సహకార మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో ఐదు రాష్ట్రాల పిఎసిఎస్ లకు 'ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం నిర్వహణ కోసం స్టోర్ కోడ్ లను పంపిణీ చేసిన’ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనరిక్ మందుల వ్యవస్థను పటిష్టం చేసి భారతీయ జన ఔషధి కేంద్రం ద్వారా 60 కోట్ల మంది పేద ప్రజలకు మందులను అందుబాటులో ఉంచారు.

శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి దేశంలోని 2373 పిఎసిఎస్ లను జన ఔషధి కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నాం.

ఇకపై పిఎసిఎస్ ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, రైతులకు చౌకగా, నాణ్యమైన మందులు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సహకారం ,ఆరోగ్య సమ్మిళితం శ్రేయస్సు మంచి ఆరోగ్యాల సంగమం

పిఎసిఎస్ లు లేకుండా సహకార బ్లూప్రింట్ తయారు చేయలేము; సహకార మంత్రిత్వ శాఖ రెండు లక్షల కొత్త పిఎసిఎస్ లను ఏర్పాటు చేస్తుంది; , ప్రతి పంచాయతీకి పిఎసిఎస్ లను అందిస్తుంది

2047 నాటికి సహకారం ద్వారా నిరుపేదలను భాగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్న శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేయాలనే సంకల్పంతో మనం ముందుకు సాగాలి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జన ఔషధి కేంద్రాల ద్వారా దేశంలోని పేదలు రూ.25,000 కోట్లకు పైగా ఆదా చేశారు.

వచ్చే మూడేళ్లలో పిఎసిఎస్ లు ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ప్రస్తుతం సి ఎస్ సి గా పనిచే

Posted On: 08 JAN 2024 5:07PM by PIB Hyderabad

ఉత్పత్తిదారుగా మారిందని కేంద్ర హోం , సహకార మంత్రి అన్నారు. కానీ ఒక విడ్డూరం ఏంటంటే ప్రపంచం మొత్తానికి మందులు పంపే భారత్ లో 60 కోట్ల మంది మందులు ఖరీదైనవి కావడంతో వాటిని కొనలేక పోయారని అన్నారు. కానీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన ఔషధి కేంద్రం ఆలోచనను ముందుకు తీసుకువెళ్లి, జనరిక్ మందుల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా, ప్రతి పేదవాడు 8 శాతం నుండి 30 శాతం ఖర్చుతో మందులు పొందే కార్యక్రమాన్ని రూపొందించారని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో గొప్ప మెరుగుదలకు దారితీసిందని శ్రీ అమిత్ షా చెప్పారు. 

గత తొమ్మిదేళ్లలో జన్ ఔషధి కేంద్రాల ద్వారా దేశంలోని పేదలకు రూ.25,000 కోట్లు ఆదా చేశామని అమిత్ షా తెలిపారు. సహకార రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జన ఔషధి కేంద్రాల పరిధి పెరగబోతోందని, రానున్న రోజుల్లో గ్రామీణ పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో సహకార రంగం మాధ్యమంగా మారబోతోందని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సహకార, ఆరోగ్య వ్యవస్థల కలయిక సౌభాగ్యం, మంచి ఆరోగ్యాల సంగమమని కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి అన్నారు. నేడు అనేక రాష్ట్రాల్లో సహకార రంగం ద్వారా పిఎసిఎస్ లను  ప్రారంభించామని, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 2300 ప్రాథమిక సహకార సంఘాలు గ్రామీణ పేదలకు తక్కువ ధరలో మందులు అందిస్తున్నాయని తెలిపారు.

మహారాష్ట్ర, బిహార్, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదు పిఎసిఎస్ లకు సింబాలిక్ సర్టిఫికెట్లు ఇచ్చామని తెలిపారు. సహకార సంఘాల విస్తరణ కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయవంతమైన నాయకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ ఎంతో కృషి చేసిందని ఆయన అన్నారు. దీని కింద సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాల పరిధిని పెంచిందని,  56 సహకార సంఘాల ద్వారా, సహకార మంత్రిత్వ శాఖ పేదలకు సౌభాగ్యాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల కొత్త పిఎసిఎస్ లను ఏర్పాటు చేయాలని సహకార మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి పంచాయతీకి ఒక పిఎసిఎస్ ఉంటుందని తెలిపారు. 2047 నాటికి సహకారం ద్వారా నిరుపేదలను సంపన్నులుగా తీర్చిదిద్దాలన్న శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేయాలనే సంకల్పంతో మనం ముందుకు సాగాలని శ్రీ షా అన్నారు.

