సహకార మంత్రిత్వ శాఖ

గుజరాత్ లోని గాంధీనగర్ లో నేషనల్ కోఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ సిడిఎఫ్ఐ) లిమిటెడ్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసి, ఇ-మార్కెట్ అవార్డ్స్ - 2023 వేడుకలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, గత 8 సంవత్సరాలలో భారత దేశంలో పాల ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యంత వేగంగా సుమారు 51% పెరిగింది.

నేడు, దేశంలో పాల ఉత్పత్తిలో ఎక్కువ భాగం సహకార డెయిరీల ద్వారా జరుగుతోంది, అందుకే నేడు భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో 24% వాటాతో మొదటి స్థానానికి చేరుకుంది

సహకార రంగం ద్వారా పాల వ్యాపారం చేస్తే సమాజానికి, వ్యవసాయానికి, గ్రామాలకు, పాల ఉత్పత్తిదారులకు, అంతిమంగా దేశానికి బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి.

సహకార రంగం పాడి వ్యాపారం చేసినప్పుడు, మొదట ప్రయోజనం పొందేది పాల ఉత్పత్తిదారులు, ఎందుకంటే వారు దోపిడీకి గురికారు.

అనేక డెయిరీలు గర్భిణులు, వారి పిల్లలకు లడ్డూలు ఇవ్వడం ద్వారా పౌష్టికాహారం పట్ల శ్రద్ధ చూపుతున్నాయి, మొత్తం సహకార రంగం పౌష్టికాహార లోపంపై పోరాటంలో భాగస్వామ్యం అయింది.

శ్రీ నరేంద్ర మోదీ దేశంలో అనేక రకాల విప్లవాలకు నాంది పలికారు, ఇందులో డిజిటల్ విప్లవం కూడా ఉంది.

ప్రపంచంలోనే డిజిటల్ లావాదేవీల రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి, వచ్చే 4-5 ఏళ్లలో అగ్రస్థానానికి చేరుకుంటాం

సహకార సంస్థను ప్రోత్సహించడం

Posted On: 30 DEC 2023 10:09PM by PIB Hyderabad

గుజరాత్ లోని గాంధీనగర్ లో నేషనల్ కోఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ సిడిఎఫ్ ఐ) లిమిటెడ్ ప్రధాన కార్యాలయానికి కేంద్ర హోం,  సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇ-మార్కెట్ అవార్డ్స్ -  2023 కార్యక్రమంలో ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ శాసనసభ స్పీకర్ శ్రీ శంకర్ చౌదరి, ఇఫ్కో చైర్మన్ శ్రీ దిలీప్ సంఘాని, ఎన్ డిడిబి చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, ఎన్ సిడిఎఫ్ఐ చైర్మన్ డాక్టర్ మంగళ్ రాయ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, మన దేశంలో పాడి పరిశ్రమ ముఖ్యంగా సహకార పాడి పరిశ్రమ బహుముఖ లక్ష్యాలను సాధించిందని అన్నారు. సహకార రంగంలో పాల వ్యాపారం జరగకపోతే పాల ఉత్పత్తి మధ్యవర్తికి, పాల వినియోగదారుడికే పరిమితమవుతుందని అన్నారు. ‘కానీ సహకార రంగం సహకార పద్ధతిలో పాల వ్యాపారం చేస్తే, దానిలో అనేక కోణాలు మిళితమవుతాయి, ఎందుకంటే లక్ష్యం కేవలం లాభాన్ని ఆర్జించడం కాదు ఇది సమాజానికి, వ్యవసాయానికి, గ్రామాలకు, పాల ఉత్పత్తిదారులకు , అంతిమంగా దేశానికి బహుముఖ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గడచిన 50 ఏళ్లలో భారత్ ఈ విజయగాథను చవిచూసింది‘ అన్నారు.

ఈ రోజు భారతదేశం 24% వాటాతో ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానానికి చేరుకుందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశంలో పాల ఉత్పత్తి గత 8 సంవత్సరాలలో సుమారు 51% పెరిగిందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని,  ఇది అత్యంత వేగవంతమైన పెరుగుదల అని సహకార శాఖ మంత్రి అన్నారు. సహకార డెయిరీల ద్వారా ఈ ఉత్పత్తి ఎక్కువగా జరగడం వల్లనే ఇది సాధ్యమైందని శ్రీ షా అన్నారు. సహకార డెయిరీని నడపాలంటే దానిని ప్రోత్సహించడానికి అనేక సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఎన్ సి డీఎఫ్ఐ ఈ పని చేస్తుందన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అన్ని డెయిరీలకు మార్గనిర్దేశం చేసే పనిని ఎన్ సి డీఎఫ్ఐ చేస్తోంది. శ్వేత విప్లవం 'వాసి' గ్రామం నుంచి ప్రారంభమైందని, ఇప్పుడు అదే ఆనంద్ జిల్లాలో సుమారు 7000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎన్సిడిఎఫ్ఐ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించబోతున్నామని శ్రీ షా చెప్పారు. సుమారు రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్లాంట్ ను సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా నడపనున్నారు. నూతన ప్రధాన కార్యాలయం భవనం 100 శాతం హరిత భవనంగా ఉంటుందని చెప్పారు.

