రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎన్‌సిసి కేడెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో మంత్ర‌ముగ్థులైన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్

Posted On: 09 JAN 2024 4:07PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో డిజిఎన్‌సిసి శిబిరంలో జ‌రుగుతున్న ఎన్‌సిసి రిపబ్లిక్ డే క్యాంప్ 2024ను  పివిఎస్ ఎం, ఎవిఎస్ఎం, విఎస్ ఎం, ఎడిసి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సైన్యాధ్య‌క్షుడు) జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే మంగ‌ళ‌వారం నాడు సంద‌ర్శించారు. ఎవిఎస్ఎం, విఎస్ఎం, డిజిఎన్‌సిసి లెఫ్ట‌నెంట్ జ‌న‌ర‌ల్ గుర్బీర్‌పాల్ సింగ్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. 
సైన్యం, నావికాద‌ళం, వైమానికా ద‌ళంలోని మూడు విభాగాలైన ఎన్‌సిసి నుంచి ఎంపిక చేసిన చురుకైన కేడెట్ల సైనిక వంద‌నాన్ని సైన్యాధ్య‌క్షుడు స‌మీక్షించారు. అనంత‌రం సింథియా స్కూలుకు చెందిన ఎన్‌సిసి కేడెట్ల అద్భుత బ్యాండ్ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. త‌ర్వాత‌, సామాజిక ఇతివృత్తాల‌ను వివ‌రించే, సాంస్కృతిక కార్య‌క‌లాపాల‌తో ఎన్‌సిసి కేడెట్లు రూపొందించిన ఫ్లాగ్ ఏరియాను ఆయ‌న సంద‌ర్శించారు.త‌మ త‌మ రాష్ట్ర డైరెక్టొరేట్ ఇతివృత్తాల గురించి కేడెట్ల‌కు ఆయ‌న వివ‌ర‌ణాత్మ‌కంగా తెలియ‌చేశారు. 
అనంత‌రం, ఎన్‌సిసి ఎంతో గ‌ర్వంగా భ‌ద్ర‌ప‌ర‌చిన మూడు విభాగాల నుంచి పూర్వ విద్యార్ధుల ఫోటోలు, ప‌త‌కాలు, ప్రేర‌ణాత్మ‌క అంశాలు, ఇత‌ర ఇతివృత్తాల గొప్ప సేక‌ర‌ణను, ప్ర‌ద‌ర్శించే హాల్ ఆఫ్ ఫేమ్‌ను సిఒఎఎస్ సంద‌ర్శించారు. ఇత‌ర ప్ర‌ముఖ అతిథుల‌తో క‌లిసి సైనికాధిప‌తి ఆడిటోరియంలో ప్ర‌తిభ‌క‌లిగిన ఎన్‌సిసి కేడెట్లు ప్ర‌ద‌ర్శించిన‌ ఆక‌ట్టుకునే సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని తిల‌కించారు. 
అనేక‌మంది మాజీ కేడెట్లు ప్ర‌భుత్వంలోనూ, సైనిక ద‌ళాల్లోనూ ఉన్న‌త స్థానాల్లో ఉన్న వాస్త‌వం ప‌ట్ల చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు. సైనిక ద‌ళాల‌కు అద‌నంగా వివిధ వృత్తుల‌లో నాయ‌క‌త్వ పాత్ర‌ను పోషించవ‌ల‌సిందిగా కేడెట్ల‌కు ప్రేర‌ణ‌ను ఇచ్చారు. తాము చేప‌ట్టిన ప్ర‌తి ప‌నినీ చిత్త‌శుద్ధితో చేప‌ట్టి దేశంలోని యువ‌త‌కు రోల్ మోడ‌ల్స్ కావాల‌ని ఆయ‌న వారికి విజ్ఞ‌ప్తి చేశారు. ర‌క్త‌దాన శిబిరాలు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, పునీత్ సాగ‌ర్ అభియాన్ త‌దిత‌ర సామాజిక సేవా ప‌థ‌కాలు స‌హా జాతి నిర్మాణ కార్య‌క‌లాపాల‌లో ఎన్‌సిసి ఇస్తున్న గ‌ణ‌నీయ‌మైన స‌హ‌కారాన్ని ఆయ‌న ప‌ట్టి చూపారు. 
కేడెట్లు నిబ‌ద్ధ‌త‌తో హాజ‌రు కావ‌డం, ఆక‌ట్టుకునే సైనిక‌వంద‌నం, ఆక‌ట్టుకునే సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డాన్ని సిఒఎఎస్ ప్ర‌శంసించారు. త‌మ ప‌ట్ల త‌మ‌కు విశ్వాసం ఉంచుకోవాల‌ని,  దృఢ సంక‌ల్పంతో ముందుకు సాగాల‌ని ఆయ‌న ప్రేర‌ణ‌ను ఇచ్చారు. ఎన్‌సిసి కేడెట్లంద‌రూ త‌మ భ‌విష్య‌త్ ప్ర‌య‌త్నాల‌లో విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

 

***



(Release ID: 1994700) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Hindi , Tamil