ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డిజిటల్ పరివర్తన కోసం భారీ స్థాయిలో విజయవంతంగా అమలు చేసిన డిజిటల్ పరిష్కారాలను పంచుకునే అంశంపై భారతదేశం,కెన్యా దేశాల మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
Posted On:
18 JAN 2024 1:00PM by PIB Hyderabad
డిజిటల్ పరివర్తన కోసం భారీ స్థాయిలో విజయవంతంగా అమలు చేసిన డిజిటల్ పరిష్కారాలను పంచుకునే అంశంపై భారతదేశం,కెన్యా దేశాల మధ్య అవగాహన ఒప్పందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కెన్యా సమాచార ప్రసార,డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖల మధ్య పరస్పర మార్పిడిపై ఒప్పందం కుదిరింది. అవగాహన ఒప్పందంపై 2023 డిసెంబర్ 5న రెండు దేశాలు సంతకాలు చేశాయి.
వివరాలు:
డిజిటల్ పరివర్తన కార్యక్రమాల అమలులో రెండు దేశాల మధ్య సహకారం పెంపొందించి, అనుభవాల మార్పిడి, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు ప్రోత్సహించడానికి రెండు దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అమలు ప్రణాళిక, లక్ష్యాలు :
ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేసిన రోజు నుంచి అమల్లోకి వచ్చే ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమలు జరుగుతుంది.
ప్రభావం
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో రెండు దేశాల మధ్య జీ2జీ, బీ2జీ ద్వైపాక్షిక సహకారం పెరుగుతుంది.
ప్రయోజనాలు
ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలకు దారితీసే మెరుగైన సహకారానికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది.
నేపథ్యం
ఐసిటి రంగంలో ద్వైపాక్షిక , బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి అనేక దేశాలు , బహుళపక్ష సంస్థలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తోంది. ఐసిటి రంగంలో సహకారం, సమాచార మార్పిడి ప్రోత్సహించడానికి వివిధ దేశాలకు చెందిన తన మంత్రిత్వ శాఖలు / ఏజెన్సీలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎంఒయు / ఎంఒసి / ఒప్పందాలు కుదుర్చుకుంది. భారతదేశాన్ని డిజిటల్ రంగంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిలో భాగంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. మారుతున్న దృక్పథంలో పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యాపార అవకాశాలను అన్వేషించడం, ఉత్తమ పద్ధతులు పంచుకోవడం, డిజిటల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం తక్షణ చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
గత కొన్నేళ్లుగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపి) అమలులో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించి ఇతర దేశాల దృష్టిని ఆకర్షించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ప్రజలకు డిజిటల్ విధానంలో ప్రభుత్వం సేవలను విజయవంతంగా అందించింది.
భారత్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి, భారత్ తో ఎంవోయూలు కుదుర్చుకోవడానికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
ప్రభుత్వ సేవలు అందించడానికి జనాభా స్థాయిలో భారతదేశం ఇండియా స్టాక్ సొల్యూషన్స్ పేరిట ఒక డిపిఐ అభివృద్ధి చేసి అమలు చేసింది. రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడం,, డిజిటల్ చేరికను ప్రోత్సహించడం, ప్రజా సేవకు అంతరాయం లేని ప్రాప్యతను కల్పించడం లక్ష్యంగా ఇండియా స్టాక్ సొల్యూషన్స్ అమలు జరుగుతోంది. ఓపెన్ టెక్నాలజీ ఆధారంగా ఇండియా స్టాక్ సొల్యూషన్స్ అభివృద్ధి చెందింది. సృజనాత్మక, సమ్మిళిత పరిష్కారాలను ప్రోత్సహించే పరిశ్రమ, ప్రజల భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవడానికి అనువుగా వ్యవస్థను రూపొందించారు. డిపిఐని నిర్మించడంలో ప్రతి దేశానికి ప్రత్యేకమైన అవసరాలు, సవాళ్లు ఉన్నాయి, అయినప్పటికీ ప్రాథమిక కార్యాచరణ సమానంగా ఉంటుంది, ఇది ప్రపంచ సహకారాన్ని అనుమతిస్తుంది.
****
(Release ID: 1997317)
Visitor Counter : 121