సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
రాబోయే తరం పరిపాలనా సంస్కరణలపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వం డిఏఆర్పిజి పరిపాలనా సంస్కరణల పథకం కోసం రెండు సంవత్సరాలకు (2024-25 మరియు 2025-26) రూ. 235.10 కోట్ల కేటాయింపునకు ఆమోదం
పరిపాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకురావడానికి ఏఐ సహాయక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (సిపిగ్రామ్స్) అభివృద్ధి కోసం రూ. 128 కోట్ల ప్రాజెక్ట్ ఆమోదం, పరిపాలనా సంస్కరణల కోసం రూ. 107 కోట్లు కేటాయింపు
సేవల సంతృప్తత, చివరి మైలు వరకు పౌరులకు అడ్డంకులు లేని సర్వీస్ డెలివరీ, సమర్థవంతమైన నిర్ణయాధికారం కోసం ప్రభుత్వ ప్రక్రియ రీఇంజనీరింగ్, నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లను బలోపేతం చేయడం మొదలైనవి కొత్త పథకంలోని కొన్ని కీలక అంశాలు.
प्रविष्टि तिथि:
18 JAN 2024 3:39PM by PIB Hyderabad
15వ ఫైనాన్స్ కమిషన్ చక్ర గమనంలో వచ్చే రెండేళ్లలో (2024-25 మరియు 2025-26) అమలు చేయడానికి డిఏఆర్పిజి పరిపాలనా సంస్కరణల కోసం పునరుద్ధరించిన స్కీమ్ కోసం రూ. 235 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. వికసిత భారత్ కొత్త ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పథకం ప్రతిష్టాత్మకమైన తదుపరి తరం పరిపాలనా సంస్కరణలను చేపడుతుంది. పరిపాలనా సంస్కరణల కోసం పునరుద్ధరించిన పథకం 2 అంశాలను కలిగి ఉంది (ఎ) ప్రజా ఫిర్యాదుల పరిష్కారం (బి) పరిపాలనా సంస్కరణల కోసం సమగ్ర వ్యవస్థ.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సమగ్ర వ్యవస్థ పథకానికి రూ.128 కోట్లు కేటాయించింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏఐ ఎనేబుల్డ్ సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మెరుగుపరచడం, జాప్యాన్ని తగ్గించడం లక్ష్యంగా 10-దశల సీపీగ్రామ్స్ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ప్రాజెక్ట్ అన్ని ఇతర ఫిర్యాదుల పోర్టల్‌లను ఏకీకృతం చేస్తుంది, తద్వారా సీపీగ్రామ్స్ ప్రజల ఫిర్యాదుల కోసం అతిపెద్ద ఇంటర్‌ఫేస్‌గా మారుతుంది. 2023లో, సీపీ గ్రామ్స్ నవంబర్ చివరి వరకు 19,60,021 పీజీ కేసులను స్వీకరించింది. 19,45,583 పీజీ కేసులు పరిష్కరించింది. కేంద్ర సెక్రటేరియట్‌లో ఫిర్యాదుల పరిష్కారం గత 17 నెలలుగా నెలకు 1 లక్ష కేసులు దాటింది. రాష్ట్రం/యూటీలలో ఫిర్యాదుల పరిష్కారం నెలకు 50 వేలు దాటింది. 2023 క్యాలెండర్ సంవత్సరంలో పౌరుల నుండి బిఎస్ఎన్ఎల్ కాల్ సెంటర్ ద్వారా 8,21,372 ఫీడ్‌బ్యాక్‌లు సేకరించారు. డిసెంబర్ 2023 చివరి నాటికి సంతృప్తి శాతం 43 శాతంగా ఉంది. సగటు ఫిర్యాదుల పరిష్కార సమయం 17 రోజులకు తగ్గింది. పునరుద్ధరించబడిన పథకం లోతైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, ఫిర్యాదుల పరిష్కార అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం, సీపీగ్రామ్స్ వెర్షన్ 7.0 అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ. 107 కోట్ల కేటాయింపుతో పరిపాలనా సంస్కరణల పథకం, ఈ క్రింది పథకాల కోసం వనరులను ఉపయోగించుకోవాలన్నది ప్రతిపాదన:
* 2024-25 మరియు 2025-26 సంవత్సరానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ కోసం ప్రధానమంత్రి అవార్డుల పథకం
* 2024-25 మరియు 2025-26 కోసం జాతీయ ఇ-గవర్నెన్స్ అవార్డుల పథకం
* సివిల్ సర్వీసెస్ డే సదస్సుల నిర్వహణ
* రాష్ట్రాలు/యూటీలు, ఇ-గవర్నెన్స్ పద్ధతుల్లో సుపరిపాలనలో ఉత్తమ పద్ధతులను అమలు చేయడం కోసం ప్రాంతీయ సమావేశాలు. రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులలో పది ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదన.
* గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, నేషనల్ ఇ-సర్వీసెస్ డెలివరీ అసెస్‌మెంట్, డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌తో సహా డాక్యుమెంటేషన్ మరియు డిసెమినేషన్ కార్యకలాపాలు.
* ఫిబ్రవరి 2025లో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ వార్షిక సమావేశం.
* ప్రత్యేక ప్రచారాల అమలు - 2024, 2025లో స్వచ్ఛతను సంస్థాగతీకరించడం, ప్రభుత్వంలో పెండెన్సీని తగ్గించడం కోసం ప్రత్యేక ప్రచారం, నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యాన్ని పెంచే చొరవ, సుశాసన్ సప్తాహ్ 2024, 2025 ఈవెంట్‌లు.
* అంతర్జాతీయ పరస్పరం ఇచ్చి పుచ్చుకునే, సహకార కార్యకలాపాలు.
***
(रिलीज़ आईडी: 1997632)
आगंतुक पटल : 152