హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీ స్వామినారాయణ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిస్థానం (ఎస్జీవీపీ) ఈరోజు నిర్వహించిన పూజ్య పురాణీ స్వామి స్మృతి మహోత్సవ్‌లో కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.



ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అన్నరంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.


ఆధ్యాత్మికత నుండి ఆయుర్వేదం వరకు, సాంఘిక శాస్త్రం నుండి సౌరశక్తి వరకు, గణితం నుండి మెటావర్స్ వరకు మరియు సున్నా నుండి అంతరిక్షం వరకు భారతదేశం నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది.

వ్యక్తిత్వ వికాస సంప్రదాయాన్ని అలవర్చుకోవడం ద్వారా శ్రీ స్వామినారాయణ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిస్థానం (ఎస్జీవీపీ) పిల్లలను దేశభక్తులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది.

శ్రీ స్వామినారాయణ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిస్థానం (ఎస్జీవీపీ) గురుకులం దేశభక్తి, ఆధ్యాత్మికత మరియు ఆధునిక విద్యల కలయిక.

ఈ గురుకులంలో విలువలు, నైతికత, నిజాయతీ, ప్రామాణికత మరియు వేదాలు, సంస్కృతం, సైన్స్ మరియు క్రీడల పరిజ్ఞానంతో పాటు తత్వశాస్త్ర సాధన కోసం అవకాశం ఉంది.

అయోధ్యలో రామ్‌లాలా ప్రతిష్ఠాపన మరియు భారతదేశం యొక్క అమృత్‌కాల్ ప్రారంభంతో ఇది భారతదేశం యొక్క స్వర్ణకాలం. రాబోయే 25 సంవత్సరాలలో మనదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుంది.

2014కి ముందు ఏ భారతదేశమైతే నిరాశలో మునిగిపోయిందో, అదే భారతదేశం నేడు ప్రపంచంలోనే మొదటి స్థానంల

Posted On: 30 DEC 2023 5:11PM by PIB Hyderabad

ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీ స్వామినారాయణ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిస్థానం (ఎస్జీవీపీ) నిర్వహించిన పూజ్య పురాణీ స్వామి స్మృతి మహోత్సవ్‌లో కేంద్ర హోం  మరియు సహకార మంత్రి అమిత్ షా ప్రసంగించారు.

ఈ సందర్భంగా  అమిత్ షా మాట్లాడుతూ..  శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలందరూ తమ పార్టీ సిద్ధాంతాలను, పని సంస్కృతిని ప్రతిబింబించేలా ఏడాదికి మూడు రోజులు వెచ్చించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఎన్నో మంచి పోకడలకు ఈ గురుకులం దోహదపడిందన్నారు. వ్యక్తిత్వవికాసం జరగకపోతే దేశాన్ని నిర్మించలేమని..  గురుకుల సంప్రదాయంలో వ్యక్తిత్వ వికాసం ఇమిడిపోయిందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

ఇక్కడికి వచ్చిన బిడ్డ దేశభక్తుడిగా, సామాజిక విలువలు నేర్చుకున్న పౌరుడిగా తిరిగి సమాజంలోకి అడుగుపెడతారని అమిత్ షా పేర్కొన్నారు. ఇక్కడి పిల్లల్లో భారతీయ, సనాతన సంస్కృతి మాత్రమే కాకుండా స్వామినారాయణ, భక్తి శాఖల విలువలన్నీ పెంపొందించబడ్డాయని, రాజ్‌కోట్ గురుకులం నుంచి బయటకు వచ్చే చిన్నారి కూడా దేశభక్తుడిగా బయటపడుతుందని  షా అన్నారు. ఈ గురుకులం గుజరాత్‌కే కాకుండా యావత్ దేశానికి ఎంతో మంది మంచి మరియు విజయవంతమైన పౌరులను అందించిందని ప్రశంసించారు. వ్యసనా రహిత జీవితం, హరి ఆరాధన, సత్ప్రవర్తన, జీవితంలో సోమరితనాన్ని అనుమతించకపోవడం, గో సేవ నుంచి వ్యవసాయం వరకు భూమితో ముడిపడి ఉండడం వంటి విలువలతో పాటు సంస్కృతం, శాస్త్రాలు, సంగీతం, క్రీడలతో సహా సంపూర్ణ విద్యను అందించే వాతావరణం నెలకొందన్నారు.