 సహకార రంగం పాడి వ్యాపారం చేసినప్పుడు ముందుగా ప్రయోజనం పొందేది పాల ఉత్పత్తిదారులేనని, ఎందుకంటే వారు దోపిడీకి గురికారని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. ఎవరైనా ఒంటరిగా పాలను ఉత్పత్తి చేస్తే, వారికి పాలను నిల్వ చేసే సామర్థ్యం ఉండదని, మార్కెట్ ను అన్వేషించలేరని ఆయన అన్నారు. కానీ సహకార రంగం పాల వ్యాపారం చేస్తే గ్రామ, జిల్లా స్థాయిలో పాల సంఘాలు ఏర్పడి కోల్డ్ స్టోరేజీ, ప్రాసెసింగ్, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పాలను ఉత్పత్తిగా మార్చే సామర్థ్యం ఉండి, ఆ తర్వాత లాభాలను సహకార ప్రాతిపదికన పాల ఉత్పత్తిలో నిమగ్నమైన సోదరీమణులతో సహకార ప్రాతిపదిక పై పంచుకోగలుగుతారని అన్నారు. ఈ విధంగా చేస్తే పాలు ఉత్పత్తి చేసే సోదరీమణులు దోపిడీ నుంచి విముక్తులు అవుతారని అన్నారు. కేవలం పాల ఉత్పత్తిలో నిమగ్నమైన వ్యక్తి మాత్రమే తన పశువుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించ లేడని, అదే సహకార పద్ధతిలో పాలను ఉత్పత్తి చేస్తే, జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం కూడా సంతానోత్పత్తి మెరుగుదల, ఆరోగ్య మెరుగుదల , జంతువుల మంచి ఆహారం కోసం ఏర్పాట్లు చేస్తుందని ఆయన అన్నారు. మూడవ ప్రయోజనం ఏమిటంటే పాల వ్యాపారం సహకార రంగం ద్వారా జరిగితే అది స్వయంచాలకంగా పోషకాహార ఉద్యమంతో ముడిపడి ఉంటుందని చెప్పారు.

పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడే బనస్కాంత డెయిరీతో పాటు ఇలాంటి అనేక డెయిరీల గురించి తనకు తెలుసని శ్రీ అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ డెయిరీ వంటి అనేక డెయిరీలు గర్భిణులు, వారి పిల్లలకు లడ్డూలు ఇచ్చి వారికి పోషకాన్ని అందిస్తున్నాయి. పౌష్టికాహార లోపంపై పోరాటంలో సహకార రంగం మొత్తం భాగస్వామ్యం అయిందన్నారు. ఒకానొక సమయంలో డెయిరీ, డెయిరీ టెక్నాలజీని ఊహించడం కూడా భారత్ కు కష్టంగా ఉండేదని, కానీ తాము భారతదేశం అంతటా సమానంగా పాల ఉత్పత్తి ప్రారంభ మయ్యేలా ప్రయత్నాలు చేశామని కేంద్ర సహకార మంత్రి అన్నారు. సహకార డెయిరీతో సంబంధం లేని అనేక రంగాలు ఉన్నాయి, అక్కడ కూడా, ఎన్ డిడిబి ద్వారా, గుజరాత్ లోని సమర్థవంతమైన డైరీలు ఉత్తర ప్రదేశ్  హర్యానా వంటి ఉత్తర భారత రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు  విస్తరిస్తున్నా యని, సహకార పద్ధతిలో వ తమ పనిని పెంచుతున్నా యని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామంలో సమన్యాయంతో పాలను ఉత్పత్తి చేయాలని, ప్రతి కుటుంబం స్వయం సమృద్ధి సాధించాలంటే సహకార డెయిరీ ద్వారానే ఈ పని సాధ్యమవుతుందన్నారు.

