రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లద్దాఖ్‌లో రూ.1170.16 కోట్ల విలువైన 29 రహదారి నిర్మాణ ప్రాజెక్టులను మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 29 DEC 2023 11:35AM by PIB Hyderabad

కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో 29 రహదారి ప్రాజెక్టుల కోసం రూ.1170.16 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర రహదారి, ప్రధాన, జిల్లా రహదారుల నిర్మాణం కూడా కలిసి ఉన్నాయి. 2023 24 ఆర్థిక సంవత్సరానికి, సీఆర్‌ఐఎఫ్‌ పథకం కింద 8 వంతెనల నిర్మాణం కోసం మరో రూ.181.71 కోట్లు కేటాయించినట్లు శ్రీ గడ్కరీ ట్వీట్‌ చేశారు.

వైశాల్యం పరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం, దేశంలో రెండో అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతమైన లద్దాఖ్‌లో, ఈ ప్రాజెక్టుల ద్వారా మారుమూల గ్రామాలకు రహదారి అనుసంధానం మెరుగుపడుతుందని శ్రీ గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, ముఖ్యంగా వ్యవసాయం, పర్యాటక రంగం కళకళలాడుతుందన్నారు. లద్దాఖ్ మొత్తం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

***


(Release ID: 1991466) Visitor Counter : 144