గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా వీధివ్యాపారుల సాధికారతకు అనువైన వాతావరణాన్ని కల్పించి తగిన మద్దతునిచ్చేందుకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉంది.: మంత్రి హర్‌దీప్‌ పూరి


వీధివ్యాపారుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ సదస్సును ప్రారంభించిన హర్‌దీప్‌ ఎస్‌.పూరి.

పిఎఐఎస్‌ఎ పోర్టల్‌ డాష్‌ బోర్డు, పిఎం స్వనిధి మిషన్‌ పర్యవేక్షణ పోర్టల్‌ ప్రారంభం.

వీధివ్యాపారులకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడంపై పానల్‌ చర్చాకార్యక్రమం ఏర్పాటు.

వీధివ్యాపారుల చట్టం 2014 కింద ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ,వివాదాల పరిష్కారం, వీధి వ్యాపారుల హక్కుల

పరిరక్షణ, వారిపట్ల పక్షపాత రహితంగా వ్యవహరించడం వంటి వాటి విషయంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

వీధివ్యాపారులు తమ వ్యాపారాలను సజావుగా నిర్వహించుకునే వాతావరణం ఉండాలంటే , పటిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగం ఉండాలి : శ్రీ హర్దీప్‌ ఎస్‌.పూరి, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి.

Posted On: 05 JAN 2024 11:16AM by PIB Hyderabad

వీధివ్యాపారుల చట్టం 2014 ప్రకారం, వీధివ్యాపారులకు సంబంధించిన వివాదాలు పరిష్కరించడానికి, వారి ప్రయోజనాలు కాపాడడానికి, పటిష్టమైన వివాద పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయడం , వాటిని నిర్వహించడం అవసరమని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్‌ ఎస్‌.పూరి అన్నారు.
వీధివ్యాపారుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి జి.ఆర్‌.సి లను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అభినందించారు. ఇతర రాష్ల్రాలు కూడా వీలైనంత త్వరగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో వీధివ్యాపారులు ఎంతో కాలంగా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారని, వారికి తమ మంత్రిత్వశాఖ గట్టి మద్దతునిస్తుందని, దేశవ్యాప్తంగా వారికి సాధికారత కల్పిస్తుందని అన్నారు.
వీధివ్యాపారుల వివాదాల ఫిర్యాదుల పరిష్కార కమిటీ (జిఆర్‌సి)ని 2024 జనవరి 04 వ తేదీన న్యూఢల్లీిలోని ఇండియా హాబిటైట్‌ సెంటర్‌ లో ఏర్పాటు చేశారు. వీధివ్యాపారుల వివాదాల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయవలసిన, వాటిని సమర్థంగా పనిచేయించవలసిన అవసరాన్ని నొక్కిచెబుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిఆర్‌సి సభ్యులు , వీధివ్యాపారుల సంక్షేమంతో ముడిపడిన వివిధ స్టేక్‌ హోల్డర్లను ఒక వేదికపైకి
తేవడంతోపాటు, వీధివ్యాపారుల చట్టం 2014 కింద గల చట్టపరమైన అంశాలపై మరింత లోతైన అవగాహనను పెంచడం ఈ సమావేశం ఉద్దేశం.

ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు, పౌర సమాజ ప్రతినిధులు, జిఆర్‌సి సభ్యులు, ఇతర నిపుణులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల అధికారులు, జిఆర్‌సి సభ్యులకు ఈ విషయమై సామర్ధ్యాల పెంపునకు ఇది ఎంతగానో దోహదపడిరది. వీధివ్యాపారులకు రక్షణ కల్పించడం, వారి సమస్యలు , వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం ఈ సమావేశం ఉద్దేశం. ఈ సమావేశంలో పాల్గొన్నవారు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, విజయగాధలను పరస్పరం తెలుసుకోవడానికి వీలు కలిగింది. ఈ సమావేశం సందర్భంగా పిఎఐఎస్‌ఎ పోర్టల్‌ డాష్‌ బోర్డు, పి.ఎం.స్వనిధి మిషన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌లను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌ల ద్వారా మిషన్‌ మానిటరింగ్‌ కు సంబంధించి రియల్‌టైమ్‌ సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుకలుగుతుంది. ఇది జవాబుదారిత్వానికి, పారదర్శకతకు అవకాశం కల్పిస్తుంది.

ఈ సమావేశం సందర్భంగా సెంటర్‌ ఫర్‌ సివిల్‌ సొసైటీ, వీధివ్యాపారుల చట్టం 2014, జిఆర్‌సి, చట్టపరమైన అంశాలు, దాని పర్యవసానాలు తదితర అంశాలపై సెంటర్‌ ఫర్‌ సివిల్‌ సొసైటీ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చింది. వీధివ్యాపారులకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై ప్యానల్‌ చర్చా కార్యక్రమం జరిగింది. చర్చలో పాల్గొన్నవారు వీధివ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలియజేశారు.
4342 టౌన్‌ వెండిరగ్‌ కమిటీల ఏర్పాటు, 13,403 వెండిరగ్‌ జోన్‌ల నిర్ధారణ, 1350 వెండిరగ్‌ మార్కెట్‌ల నిర్మాణం, 38.06 లక్షల వెండిరగ్‌ సర్టిఫికేట్ల జారీ ద్వారా వీధివ్యాపారుల చట్టం ,ఏకపక్షంగా వారిని తొలగించడం నుంచి వారి ప్రయోజనాలను కాపాడుతుంది. ఇది ఆర్థిక సుస్థిరతకు, చైతన్యవంతమైన పట్టణ వ్యాపార వాతావరణనాకి వీలు కల్పిస్తుంది. 

పి.ఎం.స్వనిధి:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జూస్‌ 01 వ తేదీన పి.ఎం.స్వనిధి పథకాన్ని ప్రారంభించారు. వీధివ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు దీనిని తీసుకువచ్చారు. కోవిడ్‌ 19 మహమ్మారి అనంతరం వీధివ్యాపారుల వ్యాపారాలు దెబ్బతినకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. 57.83 లక్షల మంది వీధివ్యాపారులకు మొదటిసారిగా టరమ్‌ లోను లభించింది. 16.23 లక్షల మంది రెండోసారి టరమ్‌ లోన్‌ పొందారు. 2.16 లక్షల మంది మూడో సారి టరమ్‌ లోన్‌ పొందారు.  మూడుసార్లు వచ్చిన కోవిడ్‌ సమయంసహా 43 నెలల వ్యవధిలో ఈ ప్రగతి సాధించారు.

 

***



(Release ID: 1993872) Visitor Counter : 72