ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ ఎమ్.జి.రామచంద్రన్ జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 17 JAN 2024 8:26AM by PIB Hyderabad

తమిళ చలనచిత్ర రంగ ప్రముఖుడు మరియు తమిళ నాడు యొక్క పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.జి. రామచంద్రన్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఈ రోజు న, మహనీయుడు శ్రీ ఎమ్. జి. ఆర్. ను ఆయన యొక్క జయంతి సందర్భం లో మనం స్మరించుకోవడం తో పాటు గా ఆయన యొక్క జీవనాన్ని వేడుక వలె జరుపుకొంటాం. తమిళ చలనచిత్ర రంగం లో సిసలైన ఆరాధనీయుడు గాను మరియు దూరదర్శి నేత గాను ఆయన ను గురించి చెప్పుకోవాలి; ఆయన నటించిన చలనచిత్రాలు, మరీ ముఖ్యం గా సామాజిక న్యాయం మరియు సహానుభూతి ఆధారం గా రూపుదిద్దుకొన్న సినిమా లు వెండితెర కు తోడు గా ప్రజల యొక్క హృదయాల లో సైతం సజీవంగానే ఉంటాయి. ఒక నాయకుని గా మరియు ముఖ్యమంత్రి గా ఆయన ప్రజల యొక్క సంక్షేమం కోసం అలుపు అనేదే ఎరుగక పాటుపడ్డారు, తత్ఫలితం గా తమిళ నాడు యొక్క ప్రగతి పైన, ఇంకా అభివృద్ధి పైన క చిరకాలిక ప్రభావం ప్రసరించింది. ఆయన యొక్క కార్యాలు మనల కు నిరంతరం గా ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

"தலைசிறந்த எம்.ஜி.ஆர் அவர்களின் பிறந்த தினத்தை நினைவு கூர்ந்து அவரது வாழ்க்கையை இன்று கொண்டாடுகிறோம். அவர் தமிழ் சினிமாவின் உண்மையான அடையாளமாகவும், தொலைநோக்கு மிக்க தலைவராகவும் இருந்தார்.  அவரது திரைப் படங்களில் நிறைந்திருந்த சமூக நீதி மற்றும் கருணை ஆகியவை, வெள்ளித்திரைக்கு அப்பாலும் இதயங்களை வென்றன.  தலைவராகவும், முதலமைச்சராகவும் மக்கள் நலனுக்காக அயராது உழைத்தவர், தமிழகத்தின் வளர்ச்சி மற்றும் மேம்பாட்டில் நீடித்த தாக்கத்தை ஏற்படுத்தியவர். அவரது பணி தொடர்ந்து நமக்கு ஊக்கம் அளிக்கிறது."

 

 

***

DS/ST



(Release ID: 1996894) Visitor Counter : 104