బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశీయ మార్కెట్‌లో సమృద్ధిగా బొగ్గు సరఫరా తగ్గుతున్న బొగ్గు ధర సూచీలో ఫలితాలు
నవంబర్ 2023లో 17.54% క్షీణించిన జాతీయ బొగ్గు ధరల సూచీ
25.07% క్షీణించిన నాన్-కోకింగ్ బొగ్గు ధర సూచీ
Posted On:
10 JAN 2024 3:13PM by PIB Hyderabad
దిగుమతి ధరలు, వేలం ధరలు, నోటిఫైడ్ ధరలు సహా అన్ని విక్రయ మార్గాల నుంచి వచ్చే బొగ్గు ధరలన్నింటినీ మిళితం చేసే ధరల సూచీ జాతీయ బొగ్గు సూచీ (ఎన్‌సిఐ). ఆర్ధిక సంవత్సరం 2017-18 మూల సంవత్సరంగా ఏర్పాటైన ఈ సూచీ మార్కెట్ గతిశీలతను విశ్వసనీయ సూచికగా పని చేయడమే కాక, ధరల హెచ్చు తగ్గులపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. జాతీయ బొగ్గు సూచీ నవంబర్ 2022తో పోలిస్తే నవంబర్ 2023లో 155.09 పాయింట్ల వద్ద 17.54% గణనీయమైన క్షీణతను నుంచి చూపి 188.08 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది పెరుగుతున్న డిమాండ్లను నెరవేర్చడంలో తగినంత లభ్యతతో మార్కెట్‌లో బలమైన బొగ్గు సరఫరాను సూచిస్తుంది.

అదే విధంగా, కోకింగ్ బొగ్గు నవంబర్ 2023లో 143.52 పాయింట్ల వద్ద నిలిచింది. ఇది నవంబర్ 2022తో పోలిస్తే 25.07% క్షీణతను ప్రతిఫలిస్తుంది. అయితే, కోకింగ్ కోల్ నవంబర్‌లో 188.39 పాయింట్ల వద్ద ఉండి, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.79% వృద్ధిని సాధించింది.
జూన్ 2022లో ఈ సూచీ 238.83 పాయింట్లకు చేరుకోవడాన్ని గమనించడం జరిగింది. కానీ అనంతర నెలల్లో క్షీణతను చవిచూసింది. ఇది భారత మార్కెట్‌లో బొగ్గు సమృద్ధిగా ఉండడాన్ని సూచిస్తుంది.

అదనంగా, బొగ్గు వేలం మీద ప్రీమియం పరిశ్రమ స్పందనను సూచిస్తుంది. బొగ్గు వేలం ప్రీమియం గణనీయంగా తగ్గడం మార్కెట్‌లో తగినంత బొగ్గు లభ్యతను నిర్ధారిస్తుంది. భారతదేశపు బొగ్గు కంపెనీలు ఆకట్టుకునే నిల్వలను కలిగి ఉండి, పరిశ్రమలో గణనీయమైన నిల్వను ధృవీకరిస్తుంది. ఈ లభ్యత బొగ్గుపై ఆధారపడిన వివిధ రంగాలకు స్థిరమైన సరఫరాను నిర్ధారించడం ద్వారా యావత్ దేశపు ఇంధన భద్రతకు గణనీయంగా దోహదం చేస్తుంది.
జాతీయ బొగ్గు సూచీ అధోముఖ ధోరణి అన్నది మరింత సమతుల్య మార్కెట్‌ను సూచిస్తూ, సరఫరా, డిమాండ్‌ను సమలేఖనం చేస్తుంది. తగినంత బొగ్గు లభ్యతతో, దేశంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడమే కాకుండా దాని దీర్ఘకాలిక ఇంధన అవసరాలకు తోడ్పాటునిస్తుంది. తద్వారా మరింత స్థితిస్థాపకంగా స్థిరమైన బొగ్గు పరిశ్రమను నిర్మించి, దేశానికి సంపన్నమైన భవిష్యత్తుకు హామీ ఇచ్చి, భద్రతపరుస్తుంది.
***
(Release ID: 1995029)