కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యుఎస్ఎ పరివర్తనాత్మక పర్యటన చేసిన టెలికమ్యూనిషన్స్ కార్యదర్శి
Posted On:
17 JAN 2024 1:05PM by PIB Hyderabad
భారతీయ సాంకేతిక నైపుణ్యం, ప్రపంచ సహకారానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తూ, 12 జనవరి 2024నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో టెలికమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి నిర్మాణాత్మక పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో కీలకాంశాలలో అనేక అంశాలు ఉన్నాయి. అవిః
వాషింగ్టన్ డిసిలో పాన్ఐఐటి 2024 కార్యక్రమంః
పాన్ఐఐటి 2024 కార్యక్రమంలో డిఒటి కార్యదర్శి సాంకేతికత దౌత్యంః భౌగోళిక రాజకీయ పరిదృశ్యాన్ని అధిగమించడం అన్న అంశంపై ప్రేరణాత్మక కీలకోపన్యాసాన్ని ఇచ్చారు. భారతదేశ డిజిటల్ పరివర్తనపై నొక్కి చెప్తూ, ఐసిటి రంగం వృద్ధికి కీలకమైన సరఫరా గొలుసులను బహుముఖీయం చేసేందుకు సాంకేతిక దౌత్యం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. భారతీయ పరిశోధన ప్రాజెక్టుల కోసం నైపుణ్యం మార్పిడిన పెంపొందించడం, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత దిశగా స్టార్టప్‌లకు మార్గనిర్దేశనం చేయడం కోసం పాన్ఐఐటి యుఎస్ఎలో ఒక ఉమ్మడి కార్య ప్రణాళికపై సంతకాలు చేశారు.
క్వాంటం కమ్యూనికేషన్స్ సహకారం కోసం చికాగో విశ్వవిద్యాలయంలో అన్వేషణః
క్వాంటం కమ్యూనికేషన్స్‌లో భారత్ స్వావలంబనను పెంచాలనే వ్యూహాత్మక చర్యగా, కార్యదర్శి చికాగో విశ్వవిద్యాలయంలో పర్యటించారు. లోతైన చర్చలలో పాల్గొనడం, క్వాంటం కమ్యూనికేషన్ల ప్రయోగశాలలలో పర్యటించడం ద్వారా ఆయన క్వాంటం నెట్‌వర్క్స్ & క్వాంటం టెలిపోర్టేషన్‌లలో ఆయన సంభావ్య సహకారాన్ని అన్వేషించారు.
ఈ చొరవ భారతదేశంలోని క్వాంటం కమ్యూనికేషన్స్‌లో పరిశోధన& అభివృద్ధిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
యుఎస్ఎ డిప్యూటీ ఎన్ఎస్ఎ - మిస్ ఆన్ న్యూబెర్జెర్‌తో సమావేశంః
యుఎస్ఎ డిప్యూటీ ఎన్ఎస్ఎ మిస్ ఆన్ న్యూబెర్జెర్‌తో కార్యదర్శి సమావేశం అయిన ఫలితంగా, యుఎస్- ఇండియా బహిరంగ ఆర్ఎఎన్ (ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్) ను వేగవంతం చేసేందుకు రోడ్ మ్యాప్ క్రమబద్ధీకరణ, విడుదల చేయడం జరిగింది. ఈ మైలురాయి ఒప్పందం ఓపెన్ రాన్ ఉత్పత్తుల ఇంటర్ఆపరబిలిటీ, మోహరింపులను పెంచడంలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రపంచ సాంకేతిక పురోగతి వైపు గణనీయమైన పురోగతిని సూచిస్తూ, భవిష్యత్ తరం కమ్యూనికేషన్ సాంకేతికతలలో ఉమ్మడి ప్రయత్నాలపై ఇరుపక్షాలూ ఏకీభావించాయి.
ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో చర్చలు
టెలికాం కార్యదర్శి ప్రపంచ బ్యాంకులో సీనియర్ ఎండి యాక్సెల్ వాన్ ట్రోట్సెన్‌బర్గ్, దక్షిణాసియా ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్, మౌలిక సదుపాయాల ఉపాధ్యక్షుడు గ్వాంగ్జే చెన్, వ్యూహాత్మక & కార్యనిర్వహణ డరెక్టర్ క్విమియాఒ ఫ్యాన్ ను కలిశారు.
డిజిటల్ పబ్లిక్ ఇన్ర్ఫాస్ట్రక్చర్, సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ప్రోత్సాహం వంటి భారతీయ చొరవల చుట్టూ చర్చలు తిరిగాయి. దక్షిణాషియా, ఆఫ్రికన్ ప్రాంతాలపై నిర్దిష్ట దృష్టితో ఐటియు/ యుఎన్ ‘ఎఐ ఫర్ గుడ్’ ప్రయత్నంలో చేరాలని ప్రపంచ బ్యాంకును ఆహ్వానించారు.
ఈ పర్యటన ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతతో సజావుగా సమలేఖనం చేస్తూ సాంకేతిక నైపుణ్యం, అంతర్జాతీయ సహకారం, స్వావలంబన పట్ల
టెలికమ్యూనికేషన్స్ శాఖ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
***
(Release ID: 1996963)
Visitor Counter : 152