ప్రధాన మంత్రి కార్యాలయం

హిందీ భాష రంగం లో ప్రముఖ సాహితీవేత్త పండిత్ శ్రీ హరిరామ్ద్వివేది మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 09 JAN 2024 9:15AM by PIB Hyderabad

హిందీ భాష లో ప్రముఖ సాహితీవేత్త పండిత్ శ్రీ హరిరామ్ ద్వివేది మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ‘అంగనయియా’ మరియు ‘జీవనదాయిని గంగ’ ల వంటి కవితా సంకలనాలు, ఇంకా తన విభిన్నమైనటువంటి రచన ల ద్వారా మన జీవనం లో ఒక భాగం గా పండిత్ హరిరామ్ ద్వివేదీ సదా నిలచిపోతారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘హిందీ సాహిత్యం లో శీర్ష రచయిత మరియు కాశీ వాస్తవ్యుడు పండిత్ శ్రీ హరిరామ్ ద్వివేది గారు మన మధ్య నుండి నిష్క్రమించారని విని దుఃఖించాను. ‘అంగనయియా’ మరియు ‘జీవనదాయిని గంగ’ ల వంటి కవితా సంకలనాలు మరియు ఆయన యొక్క విభిన్న రచన ల ద్వారా మన జీవనం లో ఎల్లప్పటికీ ఆయన నిలచిపోతారు. ఆయన కు ప్రభువు యొక్క శ్రీచరణాల లో స్థానం లభించుగాక అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

*********

DS/ST



(Release ID: 1994540) Visitor Counter : 149