నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం సహ రుణాలు ఇవ్వడం కోసం చేతులు కలిపిన ఐఆర్ఇడిఎ & ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు
Posted On:
18 JAN 2024 11:46AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా భిన్నమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సహ రుణాలు, రుణాల సిండికేషన్ కోసం సహకార యత్నాలకు వేదికను ఏర్పరచేందుకు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు (ఐఒబి)తో భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ) అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. వివిధ రకాల సేవలను ఆవరిస్తూ, ఈ ఎంఒయులో అన్ని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సహ రుణాలు, సహ ఆరంభోత్పత్తి మద్దతుకు నియమాలు ఉన్నాయి.
ఐఆర్ఇడిఎ రుణ గ్రహీతల కోసం రుణ సిండికేషన్, పూచీకత్తు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (టిఆర్ఎ) నిర్వహణతో పాటుగా, ఐఆర్ఇడిఎ రుణాల కోసం 3-4 సంవత్సరాల వ్యవధిలో స్థిరవడ్డీ రేట్ల దిశగా పనిచేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.
ఈ ఒప్పందాన్ని 16 జనవరి 2024న న్యూఢిల్లీలోని ఐఆర్ఇడిఎ బిజినెస్ సెంటర్‌లో చేసుకున్నారు. ఎంఒయుపై ఐఆర్ిడిఎ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్, ఐఒబి ఎండి& సిఇఒ శ్రీ అజయ్ కుమార్ శ్రీవాస్తవ; ఐఆర్ఇడిఎ డైరెక్టర్ (ఫైనాన్స్) డాక్టర్ బిజయ్ కుమార్ మొహంతి సమక్షంలో ఐఆర్ఇడిఎ జనరల్ మేనేజర్ డాక్టర్ ఆర్.సి. శర్మ, ఐఒబి చీఫ్ రీజినల్ మేనేజర్ శ్రీ అనిల్‌కుమార్‌లు పంతకాలు చేశారు.
ఈ అవగాహనా ఒప్పందం గురించి ఐఆర్ ఇడిఎ సింఎడి శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ మాట్లాడుతూ, ఐఆర్ఇడిఎ & ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అన్నది దేశంలో పునరుత్పాదక ఇంధన వృద్ధిని వేగవంతం చేయాలన్న మా నిబద్ధతలో ఒక ముఖ్యమైన అడుగు. మా బలాలను, వనరులను కలపడం ద్వారా, వివిధ రకాల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు బలమైన ఆర్ధిక మద్దతును అందించాలని, స్థిరత్వాన్ని, పర్యావరణం పట్ల అవగాహనను పెంచి పోషించాలన్నది మా లక్ష్యం. ఈ ఎంఒయు, ఇతర ప్రముఖ ఆర్ధిక సంస్థలతో ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందాల ద్వారా, ఐఆర్ఇడిఎ అన్నది భారీ స్థాయి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు నిధులను అందించే మంచి స్థితిలో ఉంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఆధారిత విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యాన్ని సాధిస్తామన్న గౌరవ ప్రధాని సిఒపి 26లో చేసిన ప్రకటనకు సమలేఖనంగా ఉంది.
ఈ సహకారం అన్నది బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, బ్యాంక్ ఆప్ మహారాష్ట్రతో సహా ఇతర ప్రముఖ ఆర్థిక సంస్థలతో ఐఆర్ఇడిఎ విజయవంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించింది. ఈ ఎంఒయులు కూడా దేశవ్యాప్తంగా వివిధ రకాల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సహ రుణాలు, రుణ సిండికేషన్‌పై దృష్టి సారిస్తాయి.
***
(Release ID: 1997520)
Visitor Counter : 160