మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిశా లో గంజాం జిల్లాలోని అర్జిపల్లి ఫిషింగ్ హార్బర్ నుండి సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-11కు నేతృత్వం వహించిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల

Posted On: 07 JAN 2024 8:07PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల నేతృత్వంలో సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-11 ఒడిశాలోని గంజాం జిల్లా అర్జిపల్లి ఫిషింగ్ హార్బర్ నుంచి ఆదివారం ప్రారంభమైంది. శ్రీ పురుషోత్తం రూపాల లబ్ధిదారులతో ముచ్చటించారు. చాలా మంది లబ్ధిదారులు తమ ప్రత్యక్ష అనుభవాలను పంచుకున్నారు  కొత్త పడవలు , వలల కోసం అభ్యర్థించారుకెసిసిపిఎమ్ఎమ్ఎస్ వై   పథకాలు తమ జీవితాలలో తెచ్చిన గొప్ప మెరుగుదలకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా మంత్రి లబ్ధిదారులను కిసాన్ క్రెడిట్ కార్డుతో సత్కరించడం, అనుమతులు/సర్టిఫికెట్లు పంపిణీ చేయడంతోపాటు పిఎంఎంఎస్ వై పథకాల కింద అభ్యుదయ మత్స్యకారులకు ఇతర ఆస్తులను అందజేశారు. కార్యక్రమంలో డిఒఎఫ్ సంయుక్త కార్యదర్శి శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్, ఒడిశా ప్రభుత్వ డైరెక్టర్ (ఎఫ్ వై) శ్రీ సిద్ధిఖీ ఆలం, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలాఇతర ప్రముఖులు  నారీ ఫిషింగ్ విలేజ్ ను సందర్శించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆహూతులకు శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్, ట్రెడిషనల్ బోట్ ఓనర్ అసోసియేషన్, డ్రై ఫిష్ ప్రాసెసర్, మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు తదితరులతో శ్రీ రూపాలా మాట్లాడి చేపల పెంపకం ద్వారా వారి జీవనోపాధి, ఆహార భద్రత గురించి వివరంగా మాట్లాడారు. అనుసంధాన సమావేశం (ఇంటరాక్టివ్ సెషన్) మత్స్యకారులు తమ క్షేత్రస్థాయి అనుభవాలు, తాము  ఎదుర్కొంటున్న సమస్యలను స్వేచ్చగా వెల్లడి చేయడానికి సహాయపడింది. రాబోయే కాలంలో కూడా సాగర్ పరిక్రమ వంటి కార్యక్రమాలు చేపట్టాలని లబ్ధిదారులు కోరారు.  

శ్రీ పురుషోత్తం రూపాల పిఎంఎంఎస్ వై, కెసిసి వంటి పథకాల కింద లబ్దిదారులను సత్కరించారుప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై) పథకం గురించి వివరించారుఇన్ ఫ్రా అభివృద్ధి, మార్కెటింగ్, ఎగుమతులు  సంస్థాగత ఏర్పాట్లు మొదలైన వాటితో సహా చేపల ఉత్పత్తి, ఉత్పాదకత దానికి సంబంధించిన కార్యకలాపాల పెంపు, విస్తరణ గురించి ప్రధానంగా ప్రసంగించారు. మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు లబ్ధిదారులు ముందుకు వచ్చి పథకాల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని కోరారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా పథకాలపై అవగాహన కల్పించేందుకు వలంటీర్లు సహకరించాలని కోరారు. బాలుగావ్ లోని చిలకా లేక్ ఫిష్ మార్కెట్ లో చేపల వ్యాపారులతో కేంద్రమంత్రి ముఖాముఖి మాట్లాడారు. చిలక సరస్సు భారతదేశ  తూర్పు తీరంలో ఉన్న ఒడిషా రాష్ట్రంలో వివిధ జాతుల చేపలతో సహా గొప్ప జీవవైవిధ్యం కలిగిన అతిపెద్ద తీరప్రాంత మడుగు. సుమారు లక్షా తొంభై వేల మంది మత్స్యకారులు చిలకా సరస్సుతో అనుసంధానమై ఉన్నందున చేపల పెంపకంలో నిమగ్నమైన వారి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ముఖాముఖి ఎంతో దోహదపడింది. శ్రీ పురుషోత్తం రూపాల కెసిసి ప్రమోషన్ గురించి చర్చించారుఒడిశాలోని కోస్తా జిల్లాల్లో ముందస్తు సంతృప్తత (ప్రీ శాచురేషన్) క్యాంపులు నిర్వహించారు, అక్కడ మత్స్యకారులు , చేపల రైతులకు కెసిసి రిజిస్ట్రేషన్, దాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు, ఇతర భాగస్వాముల్లో అవగాహనను పెంపొందించడానికి మత్స్యశాఖ ఇప్పటికే 'మత్స్య సంపద జాగృక్త అభియాన్' పై వ్యూహాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. సాగర్ పరిక్రమ ఫేజ్-11 కార్యక్రమం తోపాటు "మత్స్య సంపద జాగృక్త అభియాన్" ను సమాంతరంగా చేపట్టింది.

