కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సి-డాట్ సందర్శించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆధునిక భద్రతా పరిష్కారాలను, కొనసాగుతున్న సాంకేతిక కార్యక్రమాలను సిడిఎస్‌కు ప్రదర్శించిన సి-డాట్
సి-డాట్ పరిశోధనా బృందం ఆర్&డి కృషిని ప్రశంసించిన జనరల్ చౌహాన్
భవిష్యత్, అత్యాధునిక సురక్షిత టెలికాం పరిష్కారాల అభివృద్ధి కోసం రక్షణ దళాలు, సి-డాట్ మధ్య విస్త్రత సహకారాన్ని నొక్కి చెప్పిన సిడిఎస్
Posted On:
12 JAN 2024 2:05PM by PIB Hyderabad
కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ప్రధాన సంస్థ, టెలికాం ఆర్&డి కేంద్రం అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్)ను ఢిల్లీ క్యాంపస్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్ ) జనరల్ అనిల్ చౌహాన్ సందర్శించారు. ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అన్న దార్శనికతకు అనుగుణంగా దేశ అవసరాలు, రక్షిత టెలికాం పరిష్కారాలను దేశీయంగా అభివృద్ధి చేయడంలో సి-డాట్ చురుకుగా పని చేస్తోంది.
భద్రతా కార్యనిర్వహణ కేంద్ర (నెట్‌వర్క్‌పై అప్పటికప్పుడు మాల్‌వేర్‌ను గుర్తించగల) , కీలక బట్వాడా పరిమాణాన్ని, తదనంతర పరిమాణ క్రిప్టోగ్రఫీ సహా కీలక ఎంటర్‌ప్రైజ్ భద్రతా కేంద్రం ( అన్ని అంతిమ బిందువులు/ కేంద్రాలను ఆవరిస్తూ ఒక వాణిజ్య సంస్థకు ప్రమాదకరమైన ముప్పులను దాడులను అప్పటికప్పుడు గుర్తించి తగ్గించడం) కమైన టెలికాం భద్రతా రంగాలటెలికాం వివిధ టెలికాం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో/ పరిష్కారాలు) పై సి-డాట్ సిఇవి డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్‌కు, సైనిక దళాల సీనియర్ అధికారులకు వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చారు.
4 జి కోర్ & 4జి ఆర్ఎఎన్, 5జి కోర్ & 4జి ఆర్ఎఎన్, సిఎపిని ఉపయోగించి విపత్తు నిర్వహణ పరిష్కారం, ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ & యాక్సెస్ సొల్యూషన్ (పరిష్కారం అందుబాటు), స్విచ్చింగ్ & రూటింగ్ పరిష్కారం తదితరాలను కూడా చర్చించారు. దీని అనంతరం, వినియోగ సందర్భాలను పట్టి చూపుతూ ఈ పరిష్కారాలకు సంబంధించి ప్రయోగశాల ప్రదర్శనలు జరిగాయి.
సి-డాట్ ఇంజినీర్లతో ముచ్చటిస్తూ, ఆధునిక యుద్ధంలో నెట్‌వర్క్ కేంద్రితం నుంచి డాటా కేంద్రితంగా పటం మారుతున్న తరుణంలో భవిష్యత్, అత్యాధునిక సురక్షిత కమ్యూనికేషన్ పరిష్కరాల ఏకీకరణ కోసం సి-డాట్‌కు, భారతీయ సాయుధ దళాల త్రివిధ దళాలకు మధ్య మెరుగైన సమన్విత చర్య అవసరాన్ని నొక్కి చెప్పారు.
భారతీయ సాయుధ దళాలకు అవసరమైన, ఆవశ్యకమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేసేదిశగా సి-డాట్ కట్టుబడి ఉంటుందని సి-డాట్ సిఇఒ డాక్టర్ ఉపాధ్యాయ హామీ ఇచ్చారు.
మన దేశం పరివర్తనలో ఉంది, మనం డిజిటైజేషన్ పథంలో పయనిస్తున్నాం, మన చర్యలన్నీ స్వదేశీకరణ దిశగా ఉన్నాయి అని జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. సి-డాట్ సందర్శన ఒక ఆవిష్కరణం, మన కమ్యూనికేషన్ వ్యవస్థను, సైబర్ స్పేస్‌ను పరిరక్షించగల సామర్ధ్యం మన దేశానికి ఉందనే విశ్వాసంతో తిరిగి వెడుతున్నాను, అని జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
సిడిఎస్ జనరల్ చౌహాన్ నేతృత్వంలోని మొత్తం రక్షణ బృందానికి సి-డాట్ కృతజ్ఞతలు తెలిపింది, ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. ఈ నిశ్చితమైన అద్భుత విజయంతో మరింత ముందకు తీసుకువెళ్ళేందుకు తన దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించింది.
***
(Release ID: 1995738)
Visitor Counter : 214