రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

లద్దాఖ్‌లోని జంస్కార్ నదిపై సాహస యాత్రను ప్రారంభించిన నౌకాదళాధిపతి

प्रविष्टि तिथि: 17 JAN 2024 9:10AM by PIB Hyderabad

నౌకాదళాధిపతి, అడ్మిరల్ ఆర్ హరికుమార్, 'ఇండియన్ నేవీ చాదర్ ట్రెక్'ను (లద్దాఖ్‌లోని గడ్డకట్టిన జంస్కార్ నది ఆరోహణ), 16 జనవరి 24న, ఐఎన్‌ఎస్‌ శివాజీ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. సాహస యాత్ర బృందం నాయకుడు కమాండర్‌ నవనీత్ మాలిక్‌కు మంచు గొడ్డలిని అందించి, యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 14 మంది సభ్యులున్న బృందం, 11,000 అడుగుల ఎత్తున్న శిఖరాన్ని అధిరోహించి, జాతీయ జెండాను & నౌకాదళం పతాకాన్ని ఆవిష్కరిస్తుంది.

భారత నౌకాదళం సాహసోపేత స్ఫూర్తిని ఈ యాత్ర ప్రతిబింబిస్తుంది. సవాళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని సిబ్బందిలో పెంచడం ఈ సాహస యాత్ర లక్ష్యం.

***


(रिलीज़ आईडी: 1996849) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil