సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత్ సంకల్ప యాత్ర (వీబీఎస్ వై ) సామాన్య పౌరుల్లో ఆకాంక్షను, గౌరవాన్ని పెంచి, రాజకీయ, అధికార స్థాయిలో పని సంస్కృతిలో మార్పు తీసుకు వచ్చింది.... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


వీబీఎస్ వై ద్వారా తమ కలలను ప్రభుత్వం సాకారం చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు... డాక్టర్ జితేంద్ర సింగ్

వికసిత భారత్ లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో నిర్వహించిన భేటీలో జమ్మూ నుంచి పాల్గొన్న మంత్రి

Posted On: 18 JAN 2024 6:38PM by PIB Hyderabad

వికసిత  భారత్ సంకల్ప యాత్ర (విబిఎస్ వై) సామాన్య పౌరుడిలో ఆకాంక్ష, గౌరవాన్ని పెంచి రాజకీయ, అధికారిక స్థాయిలో పని సంస్కృతిలో మార్పును తీసుకువచ్చిందని కేంద్ర శాస్త్ర  సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)  పీఎంవో, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష శాఖ  సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  వికసిత భారత్ లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో నిర్వహించిన భేటీలో జమ్మూ నుంచి  ఈరోజు మంత్రి పాల్గొన్నారు. 

కార్యక్రమం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రజల ఆలోచనా దృక్పధంలో మార్పు తెచ్చిందని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మెరుగు పడిందని శ్రీ జితేంద్ర సింగ్ తెలిపారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రారంభమైన తర్వాత ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయని మంత్రి చెప్పారు.

 

గతంలో పనులు కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేక సార్లు తిరగాల్సి వచ్చేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసినా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు విసుగు చెంది నిరాశకు గురి కావాల్సి వచ్చేదని మంత్రి అన్నారు. అయితే, ప్రస్తుతం వ్యవస్థలో సమూల మార్పు వచ్చి పనులు తక్షణం పూర్తి అవుతున్నాయని మంత్రి వివరించారు.

వీబీఎస్ వై ద్వారా తమ కలలను ప్రభుత్వం సాకారం చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు కార్యరూపం దాలుస్తున్నాయని తెలిపారు. పేద బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు పీఎం ఆవాస్ యోజన కింద సొంత ఇళ్లు లభించాయని శ్రీ జితేంద్ర సింగ్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రయోజనాలు పొందాలని ప్రజలను కోరుతున్నారని మంత్రి అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందించడానికి ప్రభుత్వం చర్యలు అమలు చేస్తుందన్నారు.

పీఎం ఉజ్వల యోజన వల్ల మహిళలకు సాధికారత, గౌరవం లభించాయని శ్రీ జితేంద్ర సింగ్ అన్నారు. దీనివల్ల మహిళల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడాయని అన్నారు. వంట చేస్తున్నప్పుడు విలువడే విషవాయువుల నుంచి మహిళలకు రక్షణ లభించిందన్నారు. స్వచ్ఛ భారత్ గ్రామీణ ప్రాంతాల ముఖం చిత్రాన్ని పూర్తిగా మార్చివేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడంతో మహిళలు, ప్రజలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అభివృద్ధి సాధించాలి అన్న లక్షంతో ప్రభుత్వం కారా్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోందని మంత్రి వివరించారు. అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సు, అభివృద్ధి కోసం అంకితం అయ్యారని శ్రీ జితేంద్ర సింగ్ తెలిపారు. ఓట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా కేవలం దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని శ్రీ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. 

 

***


(Release ID: 1997612) Visitor Counter : 126
Read this release in: English , Urdu , Hindi