వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం’ అంటూ తప్పుదోవ పట్టించేలా మిఠాయిల విక్రయాలపై అమెజాన్‌కు కేంద్ర వినియోగదారల సంరక్షణ ప్రాదికారిక సంస్థ నోటీసులు

Posted On: 19 JAN 2024 6:41PM by PIB Hyderabad

చీఫ్ కమిషనర్ శ్రీ రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర వినియోగదారల సంరక్షణ ప్రాదికారిక సంస్థ  (సీసీపీఏ), అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చర్యను ప్రారంభించింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. అమెజాన్.ఇన్ పోర్టల్లో 'శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్' పేరుతో స్వీట్ల విక్రయానికి సంబంధించిసీసీపీఏ చర్యను ప్రారంభించింది. ‘శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్’ ముసుగులో అమెజాన్ స్వీట్ల విక్రయాలకు పాల్పడుతున్న మోసపూరిత వ్యాపార విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) చేసిన ప్రాతినిథ్యం ఆధారంగా ఈ చర్య ప్రారంభించబడింది. ప్రాతినిధ్య పరిశీలనకు అనుగుణంగా, అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ (డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. అమెజాన్.ఇన్)లో "శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్" అని పేర్కొంటూ వివిధ స్వీట్లు/ఆహార ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని గుర్తించబడింది. ఆన్‌లైన్‌లో ఆహార ఉత్పత్తుల విక్రయాన్ని ప్రారంభించడం ద్వారా.. తప్పుడు ప్రాతినిధ్యాలు ఉత్పత్తి యొక్క వాస్తవమైన లక్షణాలకు సంబంధించి వినియోగదారులను తప్పుదారి పట్టించాయి. ఉత్పత్తి యొక్క కచ్చితమైన లక్షణాలను పేర్కొన్నట్లయితే.. వారు తీసుకోని కొనుగోలు నిర్ణయాలు తీసుకునేలా ఇటువంటి చర్యలు వినియోగదారులను తప్పుగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) రూల్స్, 2020లోని రూల్ 4(3) ప్రకారం ఏ ఈ-కామర్స్ సంస్థ తన ప్లాట్‌ఫారమ్‌లో వ్యాపారం చేస్తున్నప్పుడు లేదా మరేదైనా అన్యాయమైన వాణిజ్య విధానాన్ని అనుసరించవద్దని పేర్కొంది. ఇంకా, వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 2(28) కింద నిర్వచించబడిన ‘తప్పుదోవ పట్టించే ప్రకటన’ అంటే ఏదైనా అంటే అటువంటి ఉత్పత్తి లేదా సేవను తప్పుగా వివరించే ప్రకటన; లేదా అటువంటి ఉత్పత్తి లేదా సేవ యొక్క స్వభావం, పదార్ధం, పరిమాణం లేదా నాణ్యత గురించి వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది లేదా తప్పుడు హామీని ఇస్తుంది. అమెజాన్ మిఠాయిల విక్రయాల వల్ల ఇది జరిగినట్టుగా పేర్కొనబడింది.  సీసీపీఏ నోటీసు జారీ చేసి 7 రోజుల లోపు అమెజాన్ నుండి ప్రతిస్పందనను కోరింది. లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు.

నోటీసులో హైలైట్ చేయబడిన ఉత్పత్తులు క్రింది విధంగా ఉన్నాయి –

క్రమ సంఖ్య

ఉత్పత్తి పేరు

అమెజాన్లో ఉత్పత్తి లింకు

1.

శ్రీ రామ మందిరం అయోధ్య ప్రసాద్ - 250 గ్రాములు || రఘుపతి నెయ్యి లడ్డు  - (టైప్ 1 ప్రసాద్- 1x250గ్రా ప్యాక్)

https://www.amazon.in/dp/B0CQXJ13HN?ref_=cm_sw_r_apan_dp_ZKZ5F9X8C368RC679K0A&language=en-IN

2.

అయోధ్య రామ మందిరం అయోధ్య ప్రసాద్ - 250 గ్రాములు || ఖోయా ఖోబీ లడ్డు - (టైప్ 3 ప్రసాద్- 1x250గ్రా ప్యాక్)1

https://www.amazon.in/dp/B0CRJM2PVD/ref=sspa_dk_detail_0?psc=1&pd_rd_i=B0CRJM2PVD&pd_rd_w=XB8MG&content-id=amzn1.sym.0fcdb56a-738b-4621-9da7-d47193883987&pf_rd_p=0fcdb56a-738b-4621-9da7-d47193883987&pf_rd_r=273XDXXXWBZKQSKBKEMM&pd_rd_wg=CGfRM&pd_rd_r=0eebf499-79ab-4289-8fa3-16db3ace294c&s=grocery&sp_csd=d2lkZ2V0TmFtZT1zcF9kZXRhaWwy

3.

శ్రీ రామ మందిరం అయోధ్య ప్రసాద్ - 250 గ్రాములు || నెయ్యి బూందీ లడ్డు - (టైప్ 4 ప్రసాద్- 1x250గ్రా ప్యాక్)

https://www.amazon.in/dp/B0CRJXVVLF/ref=sspa_dk_detail_1?psc=1&pd_rd_i=B0CRJXVVLF&pd_rd_w=1CbI7&content-id=amzn1.sym.0fcdb56a-738b-4621-9da7-d47193883987&pf_rd_p=0fcdb56a-738b-4621-9da7-d47193883987&pf_rd_r=SXQ447D7MFENCE7EM647&pd_rd_wg=VoOns&pd_rd_r=693b20d9-9d8c-437b-b6b9-d8329cf78d76&s=grocery&sp_csd=d2lkZ2V0TmFtZT1zcF9kZXRhaWwy

4.

శ్రీ రామ మందిరం అయోధ్య ప్రసాద్ - 250 గ్రాములు || దేశీ ఆవు పాలు పెడా - (టైప్ 5 ప్రసాద్- 1x250గ్రా ప్యాక్)

https://www.amazon.in/Sri-Ram-Mandir-Ayodhya-Prasad/dp/B0CRJZWQKB/ref=pb_allspark_dp_sims_pao_desktop_session_based_d_sccl_2_2/259-5366117-1404625?pd_rd_w=izZKM&content-id=amzn1.sym.0c2e13d1-3874-45db-864e-478422a97adc&pf_rd_p=0c2e13d1-3874-45db-864e-478422a97adc&pf_rd_r=1BQSA1PN91W9H5DTDA6S&pd_rd_wg=gpXh9&pd_rd_r=dcd88acf-06bb-4429-8e7c-f0cd755640c5&pd_rd_i=B0CRJZWQKB&psc=1

 

***


(Release ID: 1998047) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi