మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సెలైన్ వాటర్ ష్రిమ్ప్ ఆక్వాకల్చర్‌పై ఫిషరీస్ శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి అధ్యక్షతన సమీక్షా సమావేశం
Posted On:
03 JAN 2024 8:05PM by PIB Hyderabad
ఫిషరీస్ శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సెలైన్ వాటర్ ష్రిమ్ప్ ఆక్వాకల్చర్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సెలైన్ వాటర్ ష్రిమ్ప్ ఆక్వాకల్చర్‌పై ఫిషరీస్ శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆక్వాకల్చర్ కోసం ఉప్పు భూమి వనరులను ఉపయోగించుకోవడానికి అవసరమైన చర్యలను రూపొందించడానికి రాష్ట్రాలు,ఐకార్ మరియు ఇతర ఏజెన్సీల సహకార ప్రయత్నాలను డిఓఎఫ్ వివరించింది. ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి రొయ్యల ఆక్వాకల్చర్‌ను అనుసరించడం అలాగే రొయ్యల వినియోగంపై అవగాహన కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకించి గుర్తించబడిన 25 జిల్లాల్లో వ్యవసాయానికి అనువుగా లేని ఉప్పునీటి వనరుల సంభావ్యతను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని హైలైట్ చేయబడింది. పిఎంఎంఎస్‌వై కింద అవసరమైన మద్దతు అందించేందుకు వచ్చే ఏడాది వార్షిక కార్యాచరణ ప్రణాళికలో తమ సెలైన్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు తగిన విధంగా చేర్చబడ్డాయని నాలుగు రాష్ట్రాలు నిర్ధారించాయి.
ఈ రాష్ట్రాల్లో సెలైన్ ల్యాండ్ ఆక్వాకల్చర్‌కు అనేక సవాళ్లు ఉన్నాయని సమావేశంలో అంగీకరించారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి, ఐకార్, రాష్ట్ర మత్స్య శాఖలు మరియు ఇతర ఏజెన్సీల సహాయంతో దేశంలోని ఉత్తర ప్రాంతంలో రొయ్యల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, గుర్తించిన 25లో సంభావ్య క్లస్టర్ మరియు కల్చర్ ఏరియాపై సర్వే చేపట్టేందుకు అవగాహన ప్రచారాన్ని నిర్వహించవచ్చని భావించబడింది. ఐకార్-సిఐఎఫ్‌ఈ రోహ్‌తక్ కేంద్రం మరియు రాష్ట్రాల మత్స్య శాఖల మధ్య సన్నిహిత సహకారంతో, రైతులు మరియు పారిశ్రామికవేత్తల కోసం రాజస్థాన్‌లోని ఐకార్-సిఐఎఫ్‌ఈ రోహ్‌తక్ సెంటర్ మరియు చంద్‌ఘోటి కెవికెలో వర్క్‌షాప్‌లు మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించవచ్చు. మంచినీరు/లోతట్టు పొలాలలో తెల్ల రొయ్యల పెంపకం కోసం ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను సమీక్షించడానికి, ఐకార్-సిఐఎఫ్‌ఈ, రోహ్‌తక్‌లో ఉన్న సౌకర్యాలను బలోపేతం చేయడానికి అలాగే ఉత్తర భారత రాష్ట్రాల్లో సెలైన్ ఆక్వాకల్చర్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికి మరియు స్థిరమైన వ్యూహాలను సిద్ధం చేయడానికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేయవచ్చని కూడా భావించబడింది.
ప్రపంచంలో రొయ్యల ఉత్పత్తిలో భారతదేశం మొదటిస్థానంలో ఉంది. విలువ పరంగా భారతదేశ మొత్తం మత్స్య ఎగుమతిలో రొయ్యలు 65% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. ఉప్పునీటి ఆక్వాకల్చర్ మరియు సెలైన్ ప్రభావిత ప్రాంతాల్లో రొయ్యల ఆక్వాకల్చర్‌కు భారతదేశం విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలో సుమారు 1.2 మిలియన్ హెక్టార్ల ఉప్పునీటి ప్రాంతాలు ఉన్నాయి. వీటికి అదనంగా 1.24 మిలియన్ హెక్టార్ల ఉప్పు ప్రభావిత నేలలు తీర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఐసిఏఆర్-సిఐబిఏ నివేదిక ప్రకారం భారతదేశంలో దాదాపు 8.62 మిలియన్ హెక్టార్ల లోతట్టు ఉప్పు నేల అందుబాటులో ఉంది. అయితే 1.28 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మాత్రమే రొయ్యలసాగు ఉంది. అదనంగా లక్ష హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వా సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సెలైన్ ప్రభావిత ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలం కాదు. అయినప్పటికీ ఈ సెలైన్ ప్రభావిత ప్రాంతాలను ఆక్వాకల్చర్ ప్రాంతాలుగా మార్చడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు యుపి రాష్ట్రాలలో సంభావ్య లోతట్టు ఉప్పు ప్రాంతాలను పరిశీలిస్తే మత్స్య శాఖ ఈ రోజు సెక్రటరీ స్థాయిలో సమీక్షకు పిలుపునిచ్చింది. శ్రీ సాగర్ మెహ్రా, మత్స్య శాఖ జాయింట్ సెక్రటరీ పై నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు మరియు జిల్లా ఫిషరీస్ అధికారులు, డా.జె.కె. జెనా,డిడిజి (ఫిషరీస్ సైన్స్), ఐకార్, డా. రవిశంకర్, డైరెక్టర్, ఐకార్-సిఐఎఫ్‌ఈ, ముంబై, చెన్నైలోని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ కార్యదర్శి డాక్టర్ వసంత్ కృపా, డిఓఎఫ్‌కు చెందిన సీనియర్ అధికారులు మరియు ఐసిఎఆర్ నుండి శాస్త్రవేత్తలు కూడా సమావేశానికి హాజరయ్యారు.
***
(Release ID: 1992945)
Visitor Counter : 134