రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రాబోయే వైబ్రంట్‌ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 పదవ ఎడిషన్‌లో పాల్గొననున్న ఐడెక్స్-డియో

Posted On: 07 JAN 2024 4:07PM by PIB Hyderabad

ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్- డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (ఐడెక్స్-డియో) గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 2024 జనవరి 10 నుండి 12 వరకు జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 పదవ ఎడిషన్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. సమ్మిట్ 'గేట్‌వే టు ది ఫ్యూచర్' థీమ్ ఆధారంగా ఐడెక్స్‌ పెవిలియన్ ఏర్పాటు చేయబడుతోంది. ఇందులో ఐడెక్స్‌ ఆవిష్కర్తలు మానవరహిత సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్ మెటీరియల్ మొదలైన రంగాలలో తమ భవిష్యత్ సాంకేతికతలను ప్రదర్శిస్తారు.

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024లో ఐడెక్స్‌కు చెందిన ప్రముఖ డిఫెన్స్ స్టార్టప్‌లు/ఎంఎస్‌ఎంఈలు తమ అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తాయి. ఈ ట్రేడ్ షో ‘టెక్‌ఎడ్‌ అండ్‌ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్’పై దృష్టి సారిస్తుంది అలాగే ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్‌ని ప్రదర్శిస్తుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, ఇండియా స్టాక్ మరియు పరిశ్రమ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ మరియు ఏఐ/ఎంఎల్‌ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలను వివరిస్తుంది.

ఐడెక్స్‌ కొత్త భాగస్వామ్యాలు మరియు సహకారాలను అన్వేషించడానికి, పరిశ్రమల నాయకులు, విధాన రూపకర్తలు మరియు ఆవిష్కర్తలతో కలిసి భవిష్యత్తును సమిష్టిగా ఊహించుకోవడానికి మరియు గుజరాత్ మరియు అంతకు మించిన శక్తివంతమైన ఆర్థిక ప్రకృతి దృశ్యానికి దోహదపడేందుకు కూడా ఎదురుచూస్తుంది.

ఐడెక్స్‌ గురించి

ఐడెక్సె(ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్) 2018లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్‌షిప్ స్కీమ్. రక్షణ మరియు ఏరోస్పేస్ సెక్టార్‌లో స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లు, ఎంఎస్‌ఎంఈలు, ఇంక్యుబేటర్లు మరియు విద్యాసంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా  ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడంఈ పథకం యొక్క లక్ష్యం. భారతీయ రక్షణ మరియు ఏరోస్పేస్‌లో భవిష్యత్తులో స్వీకరించడానికి గణనీయమైన సంభావ్యతతో ఆర్&డి కోసం గ్రాంట్లు మరియు మద్దతును ఐడెక్స్‌  అందిస్తుంది.

ఇది ప్రస్తుతం దాదాపు 400 కంటే ఎక్కువ స్టార్టప్‌లు మరియు ఎంఎస్‌ఎంఈలతో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు రూ. 2000 కోట్ల విలువైన 31 వస్తువులను కొనుగోలు చేసింది. రక్షణ పర్యావరణ వ్యవస్థలో గేమ్-ఛేంజర్‌గా గుర్తింపు పొందిన ఐడెక్స్‌ రక్షణ రంగంలో ఇన్నోవేషన్‌కు ప్రధానమంత్రి అవార్డును అందుకుంది.

 

***

(Release ID: 1993983) Visitor Counter : 193


Read this release in: English , Urdu , Hindi , Tamil