మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
టర్కియే, మలేషియా హజ్ వ్యవహారాలు మరియు నిర్వహణ చేపట్టే మంత్రులతో కేంద్ర మంత్రులు భేటీ
- డబ్ల్యుసీడీ & మైనారిటీ వ్యవహారాల కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, విదేశీ వ్యవహారాలు & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్లు టర్కియే మరియు మలేషియా నుండి హజ్ వ్యవహారాలు మరియు నిర్వహణ మంత్రులతో సమావేశం
- జెద్దా, కేఎస్ఏలో సౌదీ అరేబియా రాజ్యంతో ద్వైపాక్షిక హజ్ ఒప్పందం 2024పై సంతకం చేసిన సందర్భంగా సమావేశం
Posted On:
07 JAN 2024 8:20PM by PIB Hyderabad
డబ్ల్యుసీడీ & మైనారిటీ వ్యవహారాల కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీతో పాటు విదేశీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ. వి. మురళీధరన్ లు టర్కియేలోని డైరెక్టరేట్ ఆఫ్ రిలిజియస్ అఫైర్స్ (డయానెట్) అధ్యక్షుడు హెచ్ఈ ప్రొఫెసర్ డా. అలీ ఎర్బాస్, మరియు ప్రధాన మంత్రి శాఖ (ఇస్లామిక్ వ్యవహారాలు) మంత్రి డాటో సెటియా డా. హెచ్‌జె. నయీమ్ బిన్ హెచ్జే మొఖ్తార్లతో సమావేశమయ్యారు. జెడ్డాలో కేఎస్ఏలో సౌదీ అరేబియా (కేఎస్ఏ)తో ద్వైపాక్షిక హజ్ ఒప్పందం 2024పై సంతకం చేస్తున్న సందర్భంగా వరుసగా రెండు వేర్వేరు సమావేశాల్లో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. సమావేశాల సందర్భంగా, హజ్ నిర్వహణ మరియు పరిపాలనపై అనుభవాలు పంచుకున్నారు మరియు సంబంధిత సహచరులతో ఉత్తమ అభ్యాసాలపై ఆలోచనల మార్పిడి జరిగింది. సేవలను సజావుగా అందించడం, యాత్రికుల కోసం పటిష్టమైన మరియు నమ్మదగిన వైద్య సదుపాయాల ఏర్పాటు మరియు పెంపుదల, మహిళా యాత్రికుల సంరక్షణ మరియు సౌకర్యాల కోసం ప్రత్యేకంగా తీసుకున్న చర్యల గురించి ప్రత్యేకంగా చర్చించారు. హజ్ యాత్రికులకు ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలా చూసేందుకు, మరింత ఆలోచనలు మరియు సహకార మార్పిడికి మార్గాలు మరియు పరిధిని అన్వేషించాలని మరింత పరిష్కరించేలా చూడాలని ఈ సమవేశంలో నిర్ణయించారు. .
***
(Release ID: 1994047)
Visitor Counter : 136