పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
ఆరోగ్యవంతమైన రేపటి దిశగా ఆరోగ్యవంతమైన గ్రామం పై ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జాతీయ వర్క్ షాప్ ను ప్రారంభించిన పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్
సమగ్ర ,సుస్థిర అభివృద్ధి కోసం ప్రతి గ్రామ పంచాయితీ వ్యూహాత్మకంగా అన్ని ఎల్ ఎస్ డి ఎస్ ల ఇతివృత్తాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన శ్రీ పాటిల్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థవంతమైన, దార్శనిక నాయకత్వంలో, ఆలోచనా ధోరణి మారుతోంది - దేశం మారుతోంది - శ్రీ పాటిల్
వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది -సహాయ
మంత్రి
సుమారు 13,000 గ్రామ పంచాయితీలు ఆరోగ్యవంతమైన గ్రామం హోదాను సాధించాలని, ఎల్ ఎస్ డి ఎస్ ల ఆరోగ్య గ్రామ ఇతివృత్త లక్ష్యాన్ని సాధించడానికి సంకల్పం తీసుకునేలా ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలవాలని తీర్మానించాయి: కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్
జాతీయ వర్క్ షాప్ కు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 800 మందికి పైగా హాజరు
Posted On:
18 JAN 2024 5:52PM by PIB Hyderabad
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో ‘ఆరోగ్యవంతమైన రేపటి దిశగా ఆరోగ్యవంతమైన గ్రామం ' అనే అంశంపై మూడు రోజుల జాతీయ వర్క్ షాప్ ను ఈ రోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ బూడి ముత్యాలనాయుడు, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ తన ప్రధానోపన్యాసంలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పునర్నిర్మాణం తో పాటు దృఢంగా ముందుకు సాగుతోందని అన్నారు. అందరికీ ఆరోగ్యం శ్రేయస్సును నిర్ధారించడంలో ప్రభుత్వ వనరులు , చొరవలకు అదనంగా గ్రామ పంచాయితీ స్థాయిలో సహకార ప్రయత్నాల పరివర్తన శక్తి, దృఢ సంకల్పం గురించి శ్రీ పాటిల్ వివరించారు. క్షేత్రస్థాయి సహకార ఆవశ్యకత గురించి చెబుతూ, స్థానిక సాధికారత, కమ్యూనిటీ భాగస్వామ్యం కోసం ఎల్ ఎస్ డి జి ల కింద నిర్దేశించిన తొమ్మిది లక్ష్యాలపై దృష్టి సారించాలని కోరారు.

సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీ వ్యూహాత్మకంగా అన్ని ఎల్ ఎస్ డీజీలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని శ్రీ పాటిల్ నొక్కి చెప్పారు. సమర్థవంతమైన, దూరదృష్టి గల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజల ఆలోచన ధోరణి లోనూ, దేశం లోనూ వస్తున్న మార్పు ను ఆయన వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా చైతన్యవంతమైన గ్రామాలను ఊహించి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గుర్తించిన తొమ్మిది స్థానికీకరించిన సుస్థిర లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.

శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ కర్బన తటస్థత వైపు ప్రపంచవ్యాప్త మార్పును ప్రశంసించారు. భారతదేశ గణనీయమైన పురోగతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వానిదే ఘనత అని అన్నారు. జమ్ముకశ్మీర్ లోని సాంబా జిల్లా పరిధిలోని పల్లి గ్రామపంచాయతీలో పునరుత్పాదక ఇంధనం, కార్బన్ న్యూట్రల్ మొదటి చొరవ గురించి ప్రస్తావిస్తూ, ఈ దిశగా అన్ని పంచాయతీ రాజ్ సంస్థలు పనిచేయాలని శ్రీ పాటిల్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మెరుగైన రేపటి కోసం పల్లె గ్రామపంచాయతీ నమూనాను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, శ్రీ బూడి ముత్యాల నాయుడు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులను ఉపయోగించి కన్వర్జెన్స్ ద్వారా వెల్నెస్ సెంటర్లను నిర్మిస్తున్నామని చెప్పారు. కేంద్ర పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ,పంచాయితీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ బూడి ముత్యాల నాయుడు గ్రామ పంచాయితీ సర్పంచిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారని, ఇప్పుడు ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారని తెలుసుకొని పాల్గొనేవారు ప్రేరణ పొందారు. సర్పంచ్ పదవి నుంచి ఉన్నత పదవుల వరకు సాగిన వీరి ప్రయాణం పంచాయతీ ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

