శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఐఐఎస్‌ఎఫ్ 2023లో 'వైజ్ఞానిక' పేరిట శాస్త్రీయ విజ్ఞాన సమ్మేళనం
Posted On:
14 JAN 2024 2:29PM by PIB Hyderabad
'ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్' ఐఐఎస్‌ఎఫ్ 2023లో, 'వైజ్ఞానిక' పేరిట శాస్త్రీయ విజ్ఞాన సమ్మేళనం జరగనుంది. భారతదేశ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించడం, శాస్త్ర&సాంకేతికత రంగాల్లో విజయాలను పంచుకునేందుకు ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించే లక్ష్యంతో ఈ సమ్మేళనం జరుగుతుంది. ఈ నెల 18, 19 తేదీల్లో, హరియాణా ఫరీదాబాద్‌లోని 'రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ' (ఆర్‌సీబీ) ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్‌ఐఎస్‌సీపీఆర్), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్-ఇండియా (ఎన్‌ఐఎఫ్), విజ్ఞాన భారతి (విభ) సమన్వయంతో విజ్ఞాన సమ్మేళనం జరుగుతుంది.
జనవరి 18న, ఐఐటీ బాంబే సీనియర్ ప్రొఫెసర్ బీఎన్ జగతాప్ అధ్యక్షతన, “సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ ఔట్రీచ్ ఇన్ ఇండియా” అంశంపై శాస్త్రీయ కార్యక్రమం ఉంటుంది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ మాజీ డైరెక్టర్ డా.దినకర్ ఎం సాలుంకే, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేసీ బన్సల్, న్యూదిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డా.ఉమా కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
భారతీయ భాష సమితి చైర్మన్ శ్రీ చాము కృష్ణశాస్త్రి అధ్యక్షతన, “అప్నీ భాషా అప్నా విజ్ఞాన్: స్ట్రెంగ్తెనింగ్ సైన్స్ కామర్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్” అంశంపై చర్చ జరుగుతుంది. హిందీ, పంజాబీ, మణిపురి, తమిళం, అస్సామీ, మలయాళ విజ్ఞానవంతులు ఈ కార్యక్రమంలో మాట్లాడతారు.
సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్ మాజీ చీఫ్ సైంటిస్ట్ శ్రీ హసన్ జవైద్ ఖాన్, ప్రముఖ సైన్స్ కమ్యూనికేటర్ డా. హెచ్‌ఎస్ సుధీర ఆధ్వర్యంలో, 'సైన్స్ రైటింగ్' కార్యశాల కూడా ఏర్పాటు చేస్తారు. "సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ ఇండియా: కరెంట్ ట్రెండ్స్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్" అంశంపై దీనిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు పరిశోధన పత్రాలను సమర్పిస్తారు. హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌కు చెందిన డా. పీకే జోషి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది.
తర్వాత, ఒక వైజ్ఞానిక నాటిక సహా కళలు-విజ్ఞానం సంగమంతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
2వ రోజు (19 జనవరి 2024) ఉదయం, “క్రియేటివ్ సైన్స్ కమ్యూనికేషన్ త్రూ ఫిల్మ్స్, పాడ్‌క్యాస్ట్స్ & సోషల్ మీడియా - ఆంప్లిఫైయింగ్ రీచ్” అంశంపై చర్చాగోష్టి ఉంటుంది. పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు కూడా జరుగుతాయి.
దక్కన్ కళాశాల విశ్రాంత వీసీ ప్రొఫెసర్ వసంత్ షిండే అధ్యక్షతన, "ఛాలెంజెస్ ఇన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రీసెర్చ్ & కమ్యూనికేషన్" అంశంపై మరొక చర్చాగోష్టి కూడా అదే రోజున జరుగుతుంది. నేషనల్ బాల్ భవన్ విశ్రాంత డైరెక్టర్ డా. మధుపంత్ అధ్యక్షతన 'వైజ్ఞాన్ కవి సమ్మేళన్' కూడా ఉంటుంది.
సాయంత్రం "సైన్స్ కమ్యూనికేషన్ ఫర్ వసుధైక కుటుంబం" అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అంతర్జాతీయ ప్రముఖ రచయితలు మార్క్ ప్రెన్‌స్కీ, యయాసన్ ఇనోవాసి మలేషియా (వైఐఎం) సీఈవో డా. షర్మిల బింటి మొహమ్మద్ సల్లె ఈ కార్యక్రమం హాజరవుతారు.
సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్ నుంచి డా.పరమానంద బర్మన్ & డా. మోనిక జగ్గీ, ఎన్‌ఐఎఫ్ నుంచి డా.నితిన్ మౌర్య & రాహుల్ ప్రకాష్, విభ నుంచి డా.మాధవ్ గోవింద్ & డా.నీల్ సరోవర్ భవేష్ వైజ్ఞానిక 2023 సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్‌లోని 'సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్' (ఎస్‌ఎంసీసీ), ఐఐఎస్‌ఎఫ్ 2023 మీడియా ప్రచారాన్ని సమన్వయం చేస్తుంది. భారతదేశ ఆర్&డీ పురోగతి, శాస్త్రీయ విజయాలను మీడియాలోని వివిధ వేదికల ద్వారా ప్రచారం చేయడం ఎస్‌ఎంసీసీ ముఖ్య లక్ష్యం.
***
(Release ID: 1996113)
Visitor Counter : 302