వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం గతిశక్తి కింద చేపట్టిన మూడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించిన పీఎం గతి శక్తి 63వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశం


5,100 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారులు, రైల్వే ప్రాజెక్టులను సమీక్షించిన సమావేశం

రెండు ముఖ్యమైన నగరాల మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణంతో మీర్జాపూర్-అయోధ్య కారిడార్‌ను సమీక్షించిన ఎన్‌పిజి

Posted On: 06 JAN 2024 10:01AM by PIB Hyderabad

పీఎం గతిశక్తి 63వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్  సమావేశం 2023 జనవరి 4న న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో డిపిఐఐటీ  ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి సుమితా దావ్రా. అధ్యక్షతన జరిగింది.సమావేశానికి  రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఓడరేవులు,నౌకా నిర్మాణం , పౌర విమానయాన మంత్రిత్వ శాఖ,   జలమార్గాల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ శాఖ, నూతన పునరుత్పాదక మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ  , నీతి  ఆయోగ్ కు చెందిన సీనియర్  అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ (2), రైల్వే శాఖ(1) 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ప్రాజెక్టులను సమీక్షించారు. ఒడిశా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా నిర్మించనున్న  కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ సమీక్షకు వచ్చింది. ఈ ప్రాజెక్టు దేశంలో ఉత్తర/పశ్చిమ ప్రాంతంలో ఉన్న  బొగ్గు గనుల నుంచి  వివిధ పరిశ్రమలు/థర్మల్ పవర్ ప్లాంట్‌లకు బొగ్గు రవాణాను సులభతరం చేస్తుంది. అన్ని బొగ్గు బ్లాకులకు రవాణా సౌకర్యం కల్పించి , ప్రస్తుత రైల్వే ప్రధాన మార్గంలో రద్దీని తగ్గించి  సామర్థ్యాన్ని పెంచుతుంది.  అదే సమయంలో తీరప్రాంత షిప్పింగ్ మార్గం కోసం గనులను పారాదీప్ పోర్ట్‌కు కలుపుతుంది. ప్రణాళికాబద్ధమైన మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌కు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు  అటవీ ప్రాంతంపై ప్రభావం తగ్గించే విధంగా  రైలు మార్గం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు సమావేశం గుర్తించింది. 

రద్దీ ప్రాంతాలను వ్యూహాత్మకంగా దాటవేస్తూ కీలకమైన పారిశ్రామిక , వ్యాపార కేంద్రాలకు లింక్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మల్టీమోడల్ కనెక్టివిటీని మెరుగుపరచడం  ప్రాథమిక లక్ష్యంగా   గతి శక్తి  అమలు జరుగుతోంది.  మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడంతో పాటు  వ్యాపార అవకాశాలను విస్తరించడం, స్థానిక సామాజిక-ఆర్థిక అభివృద్ధి , ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా  ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. 

మీర్జాపూర్-అయోధ్య కారిడార్‌ను కూడా  ఎన్‌పిజి   పరిశీలించింది. ఈ ప్రాజెక్టు జనసాంద్రత ఎక్కువగా ఉన్న   రెండు ముఖ్యమైన నగరాలకు బైపాస్ రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తుంది.రవాణా రంగంపై ప్రాజెక్టు ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.  ప్రయాణ ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల  నిర్మాణం వల్ల ప్రధాన నగరం మీదుగా సాగుతున్న వాహనాల రాకపోకలు బైపాస్ రహదారి మీదుగా సాగుతాయి. దీనివల్ల పట్టణ ప్రాంత రహదారులపై ఒత్తిడి తగ్గుతుంది.   ఈ కారిడార్ గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను అందించి ఉద్యోగ అవకాశాల కల్పన, పర్యాటకం, మతపరమైన ప్రదేశాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతాయి.మార్గంలో ఉన్న కీలక ఆర్థిక కేంద్రాలు, పారిశ్రామిక మండలాలు, వ్యవసాయ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కలుగుతుంది. .  గిడ్డంగులు, పంపిణీ కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్‌ల వంటి అనుబంధ మౌలిక సదుపాయాల వృద్ధికి సహకరిస్తుంది. , ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యం , పెట్టుబడులను పెంచుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయనున్న  మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ (MMLP) నిర్మాణం  ఎన్‌పిజి  లో సమీక్షకు వచ్చింది.  ఈ ప్రాజెక్ట్ సమీపంలోని పారిశ్రామిక సమూహాలకు అగ్రిగేషన్, డిసగ్రిగేషన్ హబ్‌గా పనిచేయడం ద్వారా రవాణా  సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. బహుళ-మోడల్ రైలు-రోడ్ కనెక్టివిటీ మెరుగుపరచడం, సుదూర బల్క్ కార్గో రవాణా కోసం రైలుకు అనుకూలంగా మోడల్ షిఫ్ట్ ద్వారా బెంగళూరు, చెన్నై సమీపంలో  ప్రస్తుత రైల్వే లైన్‌కు  సమీపంలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల  కీలకమైన ఆర్థిక కేంద్రాలకు సరైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 
ఈ ప్రాజెక్టులు వివిధ రకాల రవాణా మార్గాలను ఏకీకృతం చేసి, గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను అందించి  ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని ప్రత్యేక కార్యదర్శి పేర్కొన్నారు. 
 ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ప్రాంతీయ అభివృద్ధి అంశాన్ని  పొందుపరచాలని, మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించడానికి, సమగ్ర ప్రణాళిక అమలుకు  రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖ లతో సహా స్థానిక అధికారులు సమన్వయంతో పని చేయాలని  ఆమె సూచించారు. . ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ప్, గతిశక్తి జాతీయ  పోర్టల్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను సమావేశంలో వివరించారు. 

 

***


(Release ID: 1993973) Visitor Counter : 133