 అనంతరం సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-11 బాలుగావ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు చేరుకుంది. కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా, ఇతర ప్రముఖులు మత్స్యకారులతోనూ , మహిళా మత్స్యకారుల తోనూ,  చేపల రైతులు, పిఎఫ్ సి ల  సభ్యులతోనూ సంభాషించారు.  లింగ సమ్మిళిత వాతావరణం, మహిళల సామాజిక-ఆర్థిక అభివృద్ధి ,  మత్స్య రంగంలో మొత్తం వృద్ధికి దారితీసే మహిళల కోసం పిఎమ్ఎంఎస్ వై  పథకం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలియజేశారు.

వివిధ ప్రాంతాల నుండి సుమారు 9,200 మంది మత్స్యకారులు, వివిధ మత్స్య పరిశ్రమ భాగస్వాములు, నిపుణులు, సాగర్ పరిక్రమ ఫేజ్ 11 కార్యక్రమానికి  హాజరయ్యారు  ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ట్విట్టర్ ,  ఫేస్ బుక్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

నేపథ్యం

సాగర్ పరిక్రమ యాత్ర పది దశలు వివిధ తీర ప్రాంతాల చుట్టూ గణనీయమైన ప్రయాణాన్ని ఆవిష్కరించాయి. వివిధ సవాళ్లనువిభిన్న సంస్కృతులను అవలోకనం చేశాయిపది దశలను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మత్స్యశాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, ఒడిశా ప్రభుత్వ మత్స్యశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారుల ప్రతినిధులు సంయుక్తంగా సాగర్ పరిక్రమ 11 దశ ను చేపట్టి చురుగ్గా పాల్గొన్నారు. ఒడిశా రాష్ట్రంలో 480 కిలోమీటర్ల సముద్రతీరం, 24,000 .కి.మీ ఖండాంతర షెల్ఫ్ వైశాల్యం, 0.017 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్, 33 సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 57 ఐస్ ప్లాంట్లు, మూడు చేపలు, రొయ్యల దాణా మిల్లులు ఉన్నాయి. ఒడిషా నీటి జీవవైవిధ్యం , చేపల సమృద్ధి 16 లక్షలకు పైగా మత్స్యకారులకువాణిజ్య చేపలుఆక్వాకల్చర్ వంటి వివిధ ఇతర పరిశ్రమలకు మద్దతు ఇస్తోంది.

మత్స్యకారుల ఆర్థిక సాధికారత ద్వారా సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న చేపల పరిశ్రమ ప్రకాశిస్తున్న నక్షత్రంగా పరిగణించబడుతుంది. మత్స్యకారుల సమస్యలు, అనుభవాలు, ఆకాంక్షలను బాగా అర్థం చేసుకోవడంతో పాటు మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు అందుబాటులో ఉన్న పథకాల ప్రయోజనాలు అందించడానికి భారత ప్రభుత్వం సాగర్ పరిక్రమ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది.

***


(Release ID: 1994092) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Hindi , Odia