పాల ఉత్పత్తిలో భారతీయ డెయిరీలు ప్రపంచంలోనే దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయని శ్రీ అమిత్ షా అన్నారు. 1946లో గుజరాత్ లో డెయిరీ దోపిడీ ప్రారంభించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రిభువన్ భాయ్ ను ప్రేరేపించారని, 1946లో 15 గ్రామాల్లో చిన్న డెయిరీలను ప్రారంభించారని గుర్తు చేశారు. దోపిడీకి వ్యతిరేకంగా 1946లో ప్రారంభమైన చిన్న ఉద్యమం పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందిందని, దీని నుంచే దేశంలో శ్వేత విప్లవం, ఎన్ డిబీబీ ఆవిర్భావం మొదలైందని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా అనేక సహకార డెయిరీలు అభివృద్ధి చెందాయన్నారు. అమూల్ ప్రతిరోజూ సుమారు 40 మిలియన్ లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుందని, 36 లక్షల మంది సోదరీమణులు పాలను నిల్వ చేస్తా రని, వారు ఉత్పత్తి చేసిన పాలకు ధరను పొందుతారని చెప్పారు. 2021-22లో అమూల్ ఫెడరేషన్ టర్నోవర్ రూ.72,000 కోట్లు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ రివల్యూషన్ తో పాటు దేశంలో అనేక విప్లవాల ను తీసుకువచ్చారని శ్రీ షా అన్నారు. జి-20 కోసం ప్రపంచం నలుమూలల నుంచి దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, దేశాధినేతలు ఇక్కడికి వచ్చారని, భారత్ లాంటి దేశంలో ఆన్ లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు ఇంతగా ఎలా పెరుగుతాయని అందరూ ఆశ్చర్యపోయారని అన్నారు. ఒక చిన్న పల్లెటూరులో ఒక మహిళ తన మొబైల్ తీసి స్కాన్ చేసి పేమెంట్ చేయడం చూస్తే ఎవరికైనా సంతోషం కలుగుతుందన్నారు. ప్రపంచంలోనే డిజిటల్ లావాదేవీల రంగంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని, వచ్చే నాలుగైదేళ్లలో మనం అగ్రస్థానానికి చేరుకుంటామని చెప్పారు. దాదాపు 80 దేశాలు మన ఆన్ లైన్ చెల్లింపు వ్యవస్థ విజయం గురించి సమాచారాన్ని కోరా యని, భారతదేశం సంతోషంగా ఈ సమాచారాన్ని అందించడానికి అంగీకరించిం దని చెప్పారు.

పాడి పరిశ్రమలో ఈ-మార్కెట్ ను ప్రోత్సహించినందుకు ఈ రోజు అవార్డులు ఇచ్చినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ఎన్ సి డీఎఫ్ఐ సభ్యులు 100 శాతం వ్యాపారం వైపు వెళ్లాలని కోరారు. పంచమహల్ జిల్లా డెయిరీ, బనస్కాంత జిల్లా డెయిరీ, గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ సహకారంతో గుజరాత్ లో ఒక చిన్న ప్రయోగాన్ని ప్రారంభించామని సహకార మంత్రి తెలిపారు. ‘ప్రతి రైతుకు రూపే కార్డులు ఇస్తున్నాం. ప్రతి గ్రామ డెయిరీని 'బ్యాంక్ మిత్ర'గా మార్చి ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం. డెయిరీ,  రైతు లందరి ఖాతాలను జిల్లా సహకార బ్యాంకుకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఒక్క బనస్కాంత జిల్లాలోనే రూ.800 కోట్ల డిపాజిట్లు పెరిగాయని, 193 ఏటీఎంలు పనిచేస్తున్నాయని తెలిపారు. రూపే డెబిట్ కార్డు 96 శాతం మంది రైతులకు చేరింది. ఇప్పుడు రైతు ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారి పాలకు సంబంధించిన డబ్బును నేరుగా బనస్కాంతలోని జిల్లా సహకార బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అతడి/ఆమె వద్ద రూపే కార్డు లింక్ చేయబడింది. ఎక్కడి నుంచైనా ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే, నగదు అవసరమైతే గ్రామంలోని డెయిరీ ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. జిల్లాలోని ప్రతి డెయిరీని కేంద్రంగా చేయడం ద్వారా, ఈ నమూనాను మొత్తం గుజరాత్ లో అమలు చేయాలని, అప్పుడు రైతు ఏదైనా కొనుగోలు కోసం తన జేబు నుండి నగదు తీసుకోవలసిన అవసరం ఉండదని శ్రీ షా అన్నారు.

అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు బదులుగా దేశ అధికారిక ఆర్థిక వ్యవస్థ , ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో సహకార సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించాలని సహకార మంత్రి అన్నారు. సహకార సంఘాలను ప్రోత్సహించడంలో సహకార సంస్థ ప్రధాన పాత్ర పోషించే ఆర్థిక వ్యవస్థను మనం ఊహించామని ఆయన అన్నారు. మిల్క్ యూనియన్ అధికారులందరూ ఈ నమూనాను అధ్యయనం చేసి ప్రతి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి పంపితే సహకార రంగం బలం ఎంత పెరిగిందో తెలుసుకోవచ్చు.

