రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

చీఫ్‌ ఆఫ్‌ మెటీరియల్‌గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్‌ముఖ్

Posted On: 01 JAN 2024 1:32PM by PIB Hyderabad

ఏవీఎస్‌ఎం, వీఎస్ఎం, వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్‌ముఖ్ 01 జనవరి 2024న చీఫ్‌ ఆఫ్‌ మెటీరియల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన, ముంబై విశ్వవిద్యాలయంలోని వీజేటీఐ పూర్వ విద్యార్థి. 31 మార్చి 1986న భారత నౌకాదళంలో ఇంజినీర్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. వైస్ అడ్మిరల్ దేశ్‌ముఖ్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఉద్యోగులు, సిబ్బంది, సామగ్రి విభాగాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. రాజ్‌పుత్ తరగతి, దిల్లీ తరగతి, తేగ్ తరగతి నౌకల్లోనూ వివిధ హోదాల్లో సేవలు అందించారు.

ఫ్లాగ్ ఆఫీసర్‌గా, నౌకాదళ ప్రధాన కార్యాలయంలో మెటీరియల్ (డాక్‌యార్డ్స్ & రీఫిట్స్) ఉపాధిపతిగా పని చేశారు. చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (టెక్)/హెచ్‌క్యూఈఎన్‌సీ, విశాఖపట్నం నౌకాదళ డాక్‌యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్‌గా, విశాఖపట్నంలో నావల్ ప్రాజెక్టుల డైరెక్టర్ జనరల్‌గా, నౌకాదళ ప్రధాన కార్యాలయంలో యుద్ధ నౌకల తయారీ & సేకరణల నియంత్రణాధికారిగానూ పని చేశారు. ఆయన సీడబ్ల్యూపీ&ఏగా ఉన్న సమయంలో, మొదటి స్వదేశీ విమాన వాహక నౌక (ఐఏసీ-I), స్వదేశీ విమాన వాహక నౌకలో మొదటి ఎల్‌సీఐ సేవలు అందించింది. ఆయన పని చేస్తున్న సమయంలో చాలా యుద్ధ నౌకలు ప్రారంభమయ్యాయి. వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్‌ముఖ్ విశిష్ట సేవకు గుర్తింపుగా, అడ్మిరల్‌కు విశిష్ట సేవ పతకం, అతి విశిష్ట సేవ పతకం లభించాయి.

***


(Release ID: 1992260) Visitor Counter : 174