ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్యూబాలో డిజిటల్ పరివర్తన కోసం ప్రజాక్షేత్ర స్థాయిలో విజయవంతమైన డిజిటల్ పరిష్కారాలు పంచుకునేందుకు భారత్‌-క్యూబా ఒప్పందం

प्रविष्टि तिथि: 20 JAN 2024 4:34PM by PIB Hyderabad

ఈ నెల 19న, డిజిటల్ పరివర్తన కోసం జనాభా స్థాయిలో విజయవంతంగా అమలైన డిజిటల్ పరిష్కారాలను పంచుకునేందుకు భారత్‌-క్యూబా మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ - క్యూబా కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

భారతదేశం తరపున, మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్‌ కృష్ణన్ - క్యూబా తరపున, కమ్యూనికేషన్స్ మొదటి ఉప మంత్రి విల్ఫ్రెడో గొంజాలెజ్ విడాల్ ఎంవోయూ మీద సంతకాలు చేశారు. సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడం, ఉత్తమ అభ్యాసాల మార్పిడి, రెండు దేశాల డిజిటల్ వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే ఇతర కార్యకలాపాల్లో పరస్పరం సహకరించుకోవడం ఈ ఒప్పందం ఉద్దేశం.


క్యూబాలో డిజిటల్ పరివర్తన కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు సజావుగా అమలయ్యేలా చూసేందుకు ఒక భాగస్వామ్యాన్ని నిర్మించడానికి భారత్‌ సహకరిస్తుంది.

***


(रिलीज़ आईडी: 1998245) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi