రక్షణ మంత్రిత్వ శాఖ
ఎన్ సీ సి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా భావి నాయకులుగా మార్చే ఉద్యమం: ఎన్ సీ సి గణతంత్ర దినోత్సవ శిబిరంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్
Posted On:
18 JAN 2024 4:57PM by PIB Hyderabad
"నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సీ సి ) కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, యువతను మరింత బాధ్యతాయుతమైన మరియు దేశభక్తి గల పౌరులుగా మార్చే ఉద్యమం" అని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జనవరి 18, 2024 న ఢిల్లీ కాంట్‌లో ఎన్ సీ సి రిపబ్లిక్ డే క్యాంప్‌ను సందర్శించినప్పుడు అన్నారు. భారతదేశంలోని భావి నాయకులను రూపొందించడంలో ఎన్ సీ సి చేస్తున్న కృషిని కొనియాడుతూ, ఈ శిబిరాన్ని విభిన్న సంస్కృతులు, భాషలు మరియు సంప్రదాయాల సమ్మేళనంగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ వేదికపై దేశం యొక్క వైవిధ్యమైన చైతన్యవంతమైన ప్రతిష్ఠను మరియు దాని ఐక్యత యొక్క గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
క్యాడెట్‌లలో విలువలు, నైపుణ్యాలను పెంపొందించడం మరియు వారి నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఎన్ సీ సి అందిస్తున్న సేవను రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రశంసించారు. 'ఐక్యత మరియు క్రమశిక్షణ' అనే తన నినాదానికి అనుగుణంగా, ఎన్ సీ సి మొదటి నుండి ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫాం యువజన సంస్థగా ఎదిగిందని ఆయన అన్నారు.
శ్రీ అజయ్ భట్ ఎన్‌సిసి క్యాడెట్‌గా తన రోజులను గుర్తుచేసుకున్నారు మరియు సంస్థ తనలో గర్వాన్ని నింపిందని పేర్కొన్నారు. 'పునీత్ సాగర్ అభియాన్', 'గంగా ఉత్సవ్ ప్రచారం', 'స్వచ్ఛ భారత్ అభియాన్', 'ప్లాస్టిక్ కాలుష్య ప్రచారం', 'కోస్టల్ క్లీన్-అప్ డే' మరియు 'ప్రపంచ నదుల దినోత్సవం' మొదలైన సమాజ సేవా పథకాలలో వారు చేసిన ప్రశంసనీయమైన కృషి సానుకూల ప్రభావం చూపిందనీ ప్రశంసించారు. రాజ్యాంగంలోని ఆదర్శాలకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని మరియు ఈ గణతంత్ర దినోత్సవం రోజున మరింత సమగ్రమైన మరియు బలమైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేయాలనే పిలుపుతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
కార్యక్రమంలో భాగంగా, రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్ సీ సి యొక్క స్మార్ట్ క్యాడెట్‌లు అందించిన ఆకట్టుకునే 'గార్డ్ ఆఫ్ హానర్'ని సమీక్షించారు. అనంతరం కపుర్తలాలోని సైనిక్ స్కూల్‌లోని ఎన్‌సీసీ క్యాడెట్‌లు బ్యాండ్ ప్రదర్శనను అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీ అజయ్ భట్ వివిధ సామాజిక అవగాహన ఇతివృత్తాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను చిత్రీకరించిన 'ఫ్లాగ్ ఏరియా'ని కూడా సందర్శించారు. రాష్ట్ర డైరెక్టరేట్ల గురించి ఆయనకు వివరించారు, ఆ తరువాత, రక్షణ శాఖ సహాయ మంత్రి జాతీయ సమైక్యత మరియు భారతదేశ ఘన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాన్ని చూశారు.
***
(Release ID: 1997611)
Visitor Counter : 104