పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ బిడ్ రౌండ్-9 ప్రారంభం


స్పెషల్ సి బి ఎం బిడ్ రౌండ్-2022 కింద 3 కోల్ బెడ్ మిథేన్ బ్లాకులకు సంబంధించి ఒప్పందాలు

ఒ ఎ ఎల్ పి బిడ్ రౌండ్-8 కింద మంజూరైన 10 బ్లాకులకు కూడా ఒప్పందాలు

Posted On: 03 JAN 2024 6:06PM by PIB Hyderabad

ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఒ ఎ ఎల్ పి) బిడ్ రౌండ్-8 కింద మంజూరైన 10 బ్లాకులు, స్పెషల్ సీబీఎం బిడ్ రౌండ్- ఎస్ సి బి ఎం 2022 కింద మంజూరైన 3 కోల్ బెడ్ మిథేన్ (సీబీఎం) బ్లాకులకు సంబంధించి పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ (ఎంఒపిఎన్జి) ఒప్పందాలు  కుదుర్చుకుంది.  పెట్రోలియం, సహజవాయువు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ కార్యక్రమంలో పెట్రోలియం, సహజవాయువు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పల్లవి జైన్ గోవిల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఒ ఎ ఎల్ పి -9 బిడ్ రౌండ్ ను కూడా ప్రారంభించారు. ఈ బిడ్ రౌండ్ లో సుమారు 1,36,596 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన 28 బ్లాకులు బిడ్డింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.

సందర్భంగా శ్రీ పురి మాట్లాడుతూ, రోజు ఒ ఎ ఎల్ పి-8, ఎస్ సి బి ఎం -2022పై సంతకాలు చేయడం, ఒ ఎ ఎల్ పి -9 బిడ్ రౌండ్ ప్రారంభోత్సవం భారతదేశ ఇంధన భద్రతను నిర్ధారించడంలో కీలకమైన దశ అని అన్నారు. గతంలో 'నో-గో' ప్రాంతాలుగా పిలువబడే అండ్ పి కార్యకలాపాల కోసం ఇటీవలి కాలంలో ఒక మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా విస్తారమైన ఆఫ్ షోర్ విస్తీర్ణం అందుబాటులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ సెడిమెంటరీ బేసిన్ ఏరియాలో కేవలం 10% మాత్రమే చురుకైన అన్వేషణలో ఉందని, అయితే, ప్రభుత్వ చొరవతో మరిన్ని ప్రాంతాలు అన్వేషణలోకి వస్తాయని, రాబోయే ఒ ఎ ఎల్ పి -9, ఎక్స్ బిడ్ రౌండ్ల కింద బ్లాకుల కేటాయింపు తర్వాత 2024 సంవత్సరం చివరి నాటికి సుమారు 5,60,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం (16%) అన్వేషణలోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఒఎఎల్పి కింద బ్లాకులను మంజూరు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓఏఎల్ పీ-9 బిడ్ రౌండ్ ను ప్రారంభించడం ప్రాముఖ్యతను ఎంఓపీఎన్జీ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ వివరించారు. తొమ్మిదవ రౌండ్ బిడ్డింగ్ పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా డీజీ డి జి హెచ్ డాక్టర్ పల్లవి జైన్ గోవిల్ మాట్లాడుతూ,  ఓఏఎల్పీ-9 బిడ్ రౌండ్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఎందుకంటే ఆఫర్ లో ఉన్న ఆఫ్ షోర్ బ్లాక్ లలో చాలా హైడ్రోకార్బన్ రిచ్ బేసిన్ ప్రాంతాల్లో ఉన్నాయని, గతంలో వివిధ ఏజెన్సీల ఆంక్షల కారణంగా ఇ అండ్ పి bకార్యకలాపాలకు దూరంగా ఉన్నాయని తెలిపారు.

