సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సమ్మిళిత విద్య ,సహాయక సాంకేతికతలో సాధికారత ఆవశ్యకతను చాటిచెప్పిన ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్

Posted On: 09 JAN 2024 8:22PM by PIB Hyderabad

అంతర్జాతీయ పర్పుల్ ఫెస్టివల్ సాధికారతకు దిక్సూచిగా కొనసాగుతోంది, సమ్మిళిత విద్య సహాయక సాంకేతికతలో అద్భుతమైన పురోగతిపై కీలకమైన చర్చలకు తన రెండవ రోజును అంకితం చేసింది. విభిన్న నేపథ్యాల  వక్తలు సమావేశమై అందరికీ అందుబాటులో ఉన్న విద్య వైపు మార్గాన్ని ప్రకాశవంతం చేశారు, సమ్మిళితత్వం పట్ల భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

సమ్మిళిత విద్యపై జాతీయ సదస్సు:

పనాజీలోని చారిత్రాత్మక మాక్వినెజ్ ప్యాలెస్ లో, సమ్మిళిత విద్యపై జాతీయ శిఖరాగ్ర సదస్సు ప్రధాన కేంద్ర బిందువుగా  అంతర్లీన చర్చలకు గళాన్ని అందించింది.  న్యూఢిల్లీలోని బ్రదర్ హుడ్ వ్యవస్థాపక డైరెక్టర్ సతీష్ కపూర్ సదస్సును ప్రారంభించి, గౌరవ ఆహూతులకు స్వాగతం పలికారు. డాక్టర్ సంధ్యా లిమాయే, మార్టిన్ మాథ్యూ, తాహా హాజిక్, అవెలినో డి సా వంటి ప్రముఖులతో కూడిన ఈ ప్యానెల్ అనేక దృక్పథాలను ఆవిష్కరించింది.

ముంబైలోని టిస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సంధ్యా లిమాయే మాట్లాడుతూ, సమ్మిళిత విద్యకు దశాబ్దకాలం నిబద్ధతను వివరించారు. 120 మందికిపైగా పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆమె - వికలాంగులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంగవైకల్యం ఉన్న పిల్లలకే కాకుండా మైనారిటీ వర్గాలకు చెందిన వారికి కూడా ప్రయోజనం చేకూర్చే భవిష్యత్తును  లిమాయే ఆకాంక్షించారు.

కృత్రిమ మేధ ఆధిపత్య యుగంలో డిజిటల్ స్పేస్ ఉపయోగాలు , గొప్ప సంతృప్తి సిద్ధాంతాన్ని వివరించారు.. సమ్మిళిత విద్యను అమలు చేయడంలో సవాళ్లను అవెలినో డి సా తెలియచేశారు. అవగాహన    పెంచే ప్రయత్నాలలో ప్రభుత్వ విధానాల కీలక పాత్రను నొక్కి చెప్పారు.

ఉత్సవాల ఇతివృత్తం అయిన   సాంకేతిక ఆవిష్కరణకు   అనుగుణంగా                వికలాంగుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్రను తాహా హజిక్ ఉద్వేగభరితంగా సమర్థించారు,

టెక్నాలజీ , సమ్మిళిత విద్యపై దక్షిణాసియా వర్క్ షాప్:

ఐసిఇవిఐ పశ్చిమాసియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బ్రెండ్రా పోఖరెల్ అధ్యక్షతన జరిగిన దక్షిణాసియా వర్క్ షాప్ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం ,పరివర్తన శక్తిని ప్రదర్శించింది. స్టార్టప్ టార్చ్ ఇట్ కు చెందిన డాక్టర్ హోమియార్, హనీ భాగ్ చందానీ సైన్స్, గణితం, అడ్వాన్స్ డ్ సబ్జెక్టుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎలా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదనే అంశంపై అద్భుతమైన అంతర్దృష్టులను అందించారు.

సహాయక సాంకేతిక రంగంలో యువ భారతీయ స్టార్టప్ లు చేసిన కృషి ప్రశంసనీయం. ప్రభుత్వ చొరవలతో ప్రోత్సహించబడిన ఈ స్టార్టప్ లు తక్కువ ఖర్చుతో, సమర్థవంతమైన, సాంస్కృతికంగా తగిన పరికరాలను రూపొందించడంలో అగ్రగామిగా నిలిచాయి, భారతదేశాన్ని గ్లోబల్ లీడర్ గా నిలబెట్టాయి.

పర్పుల్ ఫెస్ట్ లో ఆవిష్కర్తలకు, అనుభవాలకు వేదిక కల్పించినందుకు ఐసిఇవిఐ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమ్మిళిత విద్య ప్రాముఖ్యతను గోవా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సుభాష్ ఫాల్ దేశాయ్ పునరుద్ఘాటించారు, అవగాహనను పెంపొందించడంలో ఈ ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.

దృష్టిని మించిన సాధికారత దార్శనికతకు అంకితమైన టార్చ్ ఇట్ సంస్థ వ్యక్తులు, ఉపాధ్యాయులు , సంస్థలకు సేవలందించే అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిలో ముఖ్యమైన సాధనాలలో డైసీ (డిజిటల్ యాక్సెసబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), పైప్లైన్ యాప్, మెగా వాయిస్, మ్యూజిక్ బ్రెయిలీ ఉన్నాయి.

ఐసివిఇ గ్లోబల్ నిర్వహించిన ఈ వర్క్ షాప్ చౌకైన, సమర్థవంతమైన సహాయక పరికరాలను అభివృద్ధి చేయడంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రముఖంగా చాటి చెప్పింది. ప్రదర్శనలో ఉన్న సహాయక సాంకేతిక పరిజ్ఞానాల వైవిధ్యమైన శ్రేణి వికలాంగుల జీవితాలను మార్చే సామర్థ్యాన్ని ప్రకాశవంతం చేసింది.

అంతర్జాతీయ పర్పుల్ ఫెస్టివల్ సమ్మిళితత్వం, విద్య, సాంకేతిక ఆవిష్కరణల పట్ల భారతదేశ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ,  హక్కులు ఉన్న భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.

***



(Release ID: 1994723) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi