శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పుట్టగొడుగుల నుండి వచ్చే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొవిడ్-19 మరియు ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి
Posted On:
29 DEC 2023 11:48AM by PIB Hyderabad
సహజమైన యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిథ్రాంబోటిక్ ఉత్పత్తులు విస్తృత శ్రేణి నుండి సులభంగా లభించే పుట్టగొడుగులు మరియు వాటి బయోయాక్టివ్ అణువులు కోవిడ్‌తో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కొత్త అధ్యయనం తెలిపింది.
రోగనిరోధక శక్తిని పెంచే బయోయాక్టివ్ పదార్థాలపై దృష్టి సారించడానికి కొవిడ్-19 మహమ్మారి దారితీసింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సార్స్-కోవ్-2 నుండి రక్షించడానికి మరియు ఈ వైరస్ వేగవంతమైన ప్రసారాన్ని పరిమితం చేయడానికి రోగనిరోధక శక్తిని పెంచే బయోయాక్టివ్ సమ్మేళనాలపై అధ్యయనాలను పునఃప్రారంభించారు. పర్యవసానంగా మూలికా మూలాలు మరియు తినదగిన పుట్టగొడుగుల నుండి బయోయాక్టివ్ సమ్మేళనాలు వాటి సులభంగా లభ్యత, అధిక యాంటీఆక్సిడెంట్ చర్య, పోషక విలువలు మరియు తక్కువ దుష్ప్రభావాల కారణంగా వాణిజ్యపరమైన ఆసక్తిని పొందాయి.
పుట్టగొడుగులు ఒక ప్రసిద్ధ ఆహార వనరు మరియు ఈశాన్య భారతదేశం వివిధ రకాల తినదగిన పుట్టగొడుగులకు నిలయంగా ఉంది. పుట్టగొడుగులకు పెరుగుతున్న జనాదరణ, కోవిడ్-19 మరియు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి పుట్టగొడుగుల నుండి తినదగిన పుట్టగొడుగు మరియు సహజ సమ్మేళనాల ప్రాముఖ్యతను విమర్శనాత్మకంగా విశ్లేషించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ)కి సంబంధించిన స్వయంప్రతిపత్త సంస్థ ఐఎఎస్‌ఎస్‌టి పరిశోధనలకు దారితీసింది.
ఐఎఎస్‌ఎస్‌టి డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిస్ కె ముఖర్జీ నేతృత్వంలోని పరిశోధనా బృందం డాక్టర్ అపరూప్ పాత్ర, డాక్టర్ ఎం. ఆర్. ఖాన్, డాక్టర్ సాగర్ ఆర్. బార్గే, గౌహతిలోని ఐఎఎస్‌ఎస్‌టికి చెందిన మిస్టర్ పరన్ బారుహ్‌లతో సహా కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రస్తుత చికిత్సల విశ్లేషణను నిర్వహించింది. సహజ యాంటీ-ఇన్ఫెక్టివ్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిథ్రాంబోటిక్ ఉత్పత్తులతో పాటు సులభంగా లభించే పుట్టగొడుగులు మరియు వాటి బయోయాక్టివ్ అణువుల విస్తృత శ్రేణి నుండి తీసుకోబడింది.
సమీక్షా కథనంలో సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో 13 విభిన్న పుట్టగొడుగుల నుండి ఉత్పన్నమైన బయోయాక్టివ్ సమ్మేళనాల పాత్రలు మరియు మెకానిజమ్‌లను శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మరియు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, సైటోకిన్ మరియు థ్రోంబోటిక్ మరియు కార్డియోవాస్కులర్ వంటి దాని ఇన్‌ఫెక్షన్‌తో సంబంధం ఉన్న పాథోఫిజియాలజీని అంచనా వేశారు.
పుట్టగొడుగులలో బయోయాక్టివ్ పాలీశాకరైడ్‌లు మరియు ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు ఇతర ఔషధ గుణాలున్న సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనంలో వెల్లడయింది. సార్స్-కోవ్-2కి వ్యతిరేకంగా ఆశాజనకమైన ఫలితాలతో పుట్టగొడుగుల ఆధారిత ఔషధాలను మానవ ట్రయల్స్‌లో పరీక్షిస్తున్నట్లు కూడా తెలిపింది.
వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా తినదగిన పుట్టగొడుగులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే- అవి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌గా ఉపయోగించవచ్చు మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జర్నల్ ఆఫ్ ఫంగీలోని అధ్యయనం కూడా లోతైన ప్రీ-క్లినికల్ మరియు క్లినికల్ అధ్యయనాల ద్వారా పుట్టగొడుగుల నుండి ఉత్పన్నమైన బయోయాక్టివ్ సమ్మేళనాల పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. ఈ విషయంలో పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు మరియు విధాన రూపకర్తల మధ్య సమన్వయం అవసరం.
ప్రచురణ లింక్: https://doi.org/10.3390/jof9090897
***
(Release ID: 1991458)
Visitor Counter : 132