బ్రిటీష్ హయాంలో స్వామినారాయణ సంప్రదాయం భక్తితో సనాతనాన్ని అనుసంధానం చేయడం, వ్యసనాలను దూరం చేయడం, విద్యను అందించడం, కుటుంబాన్ని సమిష్టిగా ఉంచడం వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లో స్వామినారాయణ శాఖకు చెందిన వివిధ సంస్థల గురుకులాలు పని చేయకుంటే రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ అసంపూర్తిగా మిగిలిపోయేదని అన్నారు. దుర్గమమైన గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడిని నిరోధించేందుకు స్వామినారాయణ వర్గం గురుకులాలను ప్రారంభించి, వాటి ద్వారా గిరిజన పిల్లలకు సనాతన ధర్మంతో అనుసంధానం చేసి, విద్యను అందించి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా ధైర్యాన్ని అందించిందని అమిత్ షా తెలిపారు. దేశభక్తి, ఆధ్యాత్మికత, ఆధునిక విద్యల సమాహారమే శ్రీ స్వామినారాయణ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిస్థానం (ఎస్జీవీపీ)పీ గురుకులమని అన్నారు. ఈ గురుకులంలో, విలువలు, నైతికత, నిజాయతీ, ప్రామాణికత మరియు వేదాలు, సంస్కృతం, సైన్స్ మరియు క్రీడల పరిజ్ఞానంతో పాటు తత్వశాస్త్ర సాధన కోసం ఇక్కడ వెసులుబాటు ఉందన్నారు.

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అన్నిరంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

2004 నుంచి 2014 వరకు భారతదేశం నిరాశలో మునిగిపోయి నిస్సహాయంగా చూస్తోందని, అయితే ప్రధాని మోదీ నాయకత్వంలో 2014 నుంచి 2024 వరకు పదేళ్లలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. ప్రధాని మోదీ ఈ దేశ ఆత్మను మేల్కొలిపారు. నేడు ప్రపంచం మొత్తం మన దేశంలోని అనేక వారసత్వ సంపదల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని అన్నారు. ఈ రోజు మనం మన వైద్య శాస్త్రాన్ని 18 భాషల్లో బోధిస్తామని చెబుతున్నప్పుడు, ఇది ఎలా జరుగుతుందో ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని కోరుకుంటోందని అమిత్ షా తెలిపారు. మన దేశం, భాష భావ వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే.  ప్రాథమిక అంశం మేధో శక్తి. ఆధ్యాత్మికత నుంచి ఆయుర్వేదం వరకు, సాంఘిక శాస్త్రం నుంచి సౌరశక్తి వరకు, గణితం నుంచి మెటావర్స్ వరకు, జీరో నుంచి అంతరిక్షం వరకు భారతదేశం నేడు ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయని, 2047లో స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే తరుణంలో ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు.

