రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అరేబియా సముద్రంలో హైజాక్‌ ఘటనపై వేగంగా స్పందించిన భారత నౌకాదళం

प्रविष्टि तिथि: 05 JAN 2024 12:44PM by PIB Hyderabad

అరేబియా సముద్రంలో, లైబీరియా జెండాతో ఉన్న నౌక హైజాకింగ్‌ ప్రయత్నంపై భారత నౌకాదళం వేగంగా స్పందించింది. ఐదు లేదా ఆరుగురు గుర్తు తెలియని సాయుధులు 04 జనవరి 2024న సాయంత్రం ఓడలోకి ప్రవేశించారంటూ నౌక నుంచి యూటీఎంటీవో పోర్టల్‌కు సందేశం వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న భారత నౌకాదళం తక్షణం రంగంలోకి దిగింది. సముద్ర భద్రత కోసం మోహరించిన నిఘా విమానాన్ని, ఐఎస్‌ఎస్‌ చెన్నైని సాయం కోసం పంపింది.

నిఘా విమానం, 05 జనవరి 24 తెల్లవారుజామున ఓడను చేరుకుంది. ఓడలోని సిబ్బంది సమాచార సంబంధాలు ఏర్పరుచుకుని, అందరు సురక్షితంగా ఉన్నారని నిర్ధరించింది.

నౌక కదలికలను నిఘా విమానం పర్యవేక్షిస్తుండగా, ఐఎస్‌ఎస్‌ చెన్నై కూడా నౌక వద్దకు చేరుకుంది.

ఇతర సంస్థలు/ఎంఎన్‌ఎఫ్‌ల సహకారంతో మొత్తం పరిస్థితి భారత నౌకాదళం నిశితంగా పరిశీలిస్తోంది.

అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలతో పాటు సముద్ర ప్రాంతంలోని వ్యాపార నౌకల భద్రత కోసం భారత నౌకాదళం కట్టుబడి ఉంది.

 

***


(रिलीज़ आईडी: 1993495) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil