ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఈ యూ - ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఫ్రేమ్‌వర్క్ కింద సెమీకండక్టర్స్ సానుకూల వ్యవస్థ కోసం కార్యనిర్వహణ ఏర్పాట్లుపై భారతదేశం మరియు యూరోపియన్ కమిషన్ మధ్య అవగాహన ఒప్పందాన్ని క్యాబినెట్ ఆమోదించింది.
Posted On:
18 JAN 2024 12:58PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గానికి సెమీకండక్టర్స్ సానుకూల వ్యవస్థ కోసం దాని సరఫరా వ్యవస్థ పై కార్యనిర్వహణ ఏర్పాట్లుపై ఈ యూ - ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఫ్రేమ్‌వర్క్ కింద 2023 నవంబర్ 21న రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం యూరోపియన్ కమీషన్ మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందం గురించి వివరించబడింది.
వివరాలు:
పరిశ్రమలు మరియు డిజిటల్ టెక్నాలజీల అభివృద్ధి కోసం సెమీకండక్టర్‌ను మెరుగుపరచడం కోసం భారతదేశం మరియు ఈ యూ - మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎమ్ఒయు ఉద్దేశించబడింది.
అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:
ఈ ఎమ్ఒయు సంతకం చేసిన తేదీ నుండి అమలులోకి వస్తుంది మరియు ఈ ఎమ్ఒయు యొక్క లక్ష్యాలను సాధించినట్లు ఇరుపక్షాలు నిర్ధారించే వరకు లేదా ఒక వైపు ఈ ఎమ్ఒయు భాగస్వామ్యాన్ని నిలిపివేసే వరకు కొనసాగవచ్చు.
ప్రభావం:
జీ 2జీ మరియు బి 2 బి ద్వైపాక్షిక సహకారం రెండూ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ యొక్క సుద్రుడతను పెంచడానికి మరియు సెమీకండక్టర్ల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి పరిపూరకరమైన బలాన్ని పెంచుతాయి.
నేపథ్య సమాచారం
ఎలక్ట్రానిక్స్ తయారీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఎం ఈ ఐ టీ వై చురుకుగా పని చేస్తోంది. భారతదేశంలో బలమైన మరియు స్థిరమైన సెమీకండక్టర్ డిస్ప్లే పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని నిర్ధారించే ఉద్దేశ్యంతో భారతదేశంలో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. సెమీకండక్టర్ ఫ్యాబ్స్, డిస్ప్లే ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్స్/సిలికాన్ ఫోటోనిక్స్/సెన్సార్స్/డిస్క్రీట్ సెమీకండక్టర్స్ మరియు సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ మరియు ప్యాకేజింగ్/అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టికండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ సౌకర్యాలు కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఇంకా, దేశంలో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి భారతదేశం యొక్క వ్యూహాలను అమలు చేయడానికి డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద ఇండియా సెమీకండక్టర్ మిషన్ స్థాపించబడింది.
ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ ఫ్రేమ్‌వర్క్‌ల క్రింద ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అభివృద్ధి చెందుతున్న మరియు అధునాతన రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఎం ఈ ఐ టీ వై చురుకుగా కృషి చేస్తోంది. ఈ లక్ష్యంతో, ద్వైపాక్షిక సహకారాన్ని మరియు సమాచార మార్పిడిని ప్రోత్సహించడానికి మరియు భారతదేశం విశ్వసనీయ భాగస్వామిగా ఆవిర్భవించేలా సరఫరా వ్యవస్థ సుద్రుడతను నిర్ధారించడానికి ఎం ఈ ఐ టీ వై వివిధ దేశాల సంస్థలు/ఏజెన్సీలతో అవగాహన ఒప్పందాలు/ ఎం ఓ సీలు/ ఒప్పందాలను కుదుర్చుకుంది. సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థ ను పెంచడానికి మరియు సెమీకండక్టర్ల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి పరిపూరకరమైన బలాన్ని పెంచుకోవడానికి ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడం, భారతదేశం మరియు ఈ యూ పరస్పర ప్రయోజనకరమైన సెమీకండక్టర్ సంబంధిత వ్యాపార అవకాశాలు అభివృద్ధి కి భారతదేశం మరియు ఈ యూ మధ్య జరిగిన ఈ ఎమ్ఒయుపై సంతకం ద్వారా ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మరో అడుగు వేశాయి.
***
(Release ID: 1997469)
Visitor Counter : 130