గత 550 ఏళ్లుగా శ్రీరాముడి పవిత్ర జన్మస్థలంలో మళ్లీ రామమందిరాన్ని పునర్నిర్మించలేకపోయామని, అయితే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 22న రామ్‌లాలాకు ప్రతిష్ఠాపన చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. తన ఇంట్లో రామ్‌లాలాకు ప్రతిష్ఠాపన చేయడం, భారతదేశ అమృత్‌కాల్‌కు నాంది పలకడం ఇది భారతదేశానికి స్వర్ణకాలమని అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లలో మన దేశం మొదటి స్థానంలో ఉండబోతోందని ప్రకృతి ప్రసాదించిన సంకేతమని అన్నారు. నేడు మన యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందుతున్నాయని, మన వేదాలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రంలోని శాస్త్రీయ దృక్పథాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ జనవరి 22న అయోధ్యను సందర్శించి, సాధువుల సమక్షంలో రామ్‌లాలాకు పట్టాభిషేకం చేస్తారని, ఇది యావత్ దేశానికి శుభసూచకమని షా అన్నారు. అయోధ్య, కాశీ విశ్వనాథ్ కారిడార్ పునర్నిర్మాణం మాత్రమే కాదు, ఉజ్జయినిలో మహాకాల్ లోక్, బద్రీనాథ్ ధామ్, కేదార్‌నాథ్ ధామ్‌లను పునర్నిర్మించామని, గుజరాత్‌లో ఇన్నేళ్ల తర్వాత సోమనాథ్ ఆలయాన్ని మరోసారి బంగారు పూతతో అలంకరించామన్నారు. పావాగఢ్ లో మళ్లీ శక్తిపీఠాన్ని నిర్మిస్తామని,  ఈ ప్రారంభం శుభసూచకమన్నారు.

2014లో భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, నేడు 5వ స్థానానికి చేరుకుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో 2027 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని శ్రీ అమిత్ షా ఆశాభావం వ్యక్తంచేశారు. మన ప్రాచీన విద్యా సంప్రదాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని నూతన విద్యా విధానం రూపొందించబడిందని,  ఇది ఆధునికతతో పాటు అసలైన భారతీయ విద్యా వ్యవస్థను కలిగి ఉందన్నారు.   నూతన విద్యా విధానంలో చదువుకున్న పిల్లలు “బాబులు” కాలేరని, వారు భారతీయులుగా మారి గొప్ప భారతదేశాన్ని సృష్టించే కలను సాకారం చేస్తారని శ్రీ షా అన్నారు. ఈ రోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీదారుగా మారుతున్నామని, స్టార్టప్‌ల పరంగా ప్రపంచంలో మూడవ స్థానానికి, పునరుత్పాదక ఇంధనంలో మూడవ స్థానానికి చేరుకుంటున్నామని, ఈ రోజు భారతదేశ భద్రతపై ఎవరూ ఎటువంటి సందేహం లేవనెత్తరని ఆయన అన్నారు.

వేర్పాటువాదం, తీవ్రవాదానికి మూలకారణమైన ఆర్టికల్ 370 అనే కలంకాన్ని ఏళ్ల తరబడి మోస్తున్నామని కేంద్ర హోంమంత్రి అన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దు చేశారని.. భారత సైన్యం, సరిహద్దుల్లో ఎవరూ ఫిరాయించలేరన్న సర్జికల్‌ స్ట్రైక్స్‌, వైమానిక దాడుల ద్వారా భారత్‌ బలమైన సందేశాన్ని పంపిందని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు.  ఈ సంప్రదాయాన్ని శ్రీ నరేంద్ర మోదీ జీ ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం తీవ్రవాదానికి వ్యతిరేకంగా సహనం లేని విధానాన్ని అవలంబించిందని, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా శూన్యతను పూరించడానికి కృషి చేసిందని, ఈశాన్య ప్రాంతంలో దాదాపు 9000 మంది రెబల్ క్యాడర్లు లొంగిపోయిన తర్వాత, నేడు అదే యువత ఈశాన్య భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటున్నారని శ్రీ షా అన్నారు. ప్రధాని మోదీ జీ నాయకత్వంలో శాంతి, భద్రత, పొరుగు దేశాలతో సత్సంబంధాలే తమ అతి పెద్ద ప్రాధాన్యతలని, అయితే దీని అర్థం మన సరిహద్దుల భద్రతతో రాజీ పడతామని కాదని శ్రీ షా అన్నారు. మన పొరుగు దేశాలతో మనకు ఖచ్చితంగా సత్సంబంధాలు అవసరమని, అయితే మన సరిహద్దుల్లోకి ఎవరూ చొరబడకూడదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గత 10 ఏళ్లలో ఈ సమతుల్య భద్రతా విధానాన్ని రూపొందించామన్నారు.

***



(Release ID: 1992052) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Gujarati