ఓఏఎల్పీ 8 బిడ్ రౌండ్ కింద 9 సెడిమెంటరీ బేసిన్ లలో విస్తరించి ఉన్న 34,364 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం 10 బ్లాకులను వేలం వేయడానికి ప్రతిపాదించారు, ఇందులో 2 ఆన్ లాండ్ బ్లాక్ లు (రెండూ కేటగిరీ-1 బేసిన్లో ), 4 లోతైన నీటి బ్లాక్ లు (కేటగిరీ-1లో 1 ,  కేటగిరీ 2/3 బేసిన్లలో 3), 2 డీప్ వాటర్ బ్లాక్స్ (కేటగిరీ 2/3 బేసిన్లలో), 2 అల్ట్రా డీప్ వాటర్ బ్లాక్లు (కేటగిరీ-1లో) ఉన్నాయి. మొత్తం 10 బ్లాకులకు 13 బిడ్లు వచ్చాయి. ఈ 10 బ్లాకులను 4 కంపెనీలకు అప్పగించారు. నిబద్ధతతో కూడిన అన్వేషణ పని కార్యక్రమం కోసం కేటాయించిన బ్లాకుల్లో పెట్టుబడులు సుమారు 233 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

స్పెషల్ సిబిఎం రౌండ్-2022 కింద, 5817 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 రాష్ట్రాల్లో విస్తరించిన మొత్తం 16 సిబిఎం బ్లాకులను బిడ్డింగ్ కోసం ఆఫర్ చేశారు. 717 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన 3 బ్లాకులకు మొత్తం 6 బిడ్లు వచ్చాయి. ఈ 3 బ్లాకులను 2 కంపెనీలకు అప్పగించారు. నిబద్ధతతో కూడిన అన్వేషణ పని కార్యక్రమం కోసం కేటాయించిన బ్లాకుల్లో పెట్టుబడులు 7.4 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

ఇ అండ్ పి రంగంలో ఒక ప్రధాన సంస్కరణగా, హైడ్రోకార్బన్ ఎక్స్ ప్లోరేషన్అండ్  లైసెన్సింగ్ పాలసీ (హెల్ప్) మార్చి 2016 లో ఆమోదించబడింది. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి,  ఇ అండ్ పి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తన సంకల్పానికి కొనసాగింపుగా, ప్రభుత్వం ఫిబ్రవరి 2019 లో,  మళ్లీ మే 2023 లో 'ఆదాయం' నుండి 'ఉత్పత్తి' గరిష్టీకరణకు మారడంపై దృష్టి సారించి అప్ స్ట్రీమ్ రంగంలో మరిన్ని విధాన సంస్కరణలను నోటిఫై చేసింది. మరింత పారదర్శకత, క్రమబద్ధీకరించిన విధానాలపై నిరంతరం దృష్టి సారించారు.

మొదటి ఏడు ఒ ఎ ఎల్ పి బిడ్ రౌండ్లలో 2,07,691 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 134 బ్లాకులను ప్రముఖ ఇ అండ్ పి  కంపెనీలకు అప్పగించారు. ఇప్పుడు ఎనిమిదో రౌండ్ కింద మరో 10 బ్లాకులను కేటాయించడంతో 2,42,055 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హెల్ప్ విధానంలో మొత్తం 144 ఎక్స్ ప్లోరేటివ్ బ్లాక్ లు మంజూరయ్యాయి.

ఆన్ షోర్ ప్రాంతాల్లో నేషనల్ సీస్మిక్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్ పి ), ఆఫ్ షోర్ ప్రాంతాల్లో ఇఇజెడ్ సర్వే, అండమాన్ బేసిన్ తెరవడం, ఎన్డిఆర్ అప్ గ్రేడేషన్ వంటి  భారతీయ సెడిమెంటరీ బేసిన్ ల మంచి నాణ్యమైన డేటాను పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మిషన్ అన్వేషన్ ప్రాజెక్ట్ (ఎన్ ఎస్ పి l రెండవ భాగం), కాంటినెంటల్ షెల్ఫ్ సర్వే, స్ట్రాటిగ్రాఫిక్ బావుల డ్రిల్లింగ్ , హైడ్రోకార్బన్ రిసోర్స్ రీవాల్యుయేషన్ స్టడీ వంటివి ప్రణాళిక లోని ఇతర కార్యక్రమాలు. విదేశీ కంపెనీల డేటా వీక్షణ సౌలభ్యం కోసం హ్యూస్టన్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో డేటా సెంటర్ ను ప్రారంభించారు.

