విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పంపులతో నీటిసరఫరా ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వీలు కల్పించే 750 మెగావాట్ల కుప్పాహైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించి, రూ 4,000 కోట్ల పెట్టుబడికి గుజరాత్ ప్రభుత్వ జి.పి.సి.ఎల్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న ఎన్.హెచ్.పి.సి.
Posted On:
04 JAN 2024 7:45PM by PIB Hyderabad
పరిశుభ్రమైన, హరిత ఇంధన దిశగా మరో అడుగు ముందుకువేస్తూ , ఎన్.హెచ్.పి.సి సంస్థ, పంపులతో నీటిసరఫరా ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వీలు కల్పించే 750 మెగావాట్ల కుప్పాహైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించి, రూ 4,000 కోట్ల పెట్టుబడికి గుజరాత్ ప్రభుత్వ జి.పి.సి.ఎల్ సంస్థతో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు గుజరాత్ లోని ఛోటా ఉదయపూర్ లో ఏర్పాటుకానుంది.
ఇంధన నిల్వకు సంబంధించి మెరుగైన పరిష్కారంగా ఎన్.హెచ్.పి.సి సంస్థ, గుజరాత్ ప్రభుత్వం సంయుక్తంగా పంపులతో నీటి సరఫరా ద్వారా నీటి నిల్వ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు కారణంగా ఈ ప్రాంతంలో స్థానికంగా ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతోపాటు, చెప్పుకోదగిన స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
ఈ అవగాహనా ఒప్పందంపై గుజరాత్ లోని గాంధీనగర్ లో గల సెక్రటేరియట్ లో సంతకాలు జరిగాయి. 2023 జనవరి 3 వ తేదీన ఉజ్వల గుజరాత్ కార్యక్రమంలో భాగంగా ఈ సంతకాలు జరిగాయి. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ ఇంధన శాఖమంత్రి శ్రీ కానూభాయ్ దేశాయ్ ల సమక్షంలో
జిపిసిఎల్ మేనేజింగ్ డైరక్టర్,శ్రీ అరుణ్ మహేశ్ బాబు, ఎన్.హెచ్.పి.సి , డైరక్టర్ రెన్యువల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ శ్రీ వి.ఆర్.శ్రీవాత్సవలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
2030 నాటికి దేశం పరిశుభ్రమైన ,హరిత ఇంధనాన్ని అంటే 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలన్న, 2070 నాటికి కాలుష్య ఉద్గారాల విడుదల శూన్యస్థాయికి చేరాలన్న జాతీయలక్ష్య సాధనకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
ఎన్.హెచ్.పి.సి లిమిటెడ్ భారతదేశ ప్రముఖ జలవిద్యుత్ కంపెనీ. ఎన్.హెచ్.పిసి మొత్తం స్థాపిత సామర్ధ్యం 7,097.2 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం (ఇందులో సౌర, పవన విద్యుత్ కూడా కలిసి ఉంది). ఎన్.హెచ్.పి.సికి గల 25 పవర్ స్టేషన్లు ఉన్నాయి. సబ్సిడరీల ద్వారా 1520 మెగావాట్ల విద్యుత్ ను ఇది ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఎన్.హెచ్.పి.సి (సబ్సిడరీలు, జాయింట్ వెంచర్ కంపెనీలతో కలిపి) సుమారు 10,449 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో 15 ప్రాజెక్టుల నిర్మాణంలో నిమగ్నమై ఉంది.
***
(Release ID: 1993357)
Visitor Counter : 163