హోం మంత్రిత్వ శాఖ
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను గురువారం(18, జనవరి, 2024) ప్రారంభించిన కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం డిజిటలైజేషన్ దిశగా దూసుకెళ్తోంది
సైబర్ నేరాల నివారణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది
సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ అస్సాం రైఫిల్స్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (ఏఆర్డబ్ల్యూఏఎన్)లో నెట్‌వర్క్ యొక్క నిజ-సమయ పర్యవేక్షణ, బాహ్య బెదిరింపులను తగ్గించడం మరియు సైబర్ ఉల్లంఘనలను నివారించడం ద్వారా సైబర్ భద్రతను బలోపేతం చేస్తుంది.
Posted On:
18 JAN 2024 7:32PM by PIB Hyderabad
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను కేంద్ర హోం శాఖ మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా గురువారం(18, జనవరి, 2024) ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటలైజేషన్ దిశగా దూసుకుపోతోందని అన్నారు. ప్రతి పౌరుడికి సురక్షితమైన ఇంటర్నెట్ అందించడం ద్వారా సైబర్- సక్సెస్ సొసైటీని రూపొందించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని హోం, సహకార మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
కార్యకలాపాలను ఆధునీకరించడంలో అస్సాం రైఫిల్స్ చేస్తున్న కృషిని కేంద్ర హోంమంత్రి ప్రశంసించారు. అస్సాం రైఫిల్స్ వైడ్ ఏరియా నెట్‌వర్క్‌లో నెట్‌వర్క్ (ఏఆర్డబ్ల్యూఏఎన్) యొక్క నిజ-సమయ పర్యవేక్షణ, బాహ్య బెదిరింపులను తగ్గించడం మరియు సైబర్ ఉల్లంఘనలను నివారించడం ద్వారా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఫోర్స్ యొక్క సైబర్ సెక్యూరిటీ పనితీరును మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ 24 x 7 సేవలను అందించడానికి అత్యాధునిక నెట్‌వర్క్ & డేటా మానిటరింగ్ పరికరాలతో అమర్చబడిందన్నారు. అంతరాయాలు లేని మరియు సురక్షితమైన డిజిటల్ సేవలను అందించడంలో అస్సాం రైఫిల్స్ సమిష్టి కృషిని అ మిత్ షా ప్రశంసించారు.
అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో (సీఏపీఎఫ్) ఈ కేంద్రం ఇదే మొదటిది. ప్రస్తుత కాలంలో పెరిగిన సైబర్ దాడులు, దుర్మార్గపు చొరబాటుదారులు, హ్యాకింగ్ మరియు ఇతర సైబర్ చొరబాట్ల నుండి దేశ నెట్‌వర్క్‌లను రక్షించడం అత్యవసరం. ప్రస్తుత మౌలిక సదుపాయాలు కార్యకలాపాలతో అనుబంధించబడిన విభిన్న అంశాల ఏకీకరణ మరియు నిర్వహణను ఇది అనుమతిస్తుంది.
***
(Release ID: 1998044)