అనేక అంతర్జాతీయ చమురు కంపెనీలు (ఐఒసిలు) (ఎక్సాన్ మొబిల్, షెల్, టోటల్ ఎనర్జీస్, ఇఎన్ఐ, చెవ్రాన్, పోస్కో, జాపెక్స్, మర్ఫీ ఆయిల్, ఇఒజి మొదలైనవి) ఈ డేటా రూమ్ / ప్రజెంటేషన్లను సందర్శించాయి.  భారతీయ బేసిన్లపై ఆసక్తిని కనబరిచాయి.

ప్రముఖ అంతర్జాతీయ ప్రదేశాల్లో ఇన్వెస్టర్స్ మీట్, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం ద్వారా ఇన్వెస్టర్ల ఔట్ రీచ్ కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేపట్టారు. అనేక ఐ ఒ సి లు ఎన్ డి ఆర్ ను సందర్శించాయి. విశ్లేషణ కోసం  పెద్ద మొత్తంలో ఇ అండ్ పి  డేటాను కొనుగోలు చేశాయి.

ఇండియన్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ (ఇ అండ్ పి) రంగంలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 'ను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది. అన్ని అనుమతులు, క్లియరెన్స్ ల వేగవంతమైన ఆమోదం  ఆన్ లైన్ వ్యవస్థల ద్వారా ఉంటాయి.

వివిధ ఒప్పంద విషయాలను పరిష్కరించడానికి వివాద పరిష్కార యంత్రాంగాన్ని ప్రముఖ విదేశీ నిపుణుల కమిటీ ద్వారా ఏర్పాటు చేశారు, ఇది అనేక పాత వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించింది.

ఓఏఎల్పీ-8, సీబీఎంఎస్-2022 కింద మంజూరైన బ్లాకుల వివరాలు డీజీహెచ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి: [dghindia.gov.in]

ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్పీ) బిడ్ రౌండ్-9 ప్రారంభం

ఇ అండ్ పి కార్యకలాపాలను దూకుడుగా వేగవంతం చేయడానికి,  నిర్దేశిత కాలపరిమితికి కట్టుబడి ఉండటానికి కొనసాగింపుగా, ప్రభుత్వం ఇప్పుడు 3 జనవరి 2024 న అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ కోసం ఓఎఎల్పి బిడ్ రౌండ్-9 ను ప్రారంభించింది.

ఈ బిడ్ రౌండ్ లో సుమారు 1,36,596 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన 28 బ్లాకులు బిడ్డింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు కంపెనీల నుంచి వచ్చిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ఆధారంగా 23 బ్లాకులను, డీజీహెచ్ ద్వారా 5 బ్లాకులను విభజించారు.ప్రస్తుత బిడ్ రౌండ్ కింద 28 బ్లాకులు 8 సెడిమెంటరీ బేసిన్లలో విస్తరించి ఉన్నాయి. వీటిలో 9 ఆన్ ల్యాండ్ బ్లాక్ లు, 8 నిస్సార నీటి బ్లాక్ లు , 11 అల్ట్రా-డీప్-వాటర్ బ్లాక్ లు ఉన్నాయి.

నోటీస్ ఇన్విటేషన్ ఆఫర్ (ఎన్ఐఒ) విడుదలతో బిడ్డర్లు నేషనల్ డేటా రిపోజిటరీ (ఎన్ డి ఆర్)లో ఉన్న డేటాను అధ్యయనం చేసి బిడ్డింగ్ కోసం బ్లాకులను ఎంచుకోవచ్చు. బిడ్డర్లు 2024 జనవరి 3 మధ్యాహ్నం 12:00 గంటల నుండి ఆన్లైన్ ఇ-బిడ్డింగ్ పోర్టల్ ద్వారా తమ బిడ్ లను సమర్పించవచ్చు.  29 ఫిబ్రవరి 2024న 12:”00 గంటల వరకు బిడ్లను సమర్పించవచ్చు.

ఓఏఎల్పీ-9 కింద ఆఫర్లో ఉన్న బ్లాక్ ల వివరాలు డి జి హెచ్ వెబ్ సైట్ అందుబాటులో ఉన్నాయి: [dghindia.gov.in]

***(Release ID: 1993072) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Hindi