సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

వికలాంగులలో ఆత్మ విశ్వాసం, నమ్మకం కలిగించే విధంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ - గోవా 2024

Posted On: 09 JAN 2024 12:43PM by PIB Hyderabad

గోవాలోని పనాజీలో డి .బి  గ్రౌండ్‌లో  ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ 2024 జనవరి 08న ప్రారంభమైంది. వికలాంగులకు నమ్మకం కల్పించి, సాధికారత కల్పించడం లక్ష్యంగా ఆరు రోజుల పాటు ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ - గోవా 2024 జరుగుతుంది.  గోవా వికలాంగుల రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్   కు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న  వికలాంగుల సాధికారత విభాగం సహకారం అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ - గోవా 2024 ను రాష్ట్ర  ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్,,కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ. రాందాస్ అథవాలే ప్రారంభించారు. ఇటువంటి కార్యక్రమాలు వికలాంగుల పట్ల సమాజ దృక్పథాన్ని మార్చి సానుకూల ప్రభావాన్ని తీసుకుని రావడానికి  సహకరిస్తాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ  కార్యదర్శి పేర్కొన్నారు. 

ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ - గోవా 2024 ముఖ్యాంశాలు

1. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను  ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ వివరించారు.  గోవాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారని డాక్టర్ ప్రమోద్ సావంత్ తెలిపారు. వికలాంగుల విభిన్న ప్రతిభ ను గుర్తించి వెలికి తీయాలని ఆయన అన్నారు. 

2. డిసెబిలిటీ ఇన్ఫర్మేషన్ లైన్ (డి ఐ ఎల్):  క్లౌడ్ ఆధారిత IVRS డిసెబిలిటీ ఇన్ఫర్మేషన్ లైన్ (డి ఐ ఎల్) ను దేశంలో తొలిసారిగా ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ - గోవా 2024లో ప్రారంభించారు. 21 వైకల్యాల గురించి సమాచారాన్ని లైన్ 24x7 పాటు అందిస్తుంది. దీనికోసం  టోల్-ఫ్రీ నెంబర్ 1800222014 ను అందుబాటులోకి తెచ్చారు. 

3. పర్పుల్ ఫెస్టివల్   ప్లేబుక్: పర్పుల్ ఫెస్టివల్   ప్లేబుక్ ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో చేపట్టే కార్యక్రమాలు, సాధించిన విజయాలు, కార్యక్రమం అనంతరం అమలు జరిగే కార్యక్రమాల వివరాలను దీనిలో పొందుపరిచారు.  

4. పర్పుల్ గీతం 'ధుమాల్' ప్రారంభ కార్యక్రమంలో పర్పుల్ గీతం 'ధుమాల్ ను' వైకల్యాలున్న వ్యక్తులు, భారతీయ సంగీత రంగానికి ప్రముఖులు ఆలపించారు. వికలాంగుల మధ్య  ఐక్యత, సమగ్రత సూచించే విధంగా గీతాన్ని రూపొందించారు. 

5. పర్పుల్ టీవీ భారత్: ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల ఆలోచనలు, విజయగాథలు, ఇంటర్వ్యూలు, విజయాలు ప్రదర్శించడానికి పర్పుల్ టీవీ భారత్ అనే ప్రత్యేక ఛానెల్ ప్రారంభమయింది. 

6. పర్పుల్ రైన్ ముగింపు : నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, సాంప్రదాయ గోవా జానపద నృత్యం ముసల్, శాస్త్రీయ నృత్యం 'సరస్వతి వందన' ఇచ్చిన  ఆకర్షణీయమైన ప్రదర్శనలు నిర్వహించాయి.

1వ రోజు ఆకర్షణలు 

*చెవిటి అంధత్వ సదస్సు : ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ - గోవా 2024 మొదటి రోజున చెవిటి అంధత్వ సదస్సు నిర్వహించారు. మానసిక ఆరోగ్యం, సమాచార  హక్కులు, సాధికారత వంటి కీలకమైన అంశాలు గ్యాస్పర్ డయాస్‌లో జాతిగిన సదస్సులో చర్చకు వచ్చాయి.  

*ఇన్‌క్లూసివిటీ ప్యానెల్ చర్చ: గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో  'ఛాంపియనింగ్ ఇన్‌క్లూజివిటీ'పై చర్చా కార్యక్రమం జరిగింది. , వైకల్యాలున్న వ్యక్తులను నియమించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి అంశాలపై చర్చలు జరిగాయి. 

*పర్పుల్ ఎగ్జిబిషన్:  NDFDC నిర్వహించిన పర్పుల్ ఎగ్జిబిషన్ దివ్య కళా మేళా  భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించింది.

 

***



(Release ID: 1994695) Visitor Counter : 132


Read this release in: English , Urdu , Hindi , Tamil