జాతీయ వర్క్ షాప్ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రసంగిస్తూ, లభ్యత, అందుబాటు, తక్కువ ఖర్చు, తగిన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా అన్ని వయసుల వారి ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఎల్ ఎస్ డి జి ల రెండవ థీమ్ ను సంస్థాగతం చేయడానికి ప్రజల ఆధారిత విధాన రూపకల్పన , సమర్థవంతమైన అమలు అవసరాన్ని వివరించారు.
మూడు ప్రధాన ప్రాధాన్యతలను గుర్తించడానికి గ్రామ పంచాయితీల పాత్రను ఆయన నొక్కిచెప్పారు: మొదటిది, అవగాహన కల్పించడం; రెండవది, ఆరోగ్య సేవలను సులభంగా పొందడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడం; మూడవది, పంచాయితీలు , ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం, బాల సభ, మహిళా సభ, రోగి కళ్యాణ్ సమితి (రోగుల సంక్షేమ కమిటీ), స్వాస్థ్య సమితి (ఆరోగ్య కమిటీ) మొదలైన అన్ని ఫోరమ్ లు, కమిటీలు సమర్థవంతంగా పనిచేసేలా చూడటం. శ్రీ భరద్వాజ్ కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశ స్థితిస్థాపకతను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశం తన స్వంత వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, ఇది దేశంలో ఆవిష్కరణ, సంకల్పాల శక్తి , సానుకూల ప్రభావానికి నిదర్శనం అని అన్నారు.

సుమారు 13,000 గ్రామ పంచాయితీలు ఆరోగ్యవంతమైన గ్రామం హోదాను సాధించాలని తీర్మానించాయని, ఆరోగ్యకరమైన గ్రామం అనే ఎల్ ఎస్ డిజి థీమ్ లక్ష్యాన్ని సాధించడానికి సంకల్పం తీసుకునేలా ఈ గ్రామ పంచాయితీలు ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తాయని కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు. వాటాదారులందరికీ తమ పరస్పర ఆలోచనలు, అభిప్రాయాలు , ఉత్తమ పద్ధతులను పంచుకునే అవకాశాన్ని జాతీయ వర్క్ షాప్ కల్పిస్తుందని శ్రీ భరద్వాజ్ చెప్పారు.
జాతీయ వర్క్ షాప్ లో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్, ఎంఓపీఆర్ జాయింట్ సెక్రటరీ శ్రీ వికాస్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ డి అండ్ పిఆర్ విభాగం కమిషనర్ శ్రీమతి ఎ సూర్య కుమారి, ఇతర ప్రముఖులు, పంచాయతీ ప్రతినిధులు పాల్గొంటున్నారు.
జాతీయ వర్క్ షాప్ నుద్దేశించి అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ ప్రసంగిస్తూ, టిబి-ముక్త్ పంచాయితీ చొరవ సహా ఆరోగ్యకరమైన గ్రామం కోసం పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ, సంబంధిత మంత్రిత్వ శాఖలు / డిపార్ట్ మెంట్ లు , రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తీసుకున్న అనేక కార్యక్రమాలను ప్రస్తావించారు. డాక్టర్ సి.ఎస్.కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలకు కోట్లాది సంఖ్యలో సందర్శకులు వచ్చారని, ఇది చివరి మైలు వరకు ఆరోగ్య సేవలను అందించడం లో ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో హెల్తీ విలేజ్ కార్యక్రమాల కింద చేపట్టిన కార్యక్రమాలు ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన భారతదేశానికి దోహదం చేస్తున్నాయని, పంచాయితీలు వేగంగా ఆరోగ్యవంతమైన గ్రామాలుగా రూపాంతరం చెందుతున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేష స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాలు, అర్హులైన లబ్ధిదారులందరికీ ఆయుష్మాన్/ ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయడం, 1000 గ్రామాల్లో పూర్తయిన స్వమిత్వ పథకం అమలు, కిచెన్ గార్డెన్ల ద్వారా పౌష్టికాహార ఆధారిత ప్రయోజనాలను అందించడం, అల్పాదాయ వర్గాల పౌష్టికాహార ప్రమాణాలకు విస్తరించడం తదితర కార్యక్రమాల్లో సుమారు 14 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు.

