రక్షణ మంత్రిత్వ శాఖ
కోచి నౌకాశ్రయంలో రాయల్ నేవీ నౌక హెచ్‌ఎంఎస్ స్పీ పర్యటన
प्रविष्टि तिथि:
20 JAN 2024 5:45PM by PIB Hyderabad
రాయల్ నేవీకి చెందిన తీర ప్రాంత నిఘా నౌక హెచ్‌ఎంఎస్ స్పీ, ఈ నెల 17న కోచి నౌకాశ్రయానికి వచ్చింది. ఈ నెల 27 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. హెచ్‌ఎంఎస్ స్పీ నౌకకు భారత నౌకాదళం ఘనస్వాగతం పలికింది. సందర్శనలో భాగంగా, భారత నౌకాదళం - రాయల్ నేవీ బృందాల మధ్య అధికారిక సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, క్రీడాపోటీలు జరిగాయి. రాయల్ నేవీ సిబ్బంది ఐఎన్‌ఎస్ సునయనను సందర్శించారు, రెండు నౌకాదళాల మధ్య సహకారం పెంచుకోవడానికి ఉత్తమ పద్ధతులు పంచుకున్నారు. హెచ్‌ఎంఎస్ స్పీ కమాండింగ్ ఆఫీసర్, కమాండర్ పాల్ క్యాడీ, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ఆపరేషన్స్), సదరన్ నేవల్ కమాండ్ కమాండర్ సర్వప్రీత్ సింగ్‌తో సమావేశమై పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
'హెడ్‌క్వార్టర్స్ సీ ట్రైనింగ్' (హెచ్‌క్యూఎస్‌టీ) బృందం భద్రత చర్యలు, నష్ట నియంత్రణ, అగ్నిమాపక అంశాల్లో హెచ్‌ఎంఎస్ స్పీ మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. రెండు నౌకాదళాలు అనుసరించే విధానాలు, ప్రామాణిక పద్ధతులను అర్థం చేసుకోవడానిక ఈ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. సముద్ర భద్రత, శిక్షణ అంశాల్లో పరస్పర సహకారం ఎంత అవసరమో చాటుతూ, నౌకాదళ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఇరువర్గాల నిబద్ధతకు ఈ పర్యటన ఉదాహరణగా నిలిచింది.
VISITOFROYALNAVYSHIPHMSSPEYTOKOCHI0YBF.jpeg)
VISITOFROYALNAVYSHIPHMSSPEYTOKOCHIHOC5.jpeg)
***
(रिलीज़ आईडी: 1998243)
आगंतुक पटल : 225