బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్నిర్మాణం జరుగుతోంది


ఆర్థిక మంత్రిత్వ శాఖ పునర్వ్యవస్థీకరణను ఆమోదించింది

Posted On: 11 JAN 2024 6:00PM by PIB Hyderabad

కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ అనేది కోల్‌కతా, ఢిల్లీలో కార్యాలయాలు, ధన్‌బాద్, రాంచీ, బిలాస్‌పూర్, నాగ్‌పూర్, సంబల్‌పూర్, కొత్తగూడెంలలో ఫీల్డ్ ఆఫీసులను కలిగి ఉన్న బొగ్గు మంత్రిత్వ శాఖ సబార్డినేట్ కార్యాలయం. నాణ్యతపై నిఘాతో సహా బొగ్గు సరసమైన ఉత్పత్తి, వాణిజ్య లావాదేవీలను నిర్ధారించడానికి కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వివిధ చట్టాలు/నిబంధనల క్రింద వివిధ విధులను నిర్వహిస్తుంది.

బొగ్గు రంగ సంస్కరణల్లో ప్రస్తుత పరిస్థితులతో సంస్థను సమన్వయం చేయడానికి, ఎంసిఎల్ మాజీ సీఎండీ, మాజీ  కోల్ కంట్రోలర్    శ్రీ ఏన్ సహాయ్ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్, 2019లో కోల్ కంట్రోలర్స్ ఆఫీస్ విధులను సమీక్షించడానికి. కమర్షియల్ మైనింగ్‌ను నియంత్రించడం, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని 1 బిలియన్ టన్నులు సాధించడం కోసం బొగ్గు కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్నిర్మాణాన్ని కమిటీ ప్రతిపాదించింది. సున్నా దిగుమతితో. బొగ్గు కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్నిర్మాణం చివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ (డిఓఈ) 20.10.2023 తేదీతో ఆమోదించబడింది. కొత్త మంజూరైన సిబ్బంది (130) :

 

Manpower

Group A

Group B

Group C

Total

Gazetted

Gazetted

Non-Gazetted

Non-Gazetted

 

43

15

16

56

130

 

మంజూరైన 130 మంది సిబ్బంది కోసం రిక్రూట్‌మెంట్ రూల్స్ ఆమోదం, కొత్త మంజూరైన పోస్టుల భర్తీ ప్రక్రియ బొగ్గు మంత్రిత్వ శాఖ,  కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వద్ద ప్రాసెస్‌లో ఉంది.

***


(Release ID: 1995555) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi