పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా 2024 ను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా



' అమృత కాలంలో ప్రపంచంతో భారతదేశాన్ని అనుసంధానించడం: భారత విమానయాన రంగం @ 2047 ' ఇతివృత్తంతో ప్రదర్శన నిర్వహణ

* ఉడాన్ 5.3 ప్రారంభం తో పాటు పలు కీలక అంశాలు ప్రకటించిన శ్రీ సింధియా

* విమానయాన రంగంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది.. శ్రీ సింధియా

* 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధించేందుకు ప్రణాళిక .. శ్రీ సింధియా

* సమస్యల పరిష్కారం, సరళీకృత విధానాలు, సామర్ధ్య నిర్మాణం ద్వారా లక్ష్య సాధన దిశగా ప్రయాణం.. శ్రీ సింధియా

* అందుబాటు, లభ్యత, స్థోమతకు ప్రతీక భారతీయ విమానయాన రంగం.. శ్రీ సింధియా

Posted On: 18 JAN 2024 3:03PM by PIB Hyderabad

విమాన సేవలు అందిస్తున్నాయి అని మంత్రి వివరించారు. ఈ పథకం కింద నడుస్తున్న 2.5 లక్షలకు పైగా విమాన సర్వీసుల వల్ల 1.32 కోట్లకు పైగా ప్రజలు ప్రయోజనం పొందారని తెలిపారు. దాదాపు రూ.3,100 కోట్ల వీజీ ఎఫ్ అందించామని, 1300 ఉడాన్ మార్గాలను కేటాయించామని, ఈ పథకం కింద 517 రూట్లను అమలు చేశామన్నారు. దేశంలో నిరంతరాయంగా రవాణా సేవలు అందించడానికి భారతదేశంలో హెలికాప్టర్, చిన్న విమానాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి వెల్లడించారు. . చిన్న విమాన పథకాలు, సీప్లేన్ మార్గాలు, హెలికాప్టర్ మార్గాల కోసం ప్రత్యేక ఉడాన్ వేలం పాటలు జరిగాయన్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ సేవలు లభించేలా చూసి, భద్రతను పెంపొందించడానికి గగన్ పేరుతో ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. మానవ వనరుల అభివృద్ధితో సహా సామర్థ్య నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవసరమైన సంఖ్యలో పైలెట్లు, విమాన సిబ్బంది, ఇంజినీర్లు లభించేలా చూసేందుకు విధానాలను సులభతరం చేశామని మంత్రి తెలిపారు. దేశంలో ఎఫ్టిఒల సంఖ్యను గణనీయంగా పెంచి రంగానికి అవసరమైన మానవ వనరులను అందిస్తున్నామని శ్రీ సింధియా అన్నారు. . గత రెండేళ్లుగా దేశంలో రికార్డు స్థాయిలో కమర్షియల్ పైలట్ లైసెన్సులు జారీ చేస్తున్నామని, 2023లో ఈ సంఖ్య 1,622 సీపీఎల్లను దాటిందని, ఇది 2022లో నమోదైన 1165 సీపీఎల్లను 40 శాతం అధిగమించిందని మంత్రి తెలిపారు.

వింగ్స్ ఇండియా 2024 లో ఏడు కీలక ప్రకటనలు: 

* పౌర విమానయానంపై ఫిక్కీ, కేపీఎంజీ సంయుక్త నాలెడ్జ్ పేపర్ విడుదల

 *ఉడాన్ 5.3 ప్రారంభం 

* మరిన్ని విమానాల కొనుగోలుతో ఎయిర్ బస్-ఎయిరిండియా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం, రాబోయే సంవత్సరాల్లో 10 ఫ్లైట్ సిమ్యులేటర్లు, 10,000 మంది పైలట్లతో గురుగ్రామ్ లో ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు

* టాటా ఏఎస్ఎల్, మహీంద్రా ఏరోస్పేస్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఎయిర్ బస్సు తయారీ ఒప్పందాలు *ఏరోస్పేస్ పరిశ్రమలో సుస్థిర శిక్షణను అభివృద్ధి చేయడంలో బహుళ నమూనాలతో సహకరించడానికి జిఎంఆర్ , ఇండిగో కూడా ఒక కన్సార్టియంపై సంతకం చేశాయి

* జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ప్రారంభోత్సవం

* 17 నెలల వ్యవధిలో 200 విమానాల కొనుగోలు కోసం ఆకాష్ ఎయిర్ సంస్థ ప్రకటన 

ఈ కార్యక్రమంలో పౌర విమానయాన, రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) డాక్టర్ వికె సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అసాంగ్బా చుబా ఆవో పాల్గొన్నారు.


(Release ID: 1997522) Visitor Counter : 199