ఈ జాతీయ వర్క్ షాప్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు, ఎన్ ఆర్ డి అండ్ పి ఆర్, ఎస్ఐఆర్ డీ అండ్ పీఆర్, పంచాయతీరాజ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్, ఐక్యరాజ్యసమితి/ జాతీయ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాదాపు 800 మంది పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, స్థానిక చర్యలను ప్రోత్సహించడం, వనరులను సమీకరించడం, ఆరోగ్యకరమైన గ్రామీణ సమాజాలను పెంపొందించడానికి ఉద్దేశించిన వ్యూహాలు, కార్యక్రమాలపై చర్చించడానికి విధాన రూపకర్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు, పంచాయతీ ప్రతినిధులు , భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడానికి తిరుపతిలోని జాతీయ వర్క్ షాప్ తగిన , శక్తివంతమైన వేదికగా ఆవిర్భవించింది. 
జాతీయ వర్క్ షాప్ లో పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, కిందిస్థాయి అధికారులు పాల్గొంటున్నారు. థీమ్ 2 కింద హెల్తీ విలేజ్ పై ప్రతిష్ఠాత్మక జాతీయ పంచాయతీ అవార్డులు అందుకున్న పంచాయతీలు ఆరోగ్యవంతమైన గ్రామాలను సృష్టించే లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారించిన మూడు రోజుల జాతీయ వర్క్ షాప్ లో చిన్న వీడియో ఫిల్మ్ ప్రజెంటేషన్ ద్వారా తమ ఉత్తమ పద్ధతులు , అంతర్లీన అనుభవాలను పంచుకోనున్నాయి. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, ఝాప్ గో, నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ఏ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఎన్ఐహెచ్ఎఫ్ డబ్ల్యూ), నింహాన్స్ , ట్రాన్స్ ఫార్మ్ రూరల్ ఇండియా ఫౌండేషన్ (టీఆర్ఐఎఫ్) వంటి జాతీయ ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవో) ప్రతినిధులు కూడా ఈ జాతీయ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు.
వివిధ వర్కింగ్ గ్రూపులు హెల్తీ విలేజ్ కు సంబంధించిన విభిన్న అంశాలపై చర్చిస్తాయి. పోషకాహార లోపం, జీవనశైలి వ్యాధులు, దోమల ద్వారా పుట్టిన వ్యాధిని తగ్గించడానికి వివిధ ప్రోత్సాహక, నివారణ చర్యల ద్వారా ఆరోగ్యకరమైన గ్రామాన్ని ఊహించడానికి వ్యూహాలు, విధానాలు , రోడ్ మ్యాప్, ముఖ్యమైన ఆరోగ్య సూచికలను కొలవడం, పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటంలో పిఆర్ఐల పాత్రపై ప్రజెంటేషన్ వారి అంతర్దృష్టులను అందిస్తుంది.

సామర్ధ్యం పెంపొందించడం , శిక్షణకు సంబంధించి అత్యుత్తమ వ్యూహాలు, విధానాలు, ఏకీకృత చర్యలు , సృజనాత్మక నమూనాలను ప్రదర్శించడం, ఉత్తమ పద్ధతులు; మానిటరింగ్ ఫ్రేమ్వర్క్, ప్రోత్సాహం ,గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి) లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబించడం వర్క్ షాప్ ప్రధాన లక్ష్యం; ఈ వర్క్ షాప్ సహకారం, విజ్ఞాన భాగస్వామ్యం , ఆరోగ్యకరమైన రేపటిని నిర్మించే దిశగా వ్యూహరచన చేయడానికి ఒక ప్రత్యేక వేదికను అందిస్తుంది. ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి) స్థానికీకరణకు ఉద్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ (ఎల్ ఎస్ డి జి లు), క్షేత్రస్థాయిలో నిర్దిష్ట సవాళ్లు , అవకాశాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ ఎస్ డి జి ల థీమ్ 2 అంటే హెల్తీ విలేజ్, ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. 
***
(Release ID: 1997571)
Visitor Counter : 147