పిఎసిఎస్  ప్రాతిపదిక లేకుండా సహకారానికి బ్లూప్రింట్ తయారు చేయలేమని కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి తెలిపారు. రెండు లక్షల కొత్త పిఎసిఎస్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు ఉద్యమం ఎందుకు వెనుకబడిందో, పిఎసిఎస్లను ఎందుకు మూసివేశారో చర్చ జరిగిందన్నారు. ఇంతకుముందు పిఎసిఎస్   బైలాస్ లో వ్యవసాయ రుణాలు తప్ప మరే ఇతర పనులను చేర్చే అవకాశం లేదని విశ్లేషణలో వెల్లడైందని అన్నారు. ‘అందుకే ముందుగా మోడల్ బైలాస్ రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపి విస్తృతంగా చర్చించాం. నేడు దేశంలోని అన్ని పీఏసీఎస్ లు మోడల్ బైలాస్ ను ఆమోదించాయి. మోడల్ బైలాస్ కింద కొత్త పిఎసిఎస్ లను కూడా నమోదు చేస్తున్నారుఅని వివరించారు.

గతంలో పెద్ద పిఎసిఎస్లు ఎక్కువగా క్రెడిట్ ఏజెన్సీల పనిని చేసేవని, కానీ ఇప్పుడు పిఎసిఎస్లను మైక్రో ఏటీఎంలు, కిసాన్ క్రెడిట్ కార్డుల పనితో అనుసంధానం చేశామన్నారు. ఇప్పుడు పిఎసిఎస్లలో పశుసంవర్థక ప్రోత్సాహక కేంద్రం, సి ఎస్ సి లను కూడా ప్రారంభించామని, రైల్వే టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు నని తెలిపారు.

ఎల్ పి జి డీలర్ షిప్ విషయంలో కూడా పిఎసిఎస్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. పెట్రోల్ బంకుల పనితీరులో ఉన్న అడ్డంకులను పెట్రోలియం మంత్రిత్వ శాఖ తొలగించిందని, . ఇప్పుడు పిఎసిఎస్లు కూడా పెట్రోల్ బంకులను నడపవచ్చునని అన్నారు. ప్రతి ఇంటికీ 'హర్ ఘర్ నల్ సే జల్' ప్రచారాన్ని నిర్వహించడానికి సుమారు 27 రాష్ట్రాలు పిఎసిఎస్ లకు అధికారం ఇచ్చాయని ఆయన చెప్పారు. వీటితో పాటు పిఎసిఎస్లు జనరిక్ మందుల దుకాణాలు, రేషన్ షాపులు నిర్వహించనున్నాయి. ప్రస్తుతం దేశంలో 35000 పిఎసిఎస్లు ఎరువుల పంపిణీ నిర్వహిస్తున్నాయి. కొత్త బైలాస్ కింద 22 రకాల పనులను వీటి పరిధి లో చేర్చామని, దీని వల్ల ఇప్పుడు పిఎసిఎస్ లను ఇక మూసివేయలేమని, భారీ లాభాలు వస్తాయని అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించిన 'ప్రధాన మంత్రి స్టోరేజ్ ' సదుపాయంతో పిఎసిఎస్లు ఇప్పుడు చాలా తక్కువ పెట్టుబడితో ఒక ఆధునిక గిడ్డంగిని నిర్మించుకోగలవని శ్రీ అమిత్ షా అన్నారు. దీని ద్వారా తమ తాలూకా, రాష్ట్రంలో వరి, గోధుమలను నిల్వ చేసే కేంద్రంగా మారడమే కాకుండా, రైతులు తమ ఉత్పత్తులను కొంతకాలం అక్కడే ఉంచుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తుంది. వచ్చే మూడేండ్లలో దేశంలోని పిఎసిఎస్లు ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నారు.

ఆరు నెలల వ్యవధిలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 4470 పిఎసిఎస్ దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 2373 పూర్తిగా ఆమోదం పొందాయని కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 248 పిఎసిఎస్లు తమ పనులను ప్రారంభించా యని, అనేక సవాళ్లు ఎదురైనా తాము కూడా వ్యాపారం చేయగలమని పిఎసిఎస్లు నిరూపించాయన్నారు.

