వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలోని నెహ్రూ నగర్‌లో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా
Posted On:
08 JAN 2024 3:58PM by PIB Hyderabad
వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. న్యూఢిల్లీలోని నెహ్రూ నగర్‌లో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా పాల్గొన్నారు. కార్యక్రమంలో
కేంద్ర కార్మిక మరియు ఉపాధి, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు శ్రీ జె.పి నడ్డా, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, పార్లమెంట్ సభ్యులు శ్రీ గౌతమ్ గంభీర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని కార్యక్రమానికి హాజరైన ప్రజలు, ప్రముఖులు ప్రమాణం చేశారు.
లబ్ధిదారుల అనుభవాలను, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వారు ఎలా లబ్ది పొందారు అనే విషయాలను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటున్న లబ్ధిదారులు ఈ రోజు ప్రధాని నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో నవంబర్ 28న వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ప్రత్యేకంగా రూపొందించిన ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) వ్యాన్‌లు ఢిల్లీలోని 11 జిల్లాల్లో ప్రయాణిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 450 ప్రాంతాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్రలు జరిగాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది కలిగించాలి అన్న లక్ష్యంతో వికసిత భారత్ సంకల్ప యాత్రలు జరుగుతున్నాయి. కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబర్ 15న
జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్-పీఎం జె , పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం విశ్వకర్మ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్, జల్ జీవన్ మిషన్, జన్ ధన్ యోజన వంటి అనేక ప్రభుత్వ పథకాలు దేశంలో అన్ని ప్రాంతాలకు చేరి ప్రజలకు ప్రయోజనం కలిగించేలా అమలు చేయడం లక్ష్యంగా సంకల్ప యాత్ర జరుగుతోంది.
అర్హులైన లబ్ధిదారులకు పథకాల సకాలంలో అందజేయడానికి చేస్తున్న కృషిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభించిన 50 రోజుల స్వల్ప వ్యవధిలో 11 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువైన వికసిత భారత్ యాత్ర ఒక మైలురాయి దాటింది. వికసిత భారత్ యాత్ర ఐఈసీ వ్యాన్‌లు ప్రతి గ్రామంలో మోడీ ఇచ్చిన హామీల అమలు వాహనంగా మారుతున్నాయి, ఇప్పటికీ ఎటువంటి వివక్ష లేకుండా నిరాశ్రయులైన వారికి పథకాల ప్రయోజనాలు అందజేస్తున్నాయి.
***
(Release ID: 1994511)
Visitor Counter : 173