సహకార మంత్రిత్వ శాఖ
"ఆత్మనిర్భర్ భారత్" సాధన దిశగా మరో ముందడుగు
ప్రధానమంత్రి శ్శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు "ఆత్మనిర్భర్ భారత్" సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా కందిపప్పు సేకరణ,కొనుగోలు, చెల్లింపుల కోసం రేపు న్యూ ఢిల్లీలో ప్రత్యేక పోర్టల్ ప్రారంభించనున్నకేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
రైతు-కేంద్రీకృత కార్యక్రమం ద్వారా నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ ద్వారా సేకరణ ప్రక్రియ ను క్రమబద్ధీకరించి, ప్రత్యక్ష బ్యాంకు బదిలీల ద్వారా కందిపప్పు ఉత్పత్తిదారులకు మెరుగైన ధర చెల్లించి సాధికారత కల్పించి దేశీయ పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడం, దిగుమతులు తగ్గించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు
పోర్టల్ లో నమోదైన రైతుల నుంచి పప్పుధాన్యాల బఫర్ స్టాక్ కోసం సేకరణ జరుగుతుంది. కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరలో ఏది ఎక్కువైతే అది రైతులకు చెల్లించబడుతుంది.
గోధుమలు, వరి వంటి సాంప్రదాయ పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజల సేకరణ ద్వారా నూతన హరిత విప్లవ సాధన లక్ష్యంగా కందిపప్పు సేకరణ పోర్టల్ ప్రారంభం
Posted On:
03 JAN 2024 7:58PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు "ఆత్మనిర్భర్ భారత్" సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా కందిపప్పు సేకరణ,కొనుగోలు, చెల్లింపుల కోసం రేపు న్యూ ఢిల్లీలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రత్యేక పోర్టల్ ప్రారంభిస్తారు. "ఆత్మనిర్భర్ భారత్" సాధన దిశగా కందిపప్పు ప్రత్యేక పోర్టల్ మరో ముందడుగు గా ఉంటుంది. పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం శ్రీ అమిత్ షా పప్పు దినుసుల్లో స్వావలంబన అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తారు. కంది పండిస్తున్న రైతులకు స్వావలంబన కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతు-కేంద్రీకృత కార్యక్రమం ద్వారా నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ ద్వారా సేకరణ ప్రక్రియ ను క్రమబద్ధీకరించి, ప్రత్యక్ష బ్యాంకు బదిలీల ద్వారా కందిపప్పు ఉత్పత్తిదారులకు మెరుగైన ధర చెల్లించి సాధికారత కల్పించి దేశీయ పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడం, దిగుమతులు తగ్గించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది.
నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ ద్వారా జరుగుతున్న సేకరణ కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించి, ప్రత్యక్ష బ్యాంకు బదిలీల ద్వారా కందిపప్పు ఉత్పత్తిదారులకు మెరుగైన ధర చెల్లించి రైతుకు సాధికారత కల్పించడం కోసం కార్యక్రమం ద్వారా కృషి జరుగుతుంది. దీనివల్ల దేశంలో దేశీయ పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. పప్పు ధాన్యాల దిగుమతి తగ్గుతుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ పోర్టల్ లో నమోదైన రైతుల నుంచి పప్పుధాన్యాల బఫర్ స్టాక్ కోసం పప్పు ధాన్యాలు కొనుగోలుచేస్తారు. కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరలో ఏది ఎక్కువైతే అది రైతులకు చెల్లిస్తారు.
పోర్టల్ లో రిజిస్ట్రేషన్, కొనుగోలు, చెల్లింపు ప్రక్రియ ఏకగవాక్ష విధానంలో జరుగుతుంది. పోర్టల్ లో రైతులు నేరుగా నేరుగా లేదా పీఏసీఎస్, ఎఫ్ పీవో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నాఫెడ్ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో చెల్లింపులు జరుగుతాయి. రైతు సంక్షేమం లక్ష్యంగా మొత్తం ప్రక్రియ అమలు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నుంచి చెల్లింపు వరకు కార్యకలాపాలను రైతులు సులువుగా తెలుసుకోవచ్చు.
ఈ కార్యక్రమం "ఆత్మనిర్భర్ భారత్" సాధనకు తోడ్పడుతుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో కంది పండిస్తున్న రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. రిజిస్ట్రేషన్, సేకరణ, చెల్లింపు ప్రక్రియలను సులభతరం చేస్తుంది. 80 శాతం బఫర్ స్టాక్ ను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఆహారోత్పత్తికి భద్రత లభిస్తుంది. భవిష్యత్తులో దేశ ఆహార భద్రతకు భరోసా లభిస్తుంది. బహుభాషా ఎలక్ట్రానిక్ పోర్టల్ https://esamridhi.in రైతులు, నాఫెడ్, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సహకారం పెంపొందించి ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తుంది.
గోధుమలు, వరి వంటి సాంప్రదాయ పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ నూతన హరిత విప్లవ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కృషిలో భాగంగా కందిపప్పు సేకరణ పోర్టల్ అందుబాటులోకి రానున్నది. దేశ వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలిగించి ఆహార రంగంలో స్వావలంబన సాధించి, లక్షలాది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
***
(Release ID: 1993080)
Visitor Counter : 146