వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇండస్ ఫుడ్ 2024ను ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయల్; ఇది భారతదేశ శక్తివంతమైన, విభిన్న ఆహార పర్యావరణ వ్యవస్థల ప్రదర్శన


భారతదేశంలోని విభిన్న ఆహార పరిశ్రమను ప్రశంసించిన శ్రీ గోయల్ , ప్రపంచ
మార్కెట్లను ఆకర్షించే సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు

గత 9 సంవత్సరాలలో ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 150 శాతం వృద్ధిని, 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఎగుమతులను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ గోయల్

రైతులకు మంచి విలువను అందించడానికి, ఉపాధిని సృష్టించడానికి, దేశ ఆదాయాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున ఆహార శుద్ధి, ఉత్పత్తి బ్రాండింగ్, ఎగుమతులపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన శ్రీ గోయల్

ఆహార రంగంలో మహిళల కీలక పాత్రను, పరిశ్రమ వ్యాప్త సహకారం, దాని ఆవశ్యకతను వివరించిన శ్రీ గోయల్

Posted On: 08 JAN 2024 3:39PM by PIB Hyderabad

గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్‌లో ‘ఇండస్ ఫుడ్ 2024’ ప్రదర్శనను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రారంభించారు. భారతదేశ శక్తివంతమైన, విభిన్న ఆహార పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో స్పూర్తిదాయకమైన ప్రసంగం చేస్తూ, గ్లోబల్ మార్కెట్లను ఆకర్షించే సామర్థ్యాన్ని నొక్కిచెప్పిన మంత్రి భారతదేశ వైవిధ్యమైన ఆహార పరిశ్రమను ప్రశంసించారు.

భారతదేశ ఆహార ప్రాసెసింగ్ రంగం గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లలో ప్రాసెస్ చేయబడిన ఆహార ఎగుమతుల్లో 150 శాతం వృద్ధిని ప్రముఖంగా  ప్రస్తావించారు. భారతదేశ వ్యవసాయ ఎగుమతులు దాదాపు 53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని మంత్రి అన్నారు. శ్రీ పీయూష్ గోయల్ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ఉటంకిస్తూ, సాంకేతికత, అభిరుచి కలయికకు సమయం ఆసన్నమైందని అన్నారు. రైతులకు మంచి విలువను అందించడానికి, ఉపాధిని సృష్టించడానికి, దేశ ఆదాయాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున ఆహార ప్రాసెసింగ్, ఉత్పత్తి బ్రాండింగ్, ఎగుమతులపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహారాలకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తుచేస్తూ, దేశంలోని విభిన్న వ్యవసాయ-వాతావరణ మండలాలు, 158 ఫుడ్ అండ్ అగ్రి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జిఐలు), వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడిఓపి) చొరవ కింద జిల్లాల అంతటా 708 ప్రత్యేకమైన ఆహార పదార్థాల గుర్తింపును మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. 

'ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' వంటి ప్రభుత్వ ఆహార భద్రత కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను అందించడం, దేశంలో సున్నా ఆకలి మరణాలు ఉండేలా చూడటం అభినందనీయమన్నారు. అదనంగా, 'భారత్ అట్టా', 'భారత్ దాల్' వంటి వ్యూహాత్మక జోక్యాల ద్వారా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ఆర్థిక బలాలను మంత్రి ప్రస్తావించారు. ఘనమైన స్థూల ఆర్థిక పునాదులు, యువజన జనాభా విజయానికి కారణమని పేర్కొన్నారు. భారతీయ వంటకాల ఆనందాన్ని ప్రోత్సహించినందుకు సోషల్ మీడియా, గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఆయన ప్రశంసించారు.  ఇది విభిన్న ప్రాంతీయ వంటకాలకు ఆదరణ పెరగడానికి మార్గం వేసింది. శ్రీ పీయూష్ గోయల్ భారతీయ వంటకాల గొప్పతనాన్ని హైలైట్ చేశారు, దాని విలక్షణమైన రుచులు, సుగంధ ద్రవ్యాలు, సువాసనలను గుర్తు చేశారు.

శ్రీ గోయల్ ఆహార రంగంలో మహిళల కీలక పాత్రను నొక్కి చెప్పారు. పోటీ స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిశ్రమ వ్యాప్త సహకారం, అవసరాన్ని నొక్కి చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్, యూనివర్శిటీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు, ఈ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడం, ఫ్రోజెన్, ప్యాక్ చేసిన, రెడీ టు ఈట్ ఆహారాలపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. నాణ్యత, పోషకాహారం, సేంద్రీయ పదార్థాలు, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పరిశ్రమను కోరారు. ఆహార పోషణ, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

శ్రీ పీయూష్ గోయల్ ఇండస్ ఫుడ్  ఏడవ ఎడిషన్ గణనీయమైన విజయాన్ని, అత్యుత్తమ విజయాలను ప్రశంసించారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఫెయిర్‌లకు ఆతిథ్యం ఇవ్వగల భారతదేశ సామర్థ్యంపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మంత్రి, వివిధ ఎక్స్‌పోలకు ప్రపంచ కేంద్రంగా ఢిల్లీ సామర్థ్యాన్ని వివరించారు. భారత్ మండపంలో కొనసాగుతున్న ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్‌ ప్రస్తావించారు. తరువాతి నెలలో రాబోయే భారత్ మొబిలిటీని ప్రకటించారు. ఆ తర్వాత ఫిబ్రవరి చివరిలో భారత్ టెక్స్‌ని ప్రకటించారు. 2025ని బహుళ వేదికల, భారీ-స్థాయి ప్రదర్శనల సంవత్సరంగా భావించి, ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ప్రదర్శనను భారతదేశం నిర్వహించాలని ఆకాంక్షించారు.

 

***



(Release ID: 1994485) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Hindi