ఆయుష్
రేపు గౌహతిలో హోమియోపతి ప్రాంతీయ పరిశోధనా సంస్థకు శంకుస్థాపన చేయనున్న కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
11 JAN 2024 4:56PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ 12 జనవరి 2024న గౌహతిలోని అజారాలో హోమియోపతి ప్రాంతీయ పరిశోధనా సంస్థ శాశ్వత క్యాంపస్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్నెస్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 53.89 కోట్లు మంజూరయ్యాయి.
ఈ సంస్థ 1984లో గౌహతిలోని ఒడల్‌బక్రా వద్ద అద్దె భవనంలో హోమియోపతి క్లినికల్ రీసెర్చ్ యూనిట్‌గా స్థాపించబడింది. ప్రస్తుతం ఇది గౌహతిలోని భేటపరాలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ పాత భవనంలో ఉంది.
మాతా, శిశు ఓపిడి మరియు ఎల్‌ఎస్‌డి క్లినిక్ వంటి ప్రత్యేక ఓపిడిలతో పాటు ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఓపిటితో చుట్టుపక్కల జనాభాకు ఆరోగ్య అవసరాలను ఇన్స్టిట్యూట్ అందిస్తోంది. స్థానికంగా ఓపిటిలు మరియు అవగాహన శిబిరాలను కూడా ఎప్పటికప్పుడు సంస్థ నిర్వహిస్తుంది.
ఇన్స్టిట్యూట్ చాలా నామమాత్రపు ధరలకు టెస్ట్‌లను అందిస్తోంది. చర్మ సంబంధిత రుగ్మతలు, కలరా / గ్యాస్ట్రోఎంటెరిటిస్, క్రానిక్ సైనసిటిస్ & బ్రోన్కైటిస్, ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యం, గర్భాశయ ఫైబ్రాయిడ్, ఓటిటిస్ మీడియా, హైపర్‌టెన్షన్, బొల్లి, సోరియాసిస్, మైగ్రేన్ మొదలైన వాటిపై క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
ఇది కాకుండా స్వాస్త్య రక్షణ కార్యక్రమం, ఎస్‌సి శిబిరాలు, ఆరోగ్యవంతమైన పిల్లల కోసం హోమియోపతి వంటి పబ్లిక్ హీత్ ప్రాజెక్ట్‌లలో ఈ సంస్థ చురుకుగా పాల్గొంటుంది. పరిశోధనా కార్యకలాపాల కోసం ఏఎస్‌యు &హెచ్ డ్రగ్స్ & స్టేట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ ఫార్మాకోవిజిలెన్స్ కోసం నైపెర్, గౌహతి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఆయుర్వేద వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో కూడా ఇన్స్టిట్యూట్ సహకరించింది.
జనవరి 8 మరియు 9 తేదీలలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (హోమియోపతి), లక్నో మరియు ప్రాంతీయ పరిశోధనా సంస్థ హోమియోపతి, సిలిగురి యొక్క కొత్త భవనాలను కూడా కేంద్ర ఆయుష్ మరియు స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పారా మహేంద్రభాయ్ ప్రారంభించారు.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సిసిఆర్‌హెచ్) అనేది భారతదేశంలో హోమియోపతి రంగంలో శాస్త్రీయ పరిశోధనలను చేపట్టడం, సమన్వయం చేయడం, అభివృద్ధి చేయడం, వ్యాప్తి చేయడం మరియు ప్రోత్సహించడం వంటి భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక అత్యున్నత పరిశోధనా సంస్థ. ఇది 27 ఇన్‌స్టిట్యూట్‌ల నెట్‌వర్క్ ద్వారా భారతదేశం అంతటా బహుళ-కేంద్రీకృత పరిశోధనలను నిర్వహిస్తుంది.
సెంట్రల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి డైరెక్టర్ జనరల్ డా. సుభాష్ కౌశిక్ లక్నోలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (హోమియోపతి) ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఏబిడిహెచ్‌ఎం)కి అనుగుణంగా ఉంటుందని మరియు ఇది ఓపిడిని సందర్శించే రోగులందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఆయుష్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏ-హెచ్‌ఎంఐఎస్) ద్వారా రోగులు నమోదు చేయబడతారు మరియు సంప్రదించబడతారు.
సిలిగురిలోని హోమియోపతి ప్రాంతీయ పరిశోధనా సంస్థ పేషెంట్ కేర్‌లో అద్భుతమైన ప్రమాణాలతో పనిచేస్తోందని మరియు ఎన్‌ఏబిహెచ్ ఆయుష్ ఎంట్రీ లెవల్ సర్టిఫికేషన్ సాధించడానికి ఫార్మాలిటీలను పూర్తి చేసిందని కూడా ఆయన తెలియజేశారు. ఇన్‌స్టిట్యూట్‌కు నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ చికిత్సలో గొప్ప అనుభవం ఉంది. అలాంటి వాటి కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చెందడానికి మరింత కృషి చేస్తుంది.
హోమియోపతి ప్రాంతీయ పరిశోధనా సంస్థ, సిలిగురి 1984లో స్థాపించబడింది. ఇది ఇప్పటికే క్లినికల్ మరియు పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ఎన్‌పిసిడిఎస్-ఆయుష్ ప్రోగ్రామ్‌లో గణనీయంగా దోహదపడింది.
***
(Release ID: 1995553)
Visitor Counter : 211