మంది చిన్నారులతో కూడిన 73 జట్లు పాల్గొన్నాయి. ఈ చొరవ దేశవ్యాప్తంగా పాఠశాలల్లోని పిల్లలలో దేశభక్తి, ఐక్యత స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడం, సమగ్ర విద్య మార్గంలో వారిని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 1998252)
|