'జన ఔషధి కేంద్రం'కు సంబంధించి సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అన్ని రాష్ట్రాల ఫార్మసీ కౌన్సిల్స్, ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించామని శ్రీ షా తెలిపారు. వాటిని సాఫీగా నిర్వహించేలా పిఎసిఎస్లకు సహకరించేందుకు 40 మంది ఫీల్డ్ ఆఫీసర్లను నియమించినట్టు చెప్పారు. పిఎసిఎస్లకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. 84000 పిఎసిఎస్ లు మోడల్ బైలాస్ ను ఆమోదించాయని, పిఎసిఎస్ల కంప్యూటరీకరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ.2516 కోట్లు ఇచ్చారని, దీని ద్వారా అన్ని పిఎసిఎస్లు 20 కొత్త రకాల పనులు చేయనున్నాయని వివరించారు. 62000 పిఎసిఎస్లను కంప్యూటరీకరించే పని ప్రారంభమైందని, 10080 పిఎసిఎస్ లలో ట్రయల్స్ జరుగుతున్నాయని, 1800 పిఎసిఎస్ లను పూర్తిగా కంప్యూటరీకరణ చేశామని తెలిపారు. ప్రస్తుతం సి ఎస్ సి గా పనిచేస్తున్న 28 వేల పిఎసిఎస్ లు 300కు పైగా కేంద్ర ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నాయన్నారు.

భారీ సదస్సుకు వచ్చిన పిఎసిఎస్ ప్రతినిధులందరూ బైలాస్ ను జాగ్రత్తగా పాటించాలని సహకార శాఖ మంత్రి శ్రీ షా విజ్ఞప్తి చేశారు. ‘భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ ప్రతి పథకాన్ని దాని వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా చదవండి-ప్రతి పిఎసిఎస్ మీ గ్రామంలో శక్తి ,అభివృద్ధి కేంద్రంగా మారే విధంగా ముందుకు సాగండిఅని కోరారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించారని శ్రీ అమిత్ షా అన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన లాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, దీని కింద 60 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. 130 కోట్ల జనాభాలో ప్రతి చిన్నారికి అన్ని రకాల టీకాలు అందించడంలో మిషన్ ఇంద్రధనుష్ ఎంతగానో దోహదపడుతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఫ్లోరైడ్ రహిత స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వీటితో పాటు యోగా, ఆయుష్, ఫిట్ ఇండియా వంటి అనేక కార్యక్రమాల ద్వారా పరిశుభ్రత, ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల ను ఏర్పాట్లు చేశారు.

ఆయుష్, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ ఉత్పత్తులు మూడింటినీ కలపడం ద్వారా వైద్యం లేకుండా జీవించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచానికి ఒక కొత్త భారతీయ జీవనశైలిని అందించారని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. 2014లో దేశ ఆరోగ్య బడ్జెట్ రూ.33,000 కోట్లు అనిప్రధాని నరేంద్ర మోదీ దీన్ని రూ.90,000 కోట్లకు పెంచా రని తెలిపారు. దీంతోపాటు ఆరోగ్యంపై తలసరి వ్యయం రూ.1000 నుంచి రూ.2000కు పెరిగిం దని, డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గతంలో అలాంటి కేటాయింపులు లేవన్నారు.

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ యోజన, ప్రధాన మంత్రి ఆరోగ్య మౌలిక సదుపాయాల యోజన, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, మలేరియా రహిత భారతదేశం, సార్వత్రిక వ్యాక్సినేషన్ కోసం మిషన్ ఇంద్రధనుష్, టిబి నిర్మూలన కార్యక్రమం, మాతృ వందన యోజన, జననీ సురక్ష యోజన, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా మరియు డయాలసిస్ ప్రోగ్రామ్ వంటి అనేక కార్యక్రమాల వ్యవస్థ ను రూపొందించడం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేదల , ముఖ్యంగా బాలలు, కౌమారుల ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు కృషి చేశారని శ్రీ షా తెలిపారు. ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన కింద నేడు జన ఔషధి కేంద్రాల సంఖ్య 10 వేలకు పైగా పెరిగిందని, ఇందులో 2260కి పైగా మందులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

జనరిక్ మందులు, వ్యాక్సిన్లు, చౌకైన హెచ్ఐవి మందులను సరఫరా చేయడంలో ప్రపంచ ఫార్మా రంగంలో భారత్ మొదటి స్థానంలో ఉందని సహకార మంత్రి తెలిపారు. ‘ఫార్మా, బయోటెక్ నిపుణుల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నాం. మొత్తం ఔషధాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందిఅన్నారు. 2047 నాటికి భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ గా మారుతుందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల 'ఆత్మనిర్భర్ భారత్' నెరవేరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో భారత్ ప్రపంచానికి రూ.90145 కోట్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసేదని, ఇప్పుడు రూ.183,000 కోట్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేయలేకపోయాయని, కానీ ప్రధాని నాయకత్వంలో మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడమే కాకుండా దేశంలోని ప్రతి గ్రామంలోని నిరుపేదలకు వ్యాక్సిన్, కరోనా నుంచి రక్షించిన సర్టిఫికేట్ రెండింటినీ అందించారని శ్రీ అమిత్ షా తెలిపారు.

****

 (Release ID: 1994510) Visitor Counter : 132


Read this release in: English , Urdu , Marathi