ఎన్ సిడిఎఫ్ ఐ సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని శ్రీ అమిత్ షా అన్నారు. దాన్ని అమూల్ చాలా బాగా వాడుకుంది. ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో బహుళ రాష్ట్ర సహకార సంస్థను ఏర్పాటు చేశామని, ఇది సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు దానితో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. ఈ నమూనాను అవలంబిస్తూ, నేడు ఒక సేంద్రీయ సహకార సంస్థ దేశంలో సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ చాలా పెద్దది, ఖరీదైనది కాబట్టి ఎగుమతి కోసం ఒక సహకార సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచం ఖరీదైన సేంద్రియ ఉత్పత్తులను వినియోగించాలనుకుంటే వాటిని భారత్ నుంచి పంపడంలో జాప్యం చేయకూడదు.

భారతీయ విత్తనాలను సంరక్షించి ప్రోత్సహించే విత్తన సహకార సంస్థను కూడా ఏర్పాటు చేశామని సహకార మంత్రి తెలిపారు. నేడు పెద్ద పెద్ద విత్తన తయారీ కంపెనీలు బడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఎవరికైనా రెండెకరాల భూమి ఉన్నా పీఏసీఎస్ ద్వారా అక్కడికి చేరుకుని విత్తన సాగుతో రైతులను అనుసంధానం చేస్తామన్నారు. దీనివల్ల రైతుకు లాభం పెరుగుతుంది. నోడల్ ఏజెన్సీగా ఎన్సీడీఎఫ్ఐ ఈ విషయంలో వెల్లడైన మంచి నమూనాను ప్రతి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని కోరారు. ఏదైనా జిల్లా యూనియన్ దీన్ని దత్తత తీసుకోవాలనుకుంటే, దానికి మార్గనిర్దేశం చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయా లని,  ఒక జిల్లాలో సాధించిన విజయాన్ని భారతదేశంలోని ప్రతి జిల్లాలో సాధించాలని చెప్పారు.

ఇ -వేలం వేదిక, రివర్స్ వేలం, ఫార్వర్డ్ వేలం కూడా ఇవ్వబోతున్నామని, ఎన్ సిడీఎఫ్ఐ ఈ-మార్కెట్ పోర్టల్ లో లక్ష మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉందని అమిత్ షా తెలిపారు. అదేవిధంగా, నాఫెడ్ యాప్ జనవరి 4 న ప్రారంభమవుతుందదని, దీనిలో భారతదేశంలో ఒక రైతు ఎంత పప్పుధాన్యాలను ఉత్పత్తి చేసినా, నాఫెడ్ మొత్తం ఉత్పత్తిని ఎం ఎస్ పి కంటే ఒక రూపాయి ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తుం దని కేంద్ర మంత్రి చెప్పారు. నూనెగింజల రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని తాము కోరుకుంటున్నామని, అందుకే ఈ పనిని నాఫెడ్ కు అప్పగించామని ఆయన చెప్పారు. రైతు నాఫెడ్ యాప్ లో నమోదు చేసుకుని పప్పుధాన్యాలు సాగు చేస్తారని, అన్ని పప్పుధాన్యాలను ఎం ఎస్ పి కంటే  రూపాయి ఎక్కువ తో  నాఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇథనాల్ కోసం ఒక ప్రపంచ కూటమిని ఏర్పాటు చేశారని, అయితే కూటమిని ఏర్పాటు చేయడానికి ముందే, మొక్కజొన్న నుండి ఇథనాల్ తయారీకి మనం ఒక విధానాన్ని రూపొందించామని సహకార మంత్రి చెప్పారు. ఈ విధానం ప్రకారం రైతు మొక్కజొన్న విత్తితే 100 శాతం మొక్కజొన్నను నాఫెడ్ కొనుగోలు చేసి ఇథనాల్ తయారీ కంపెనీకి పంపితే రైతుకు ఎం ఎస్ పి కంటే ఎక్కువ ధర లభిస్తుం దని తెలిపారు. పంటల వైవిధ్యం, తక్కువ ఎరువుల వాడకం, పప్పుధాన్యాలు, నూనెగింజల్లో స్వావలంబన వంటి లక్ష్యాలను మనం నిర్దేశించుకున్నామని శ్రీ అమిత్ షా చెప్పారు.

***



(Release ID: 1991996) Visitor Counter : 80


Read this release in: English , Urdu , Tamil