యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యాంటీ డోపింగ్ అవగాహన సెషన్‌ను నిర్వహించిన నాడా ఇండియా


-క్రీడలు & యువజన సంక్షేమ శాఖ లక్నో వారికి కోసం నిర్వాహణ

प्रविष्टि तिथि: 05 JAN 2024 2:34PM by PIB Hyderabad

భారత జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా), లక్నోలోని క్రీడలు & యువజన సంక్షేమ శాఖ వారి కోసం యాంటీ డోపింగ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. జనవరి 4, 2024న లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో సెషన్ జరిగింది. ఇది క్లీన్ స్పోర్ట్స్ మాన్‌షిప్ సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. 30 మంది అథ్లెట్ సపోర్ట్ పర్సనల్ (ఏఎస్పీ)తో సహా 200 మందికి పైగా వ్యక్తులు ఇందులో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.  డోపింగ్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా నాడా ఇండియా అథ్లెట్లు, కోచ్‌లు మరియు క్రీడా సిబ్బందికి.. ఆయా క్రీడలలో సమగ్రతను కాపాడుకోవడం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం మరియు సాధికారత కల్పించడం దిశగా ఈ కార్యక్రమం జరిగింది.

 

***


(रिलीज़ आईडी: 1993880) आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Tamil