సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కత్రా నుంచి రెండవ వందే భారత్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
జమ్మూ కాశ్మీర్ లో రూ. 41,000 కోట్ల ఖర్చుతో రైలు ప్రాజెక్టులు : డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
30 DEC 2023 4:47PM by PIB Hyderabad
కత్రా నుంచి రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్, అణు ఇందనం. అంతరిక్ష వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కత్రా రైల్వే స్టేషన్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీనితో దేశంలో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సౌకర్యం కలిగి ఉన్న ప్రధాన నగరాలలో ఒకటీగా ఒకటిగా కత్రా గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూ కాశ్మీర్‌లో 41,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో రైలు ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోని ఏ కేంద్ర పాలిత ప్రాంతం లేదా రాష్ట్రంలో ఇంత భారీ వ్యయంతో ప్రాజెక్టులు అమలులో లేవని మంత్రి వివరించారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్‌లో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని ఆయన చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీ మోదీ 2013లో పూర్తయిన కత్రా రైల్వే స్టేషన్‌ని ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. పవిత్ర నగరం కత్రా అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అన్నారు.
ఇంతవరకు సరైన రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించే అంశానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేసారన్నారు. ఈరోజు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా కత్రా ప్రజలకు ప్రధానమంత్రి నూతన సంవత్సర కానుక అందించారని డాక్టర్ సింగ్ అన్నారు. గత 50 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను శ్రీ నరేంద్ర మోదీ పరిష్కరించారని మంత్రి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ప్రధానమంత్రి చూపిస్తున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో అమలు జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు ప్రాంత అభివృద్ధికి దోధపడతాయన్నారు.
రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో జమ్మూ కాశ్మీర్ కు వస్తున్నా పర్యాటకులు, యాత్రీకుల సాక్ష్య గణనీయంగా జితేంద్ర సింగ్ తెలిపారు. రికార్డు స్థాయిలో రెండు కోట్ల మందికి పైగా పర్యాటకులు కాశ్మీర్ లోయ ను సందర్శించారని, కోటి మందికి పైగా యాత్రికులు మాతా వైష్ణో దేవిమందిరాన్ని దర్శించారని మంత్రి తెలిపారు.ప్రజలందరికీ నీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు వంటి ప్రభుత్వ సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధికి జరుగుతున్న కృషిలో జమ్మూ కాశ్మీర్ పాత్ర కీలకంగా ఉంటుందని మంత్రి అన్నారు.
***
(Release ID: 1991934)
Visitor Counter : 80