గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సమగ్ర పట్టణ సాధికారతను ప్రతిబింబించేలా ‘అర్బన్ స్క్వేర్’ ప్రదర్శన
- ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
Posted On:
03 JAN 2024 6:10PM by PIB Hyderabad
"అర్బన్ స్క్వేర్ పట్టణ సాధికారతను పెంపొందించడంలో మా నిబద్ధతను ఎత్తి చూపుతుంది. మన పట్టణ చేతివృత్తుల కళాకారులు మరియు వ్యవస్థాపకుల సృజనాత్మకత స్థితిస్థాపకతను ప్రదర్శిస్తుంది. ఈ ఉత్సవం సమగ్రమైన మరియు స్వావలంబన కలిగిన పట్టణ ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంలో మా అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. "
-హర్దీప్ ఎస్ పురి, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి
కేంద్ర గృహ & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి 'అర్బన్ స్క్వేర్'ను ప్రారంభించారు. ఇది సందర్శకులకు చేనేత వస్త్రాలు, అప్‌సైకిల్ డెకర్, అందమైన కుండలు, ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు, చేతివృత్తుల వారి హస్త కళలు, రుచికరమైన వీధి ఆహారంతో సహా అనేక రకాల ఉత్పత్తులతో కూడిన పట్టణ అనుభవాన్ని అందిస్తుంది. డి.ఎ.వై-ఎన్.యు.ఎల్.ఎం. కింద పట్టణ స్వయం-సహాయ బృందాలు (ఎస్.హెచ్.జి.లు) మరియు పీఎం స్వనిధి ఆధ్వర్యంలో వీధి ఆహార విక్రేతలతో సహా 150 మంది ప్రదర్శనకారుల భాగస్వామ్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశంలోని విభిన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రదర్శన అట్టడుగు పట్టణ వర్గాల స్ఫూర్తి నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి 'ఆత్మనిర్భర్ భారత్' విజన్ మార్గదర్శకత్వంలో భాగంగా ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో 'ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్'లో భాగంగా ఐటీపీఓలో ఈ ప్రదర్శన నిర్వహించబడుతోంది. ఈ ప్రదర్శన జనవరి 3న ప్రారంభమైంది. 10 జనవరి 2024 వరకు కొనసాగుతుంది. 'అర్బన్ స్క్వేర్' సమ్మిళిత నగరానికి అవసరమైన అంశాలను తెలియజేసేలా సాగుతోంది. వీధులు, బహిరంగ ప్రదేశంలో వీధి వ్యాపారులు మరియు పట్టణ స్వయం సహాయక బృందాల సభ్యులను ఏకీకృతం చేయడం ద్వారా మన నగరాల్లోని అట్టడుగు వర్గాలకు- పట్టణ పేదలకు ఈ ప్రదర్శన చోటు కల్పిస్తుంది. విభిన్న విభాగాలు నిర్దిష్ట రకాల ఉత్పత్తుల కోసం కేటాయించబడ్డాయి. నగర చౌక్‌లు, పబ్లిక్ స్క్వేర్‌ల వంటి సెంట్రల్ సీటింగ్ మరియు వినోద స్థలాన్ని కలిగి ఉంది. ఎగ్జిబిషన్లో సమాచారం-ప్రదర్శనలు పట్టణ వీధులు మరియు బహిరంగ ప్రదేశాలకు సంబంధించిన అంశాలను అలాగే గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క డి.ఎ.వై-ఎన్.యు.ఎల్.ఎం. మరియు పీఎం స్వనిధి పథకాల ప్రభావాన్ని గురించి తెలియబరుస్తోంది.
(Release ID: 1993081)
Visitor Counter : 144