రక్షణ మంత్రిత్వ శాఖ
అమరవీరుల కుటుంబాలతో పాటు సైనికులు, మాజీ సైనికులు, వారిపై ఆధారపడినవారి సంక్షేమం దేశ సమిష్టి బాధ్యత ః రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సాయుధ దళాలను అత్యాధునిక ఆయుధాలతో సన్నద్ధం చేస్తోంది; దుష్ట ఆలోచనతో కన్నెత్తి చూసిన ఎవరికైనా తగిన సమాధానం ఇస్తాం
Posted On:
30 DEC 2023 8:33PM by PIB Hyderabad
సురక్షితమైన భారతదేశానికి పునాదిగా నిలుస్తూ, సాటిలేని త్యాగం, నిబద్ధత, దేశభక్తితో వీరమరణం పొందిన అమర వీరుల కుటుంబాల సంక్షేమం, సేవలందిస్తున్న, పదవీవిరమణ చేసిన సైనికులు, వారిపై ఆధారపడిన వారి సంక్షేమాన్ని చూడడం దేశం సమిష్టి బాధ్యత. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన హీరోల పరాక్రమాలను, త్యాగాలను గౌరవించేందుకు, వారి కుటుంబాలకు తోడ్పాటును అందించేందుకు గుజరాత్‌లోని సూరత్‌లో డిసెంబర్ 30, 2023న ఒక ఎన్జీవో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పై వ్యాఖ్యలు చేశారు.
ఈ వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ, తమ మాతృభూమి ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించే సైనికులకు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రభుత్వ విధానమైన తొలుత భారత్, భద్రత మొదట వైఖరికి అనుగుణంగా విజయవంతంగా తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్న సాయుధ దళాల సిబ్బందిని ఆయన కొనియాడారు. సరిహద్దులు భద్రంగా ఉన్నాయని తెలుసు కనుకనే జాతి నిర్మాణానికి ప్రజలు దోహదం చేస్తున్నారనని ఆయన అన్నారు. దేశం మొత్తాన్ని ప్రకాశింప చేసే ఈ వజ్రాలను తయారు చేసినందుకు ఆయనవారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
యువతను అసాధారణమైన సైనికులుగా మార్చే ప్రక్రియకు, వజ్రాలను సృష్టించే ప్రక్రియకు మధ్య పోలికలను రక్షణ మంత్రి పట్టి చూపారు. అత్యధిక ఉష్ణోగ్రరత, వత్తిడి కర్బన అణువులను వజ్రంగా మార్చినట్టే, సవాళ్ళతో కూడిన పరిస్థితుల కింద సైనికులు దేశాన్ని సేవించడం అన్నది సాధారణ యువతను కూడా వజ్రాలలా మలుస్తుందన్నారు. వారి ప్రకాశంతో, ఈ వజ్రాలు మనను అంధకారం నుంచి కాపాడతాయని ఆయన అన్నారు.
డబ్బును కేవలం ఒక మార్గంగా చూడాలే తప్ప జీవిత అంతిమ లక్ష్యంగా చూడకూడదని ఉద్ఘాటిస్తూ, వ్యక్తిగత లాభాలకన్నా జాతి నిర్మాణానికి ప్రాధాన్యతను ఇవ్వవలసిందిగా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ అవకాశాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉపయోగించుకున్నారు. ఆయన గుజరాత్ చారిత్రిక ప్రాముఖ్యతను గురించి, దేశ ప్రగతిలో దాని పాత్ర గురించి కూడా ప్రసంగించారు. తన సాహిత్యం, అంకితభావం ద్వారా సమాజాన్ని ఏకం చేసిన కవి నరసింగ్ మెహతా, మనకు స్వాతంత్ర్యం వచ్చేందుకు కారణమైన జాతి పిత మహాత్మా గాంధీ ఆదర్శాలు & సిద్ధాంతాలు; దఏశ ఐక్యతను & సమగ్రతను బలోపేతం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠను పెంచి, దేశాన్ని సంపన్నత, భద్రతా పథంలో ముందుకు తీసుకువెళ్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వంటి ప్రముఖులు జన్మించిన రాష్ట్రం గుజరాత్ అన్నారు. వీరితో పాటుగా, తమ జీవితాలను పణంగా పెట్టి మన సరిహద్దుల భద్రతలను కాపాడుతున్న అసంఖ్యాక సైనికులకు కూడా ఇది జన్మస్థలమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం సాయుధ దళాలకు అండగా నిలిచి, ముప్పుల నుంచి దేశాన్ని కాపాడేందుకు వారికి అత్యాధునిక ఆయుధాలను, వేదికలను అందిస్తోందని రక్షణ మంత్రి తెలిపారు. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని, మనవైపు దుష్ట ఆలోచనలతో కన్నెత్తి చూడాలనుకునే వారు ఎవరికైనా తగిన సమాధానం చెప్తుందని అన్నారు.
***
(Release ID: 1991930)
Visitor Counter : 113