బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాణిజ్య వేలం కింద ఉత్ప‌త్తిని ప్రారంభించిన ఆరు బొగ్గు గ‌నులు & త్వ‌ర‌లో కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నున్న మ‌రో మూడు


నేటివ‌ర‌కూ 91 బొగ్గు/ లిగ్నైట్ గ‌నుల‌ను విజ‌య‌వంతంగా వేలం వేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ‌

ఈ మొత్తం 91 గ‌నుల నుంచి రూ. 33,343 కోట్ల పెట్టుబ‌డి, మూడు ల‌క్ష‌ల ఉపాధి క‌ల్ప‌న‌కు అవ‌కాశాలు

Posted On: 05 JAN 2024 12:32PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ మూడేళ్ళ కింద‌ట ప్రారంభించిన వాణిజ్య బొగ్గు గ‌నుల వేలం కింద‌, నేటి వ‌ర‌కూ మొత్తం 91 గ‌నుల‌ను విజ‌య‌వంతంగా వేలం వేశారు. ఈ కేటాయించిన గ‌నుల‌లో ఆరు వాణిజ్య గ‌నులు ఇప్ప‌టికే బొగ్గు ఉత్ప‌త్తిని ప్రారంభించ‌గా, మ‌రొకటి రెండు నెల‌ల్లో మ‌రో మూడు ఉత్ప‌త్తిని ప్రారంభించ‌నున్నాయి. 
నాలుగు రాష్ట్రాల‌లో 31 బొగ్గు గ‌నుల‌ను అందిస్తూ, 9వ ద‌శ వేలాన్ని ఇటీవ‌లే డిసెంబ‌ర్ 2023లో ప్రారంభించారు. బొగ్గు/  లిగ్నైట్ గ‌నులు క‌లిగిన రాష్ట్రాలైన జార్ఖండ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, తెలంగాణాలు 9వ ద‌శ వేలం కింద‌కు వ‌స్తాయి.  ప్ర‌ధాన‌మంత్రి 2020లో ప్రారంభించిన‌ అత్యంత పార‌ద‌ర్శ‌క‌మైన ఆన్‌లైన్ వేలం ద్వారా  బొగ్గు మంత్రిత్వ శాఖ నేటివ‌ర‌కూ ఏడు ద‌శ‌ల వేలాన్నివిజ‌య‌వంతంగా పూర్తి చేసింది. 
సంవ‌త్స‌రానికి 220.90 మిలియ‌న్ ట‌న్నుల (ఎంటిపిఎ) గ‌రిష్ట సామ‌ర్ధ్య స్థాయిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, ఇప్ప‌టికే వేలం వేసిన గ‌నుల నుంచి బొగ్గు తవ్వ‌కాల ద్వారా ఏడాదికి రూ. 33,343 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తుంది. ఈ గ‌నులు పూర్తి స్థాయిలో ప‌ని చేయ‌డం మొద‌లుపెడితే, అవి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా దాదాపు మూడు ల‌క్ష‌ల మందికి ఉపాధిని క‌ల్పిస్తుంది.
వాణిజ్య బొగ్గు మైనింగ్ అన్న‌ది దేశంలోకి కొత్త పెట్టుబ‌డుల‌ను తీసుకువ‌స్తుంద‌ని అంచ‌నా. ఈ వేలాల ద్వారా వ‌చ్చే ఆదాయం మొత్తాన్ని బొగ్గు క‌లిగిన రాష్ట్రాలు అయిన జార్ఖండ్‌, ఛత్తీస్‌గ‌ఢ్‌, ఒడిషా, మ‌ధ్య ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, ప‌శ్చిమ బెంగాల్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, బీహార్, అస్సాంల‌కే కేటాయిస్తారు. 

 

***
 


(Release ID: 1993503) Visitor Counter : 126